Jump to content

చర్చ:దూదేకుల సిద్దయ్య

ఈ పేజీ లోని కంటెంటులకు ఇతర భాషలలో మద్దతు లేదు.
వికీపీడియా నుండి
ఈ వ్యాసాన్ని మెరుగుపరచడంలో భాగంగా, వ్యాసంలో బొమ్మ(లు) చేర్చమని కోరడమైనది. బొమ్మలు ఎక్కించడంలో సహాయం కోసం ఈ పేజీ చూడండి.
వికీప్రాజెక్టు తెలుగు ప్రముఖులు ఈ వ్యాసం వికీప్రాజెక్టు తెలుగు ప్రముఖులులో భాగంగా నిర్వహించబడుతుంది. ఈ ప్రాజెక్టు లక్ష్యం వికీపీడియాలో తెలుగు ప్రముఖులకు సంబంధించిన సమగ్రమైన సమాచారాన్ని పొందుపరచటం. మీరు కూడా ఇందులో చేరాలనుకుంటే, దయచేసి ప్రాజెక్టు పేజీని సందర్శించండి.
మొలక ఈ వ్యాసం నాణ్యతా కొలబద్దపై మొలక దశ-తరగతిగా విలువకట్టబడినది. (వ్యాఖ్యానాలు ఇవ్వండి)


ఈయన అసలు పేరు సిద్దయ్య కాదు, ఇది బ్రహ్మం గారు పెట్టిన పేరు అని విన్నాను. నిజమేనా? --వైఙాసత్య 06:43, 12 అక్టోబర్ 2006 (UTC)

  • ముస్లిముతల్లిదండ్రులు ఈయనకు సిద్దీఖ్ అనే పేరుపెట్టారంటారు. " సిద్ధుడు ఈశ్వరాంశ సంభూతుడు.పూర్వజన్మలో అతడు క్షత్రియుల ఇంట పుట్టి గోహత్య చేసి మహమ్మదీయుల ఇంట జన్మించాడు.ఆ గోహత్య పరిహారార్ధం నా శిష్యుడయ్యాడు.అతడు ఈ లోకాన్ని విసర్జించిన జ్ఞానయోగి.అతడికి అద్వైత విషయంలో ఆసక్తి కలిగి సిద్ధిని పొందాడు.అందుకే అతనికి సిద్ధుడని నామకరణం చేసి నా ప్రధమ శిష్యుని గావించాను" అని బ్రహ్మం గారు చెప్పినట్లు సుజాత గారి వ్యాసంద్వారా ఇప్పుడు తెలిసింది.మరుజన్మలేకుండా అతను సిద్ధి పొందాడంటారు.బ్రహ్మంగారు చెప్పిన సిద్దయ్య జన్మ రహస్యాన్ని బట్టి పూర్వజన్మలో గోహత్య చేసిన క్షత్రియులు మహమ్మదీయులుగా పుట్టిఉంటారని సూత్రీకరించుకోటానికి వీల్లేదు. --Nrahamthulla 04:54, 25 నవంబర్ 2008 (UTC)

బాస రాని సాయిబులు

[మార్చు]

దూదేకుల సిద్దప్ప(బ్రహ్మంగారి శిష్యుల్లో మహాజ్ఞాని)ఇతని పేరు సిద్దీఖ్.క్రమేణా సిద్దయ్య గా మారిందంటారు. ఆయనకి దూదేకను రాదంటే లోటా? అని సామెత. ఆయనకి దూదేకటం రాకపోయినా ఆయన గురువు గారి కాలజ్ఞానతత్వాలు పాడుకుంటూ బాగానే బ్రతికాడు. తులసి కడుపున దురదగొండిలా పుట్టాడని అతని తల్లితండ్రులు తిట్టి పోశారు. కులం తక్కువ వాడు కూటికి ముందా అని బ్రహ్మంగారి కొడుకులు (కంసాలీలు/విశ్వబ్రహ్మణులు) తన్ని తరిమేశారు. కానీ అతనికి తురకం (ఉర్దూ భాష) రాలేదని ఎవరూ తన్నినట్లు దాఖలా లేదు. కనీసం దాన్నొక లోటుగా ఎంచినట్లూ నాకు తెలియదు. ఆయన మాత్రం "ముట్టున బుట్టిందీ కులము" అని తెలుగు తత్వాలే పాడాడు. లింగిపెళ్ళీ మంగి చావుకొచ్చినట్లుంది దూదేకుల వాళ్ళ వ్యవహారం. చక్కగా సాయిబుల పేర్లు పెట్టుకుని సంఘంలోకెళితే, అసలు సిసలు సాయిబు (ఉర్దూ జబర్దస్తీగా మాట్లాడే మహారాజు) ఎదురైనప్పుడల్లా వచ్చీరాని భాషలో నంగినంగిగా మాట్లాడి, వంగి దండంపెట్టి వెళ్ళి పోవాల్సి వస్తోంది. ఆకుకు అందకుండా, పోకకు పొందకుండా పోతున్నారు మీరని అసలు అందులో పసలేదని చప్పడిస్తుంటారు. భాషవేరేగానీ భావమొక్కటేనంటాడు దూదేకులాయన. నీవు ఖానా అంటావు. నేను అన్నం అంటాను అంటాడు.ఇంత మాత్రానికే ఇదైపోవాలా అంటూ ఇదైపోతాడు. ఇటీవల 'పింజారీ వెధవ ' అనేతిట్టు టీ.వీ. సీరియల్స్ లో సినిమాల్లో విపరీతంగా వినబడుతోంది.బుర్రకధ పితామహుడు పద్మశ్రీ నాజర్ జీవిత చరిత్రను అంగడాల వెంకట రమణమూర్తి అనే ఆయన ఇటీవల "పింజారీ" అనే పుస్తకంగా ప్రచురించాడు. పుస్తకం చదివి వెనుకాముందూ తెలుసుకున్న వారు తమ తిట్ల నిఘంటువుని కొద్దిగా సవరించుకొన్నారట. కానీ ఇంకా కన్నూ మిన్నూ కానని దురహంకారంతో కులగజ్జితో భాదపడుతున్న సంభాషణా రచయితలున్నారు. "ఓరీ రజక చక్రవర్తీ" అంటే ఇంత పెద్ద పేరు మాకెందుకు దొరా? మీకే ఉండనివ్వండి అన్నాడట.అనటం తిరిగి అనిపించుకోవటం మన దేశంలో అనాదిగా ఉంది. "ఎస్సీ, ఎస్టీలపై అత్యాచార నిరోధక చట్టం" వచ్చిన తరువాత ఆయా కులాల పేర్లతో వారిని సంభోదించటానికే జంకారు.ఇప్పుడు రెడ్డి, నాయుడు, చౌదరి, రాజు, గుప్తా, శర్మ, గౌడ ల్లాగా వాళ్ళు కూడా మాల, మాదిగ అనే తోకల్ని సగౌరవంగా, సమధీటుగా తగిలించుకొని ఎదురు తిరిగి నిలబడితే, గుడ్లు మిటకరించి చూడటమే మిగతా వారి వంతయ్యింది. అయితే ఆతోకలతో పిలవచ్చా పిలవ కూడదా, పిలిస్తే ఎమవుతుందో అనే భయంతో మిన్నకుండా ఉన్నారు. ఒకనాడు అవమాన సూచికగా తిట్టుకు ఆలంబనగా ఉన్న కుల నామం ఈనాడు కబడ్ధార్ అని హెచ్చరించే స్థాయికి ఎదిగింది. రేపు పాదాభివందనం చేయించు కుంటుంది. అలాగే బాసరాని పింజారులు లద్దాఫులు నొచ్చుకోవద్దు క్రుంగిపోనక్కరలేదు. వృత్తిని కోల్పోయిన దూదేకుల వాళ్ళెంతో మంది ప్రస్తుతం ఆర్ధికంగా బలహీనులే. కానీ పవిత్రమైన ఆశయాలతో కృషి చేస్తే పదిమందికి వెలుగు చూపే చక్రవర్తులుగా "నూర్ భాషా"లుగా దూదేకుల సిద్దయ్య లాగామన్నన పొందుతారు.