చర్చ:నస్తలీఖ్ లిపి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

నేను అనువాదం చేసే ప్రక్రియ నేర్చుకోవడం కోసం ఉదాహరణ ప్రయోగంగా చేసిన పుట ఇది. ఈ లిపి గుఱింఛి ఉన్న ఆంగ్ల పుట (Q1133121) కు దీనిని తగిలించడం నా ఉద్దేశ్యం. తెలిసిన వారు తెలియపరిస్తే కృతజ్ఞుణ్ణి. Pvr726 (చర్చ) 20:38, 11 సెప్టెంబర్ 2013‎

దీని ఆంగ్ల వికీలో పుట Nastaʿlīq script. దీనిని అనువదించండి.--Plume pen w.gif-- కె.వెంకటరమణ చర్చ 11:55, 12 సెప్టెంబర్ 2013 (UTC)

'ఎలా'[మార్చు]

వెంకటరమణ గారూ, కృతజ్ఞుణ్ణి. అనువాదం ప్రస్తుతానికి ఇంతే.. (తరువాత పెంచవచ్చు, కానీ ప్రస్తుతం నా ప్రశ్న అది కాదు).. ఇంతకు ముందు 4-5 అనువాదాలు చేసాను నేను. ఆంగ్ల పుటలో Languages అని ఉన్న చోటకి వెళ్ళి అప్పటికే ఉన్న భాషల కింద మరొక పంక్తి జతపరిచే వాడినన్నట్టు గుర్తు (ఈ పంక్తిలో నా తెలుగు పుట విలాసం, భాష TE అని సూచిస్రే చాలు).

ఈ విధానంలో మార్పేమైనా వచ్చిందా? Languages అని ఉన్న చోట మరొక పంక్తి జతపరిచే ఆస్కారం లేదిప్పుడు. కారణమేమంటారు?

మీ సమస్య అర్థమైంది. మీరన్నట్లు ఇదివరకు అంతర్వికీ లింకులు జతచేయడానికి ఆ వ్యాసంలోనే "ఆ భాష కోడ్:వ్యాసంపేరు" జతచేస్తే సరిపోయేది. అయితే ఆ లింకులు ఆ వ్యాసం ఎన్ని భాషలలో ఉంటే అన్ని వికీలలో చేర్చాల్సి ఉండేది. కాబట్టి కొంతకాలం క్రితమే ఆ పద్దతిని మార్పు చేసి wikidata.orgను ప్రత్యేకంగా అంతర్వికీల కోసం ఏర్పాటు చేశారు. అందులో ప్రతి వ్యాసానికి ఒక కోడ్ ఉంటుంది. మీరు సూచించిన కోడ్ ఇక్కడ ఉంది. ఇక్కడ చేరిస్తే చాలు ఈ వ్యాసం ఉన్న అన్ని భాషావికీలలో ఆటోమేటిగ్గా చేరిపోతుంది. అదివరకు బాటుద్వారా ప్రతివికీలలో మార్పుచేసే అవసరాని వికీడాటా తగ్గిస్తుందన్నమాట. ఈ వ్యాసం లింకు నేను అక్కడ చేర్చాను. సి. చంద్ర కాంత రావు- చర్చ 19:42, 12 సెప్టెంబర్ 2013 (UTC)

== చంద్ర గారూ, మీ జవాబుకి కృతజ్ణతలు, కాని నేను మీరు చెప్పిన పుటకి ముందే వెళ్ళాను, నా ఆఫీసు కంప్యూటర్ లో పాత విహరిణి (IE 8) ఉండడం వల్ల గాని, లేదంటే అనుమతి లేనందు వలనో add అనే లింకు పని చేయ లేదు. ఇప్పుడు ఇంట్లోంచి కనపడింది..అన్నట్టు, original page లో languages లింక్ నొక్కినా మీరు చెప్పిన వికీ డాటా పుటకే వెళుతోందండి.