చర్చ:నందోరాజా భవిష్యతి/వ్యాఖ్యానాలు
Appearance
ఇతరుల వ్యాఖ్యానాలను చేర్చుతున్నప్పుడు కోట్స్ వాడ్డం నయమేమో - ఆలోచించండి. ఇటాలిక్స్ ని గమనించడానికి చాలా సమయం పట్టింది నాకు. అలాగే "సాహిత్యవేత్త" హేలీ వంటివి పదాలు వాడేటప్పుడు కొంచెం జాగ్రత్తగా వాడడం ఉత్తమం. "పుస్తకం.నెట్లో రాసిన వ్యాసంలో హేలీ అన్న రచయిత ఇలా వ్యాఖ్యానించారు"- అని రాయడం సబబుగా ఉంటుందేమో? విశ్వనాథ వారి రచనలపై వివరంగా వికీ వ్యాసాలు రాస్తున్నందుకు ధన్యవాదాలు.
- అసూర్యంపశ్య గారూ! మీ సలహాలు బాగున్నాయి. వాటికి నా సమాధానాలు: 1. కోట్స్ వాడుకను గురించి ఆలోచించి చూడాలి. ఇటాలిక్స్ గమనించడానికి ఒక వాడుకరిగా మీరు ఇబ్బంది పడ్డారంటే ఏదో ఒక ఆల్టర్నేటివ్ ఆలోచించే తీరాలి. 2. సాహిత్యవేత్త అన్న పదాన్ని యధాతథ అర్థంలో సాహిత్యం గురించి తెలిసినవారు(వేత్త-తెలిసినవారు) అని వాడాను. ఐతే ఇప్పటి సాహితీలోకంలో ఆ పదాన్ని బాగా ఎత్తున పెట్టేశారనీ(దానికున్న అసలు అర్థాన్ని మించి), వాడి వాడి అరగదీసేశారనీ ఆ ప్రయోగం చేస్తున్నపుడు తట్టలేదు. ఐతే వ్యాకరణమూ, అర్థకోశమూ ప్రయోగశరణ్యమన్న విషయాన్ని అనుసరించి మీ సూచనను అంగీకరిస్తున్నాను. ఇకపై ఇటువంటి వాటి పట్ల జాగ్రత్త వహిస్తాను.--పవన్ సంతోష్ (చర్చ) 05:04, 9 ఏప్రిల్ 2014 (UTC)
- మరొక విషయమేంటంటే-నాకున్న అవగాహన ప్రకారం, ఈ పేజీ నందోరాజా భవిష్యతి అన్న వ్యాసం యొక్క నాణ్యతాపరమైన అంశాలను విలువకట్టే చర్చలకు నిర్దేశించిన పేజీ. ఐతే ఈ విషయాన్ని మీరు చర్చ:నందోరాజా భవిష్యతి అన్న పేజీలోనే విషయాన్ని చేర్చు అని వున్న ఆప్షన్ వాడి రాసివుంటే నేను మరింత త్వరగా వ్యాఖ్యానించి దిద్దుకునేందుకు పనికివచ్చేది. ఇప్పుడు నేను చాలా చుట్టుతిరిగు దారిలో మీరు చేసిన వ్యాఖ్యను చూశాను, అదీ యాక్సిడెంటల్‌గా :)--పవన్ సంతోష్ (చర్చ) 05:10, 9 ఏప్రిల్ 2014 (UTC)