చర్చ:పోతన భాగవతము
శ్రీమద్భాగవతమును ఆంధ్రీకరించి శ్రీమదాంధ్రభాగవతముగా రచించింది పోతనామాత్యులు. దానినే పోతన భాగవతముగా వ్యవహరించడం జరుగుతుంది. ఆ రెండూ ఒకటే అయినప్పుడు వేర్వేరు పేజీలు ఉండటం సాధ్యం కాదు. కాబట్టి విలీనం చేయడమే సరియైనది - శ్రీహరి ==
- భాగవతము అనేక పేర్లతో భారతదేశంలో వేదాంత కావ్య వాజ్ఞ్మయములో ప్రసిద్ధి చెందినది. ఇక్కడ ప్రస్తుతము రెండు పుటలు ఉన్నాయి. ఒకటి భాగతములోని భాగములు మరియు దాని విశిష్టత తెలియచెప్పునది. రెండవది మందార మకరంద మాధురీ ధురీణముతో, ఇందు గలడు అందు లేడు అను సందేహము వలదు అనే భక్తి పారవశ్యముతో తెలుగులో పోతన భాగవతమును పొందు పరచబడుటకు కేటాయించినది. మరి ఆ పుట పోతన భాగవతము యందు విషయము కారణమేదయిననూ ముందుకు సాగి వెళ్ళలేదు. ఇప్పుడు రెండు పుటలు కలిపిననూ తదుపరి పోతన భాగవతము వేరొకరు వ్రాయ వచ్చును.
జె.వి.ఆర్.కె.ప్రసాద్ 13:43, 15 జూలై 2011 (UTC)
- పోతన రచించిన మొదటి పద్యములోని ఆరు దళాలు భాగతమునందు ప్రస్ఫుటముగా సర్వేశ్వరుని లీలలు అయిన భగవతత్వాన్ని, భక్తపాలకుడు, దుష్ట శిక్షణ, ఉద్రేకులను నిర్వీర్యము చేయుట, వంశముల సృష్టి, సర్వస్వమైన ఆ ఆనందనందనుడు కథలు ఈ పద్యము ద్వారా పోతన పాండిత్యమునకు (పరాకాష్ట) మచ్చుతునక.
జె.వి.ఆర్.కె.ప్రసాద్ 14:10, 15 జూలై 2011 (UTC)
- వేరొకరు వ్రాసే అవకాశం ఉంది కాబట్టి రెండు పుటలనూ కలపటమే కాకుండా ఒకదానిని మరొక దానికి దారిమార్పు చేయవచ్చు. ఎందుకంటే మదాంధ్ర భాగవతమే పోతన భాగవతం, పోతన భాగవతమే మదాంధ్ర భాగవతం. భాగతములోని భాగములు మరియు దాని విశిష్టతలను శ్రీమద్భాగవతములో వివరించారు కాబట్టి దానికి మళ్ళీ వేరే పేజీ అవసరము లేదని నాఉద్ధేశ్యం. ఏమంటారు? - శ్రీహరి
- ప్రసాద్ గారూ! "పోతన ఇతర కృతులు" ను భాగవతములో కంటే బమ్మెర పోతన లో చేర్చటం సమంజసమేమో ఆలోచించండి - శ్రీహరి
- అవును, మార్చవచ్చును. నేను బమ్మెర పోతన పుట చూడ లేదు. ముందు ముందు ఏమైనా విషయములు అందులో జత చేస్తాను.
జె.వి.ఆర్.కె.ప్రసాద్ 06:45, 16 జూలై 2011 (UTC)
విలీన సమాచారము
[మార్చు]ఈ పేజీని క్రింద తెలిపిన కారణాలతో శ్రీమదాంధ్ర భాగవతములో విలీనం చేయబోతున్నామని తెలియజేస్తున్నాము. అభ్యంతరములు ఉన్నవారు ఈ చర్చా పేజీలో తెలియజేయగలరని మనవి.
1. శ్రీమదాంధ్ర భాగవతము పోతనచే రచించబడుటవలన దానికి పోతన భాగవతము అని వ్యవహరించడం జరిగింది.
2. ఈ రెండు పేజీలకు విడివిడిగా వ్రాయగలిగే సమచారము ఏమీ ఉండదని ఏమి వ్రాసినా అది రెండిటికీ చెందుతుందని అభిప్రాయం.
3. భాగవతము యొక్క సమాచారము, విశిష్టతలు శ్రీమద్భాగవతములో పొందుపరచడమైనది.
4. అయోమయమునకు లోను కాకుండా పోతన భాగవతము నుండి శ్రీమదాంధ్ర భాగవతము నకు దారిమార్పు చేయడం ద్వారా చదువరులు ఏ పేరుతో వెతికిననూ సమాచారము లభ్యం కాగలదు.