చర్చ:నన్నయ్య
స్వరూపం
{{ఈ వారం వ్యాసం పరిగణన}}
లోపాలున్నాయి, ఈవావ్యాగా పనికిరాదు
[మార్చు]ఈ వ్యాసంలో కింది లోపాలున్నాయి.
- భాష తీరు కొన్ని చోట్ల మారిపోయింది. సరళ వ్యావహారికం నుండి శిష్ట వ్యావహారికాఅనికి మారిపోయింది. దాన్ని సవరించాలి.
- పై అంశాన్ని బట్టి, ఆయా భాగాలు వేరే ఏదైనా ప్రచురణ నుండి ఎత్తి రాసారేమోననేఏ సందేహం కలుగుతోంది. దాన్ని పరిశీలించాలి
- ఒకే ఒక్క మూలం ఉంది. మరిన్ని అవసరం.
- "నన్నయ అకాల మరణంపై ఒక కథనం" అనేది కొంత కట్టుకథ లాగా ఉంది. జీవిత చరిత్ర వ్యాసంలో అలాంటివి తగు మూలాలతో తగినంత సంగ్రహంగా ఉండాలి. ఈ వ్యాసంలో దీన్ని కుదించవచ్చనిపిస్తోంది. పరిశీలించాలి.
ఈ కారణాల వల్ల దీన్ని ఈవావ్యాగా పరిగణించడం కుదరదు. __చదువరి (చర్చ • రచనలు) 01:27, 28 మార్చి 2021 (UTC)