చర్చ:ప్లూటో
స్వరూపం
ఈ వ్యాసంలో కింది మార్పులు అవసరం.
- వ్యాస ధోరణి వికీపీడియాకు అనుగుణంగా లేదు. దాన్ని సంస్కరించాలి.
- ప్లూటో ద్రవ్యరాశి, పదార్థ సమ్మేళనం, వాతావరణం, ఉపగ్రహాలు, భ్రమణ పరిభ్రమణాలు తదితర భౌతిక రసాయనిక లక్షణాల వంటి గ్రహ లక్షణాల గురించి పెద్దగా సమాచారం లేదు. అవి చేర్చాలి.
- వ్యాసంలో సింహభాగం ప్లూటో ఎందుకు గ్రహం కాదు అనేది చెప్పడానికే సరిపోయింది. ఈ సమాచారాన్ని ఇక్కడ తగ్గించి, గ్రహం పేజీలో చేర్చడంమీ, "గ్రహ నిర్వచనం" అనో ప్లూటో గ్రహం ఎందుకు కాదు అనో మరో పేజీ పెట్టి అక్కడికి తరలించాలి.
- యురేనస్ (యూరెనస్, యురేనస్ - ఈ రెండూ కరెక్టే. రెండు విధాలు గానూ పలకొచ్చు) చరిత్ర ఈ వ్యాసంలో అనవసరం.
- ఏస్టరాయిడ్ల గురించి చెప్పినది కాస్త తగ్గిస్తే బాగుంటుంది.
దీన్ని ఈవావ్యాగా పరిగణించే ముందు పై పనులు చెయ్యాలి. __చదువరి (చర్చ • రచనలు) 04:30, 27 మార్చి 2021 (UTC)