చర్చ:బీబి నాంచారమ్మ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఈ వ్యాసాన్ని మెరుగుపరచడంలో భాగంగా, వ్యాసంలో బొమ్మ(లు) చేర్చమని కోరడమైనది. బొమ్మలు ఎక్కించడంలో సహాయం కోసం ఈ పేజీ చూడండి.


 ఈ క్రింది చర్చలో చాలా భాగం వ్యాసంతో సంబంధం లేనిది. దానిని పట్టించుకోవద్దు. పొడిగించవద్దు --కాసుబాబు 09:57, 27 ఆగష్టు 2010 (UTC)
  • తిరుపతి వెంకన్న భార్యలలో వొకరైన బీబీ నాంచారమ్మ కారణంగానైనా ముస్లిములకు టి.టి.డి.లో మూడవ వంతు వాటా ఇవ్వటం న్యాయమేననే వాదనకు ఆస్కారముంది.కనుక ఇస్లాం రచయితలను ఆహ్వానించకనే పోవటం తిరుపతి వెంకన్నకు కూడా అపచారం చేసిన దానితో అది సమానమే అవుతుంది.—దివికుమార్

మీరు ముందు మూలాలు పేర్కొనండి. తరువాత వాటాలకి రండి.. ఒక్క ముస్లిమ్ అయినా ఒక్క రూపాయి అన్నా పెట్టాడా తిరుపతిలో వాటాలు అడుగుతున్నారు. మత ఘర్షణలు ఊరికే జరగవు, ఇలా ఇతరుల ఆస్తులలో వాటా అడిగితేనే జరుగుతాయి. ఇలా వాటా అంటూ పాకిస్తాన్ , బాంగ్లదేశ తీసుకున్నారు, కాశ్మీరు కూడా కావాలంటున్నారు... ఇప్పుడు ఏకంగా తిరుపతికే ఎసరు పెట్టారు. నాంచారమ్మ అనేది హిందూ పేరు, ఆమె ముస్లిమ్ అని మీరు అనడానికి మూలాలు పేర్కొనండి. ఒక వేళ ముస్లిమ్ అయినా రూపాయి కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు. ఏ ముస్లిమ్ అయినా వెంకన్నని పూజించాడా , గుడి కట్టించాడా, హుండీ లో ఒక్క రూపాయన్నా వేశాడా? ఏ హక్కుతో వాటా అడుగుతున్నారు? ముస్లిమ్లు గుళ్ళలో బాంబులు పేల్చారే తప్ప ఇంకేం చేయలేదు. మీ మెక్కాలో వాటా అడిగితే మీకు ఎలా ఉంటుంది? --శశికాంత్ 13:22, 7 ఆగష్టు 2010 (UTC)

ఈ చర్చ వికీలో అనవసరం. అన్నట్టూ శశికాంత్ హుండిలో కానుకలు వేసే తురకలు నాకు వ్యక్తిగతంగా కొందరు తెలుసు :-) Chavakiran 13:59, 7 ఆగష్టు 2010 (UTC)
  • తెలుగుముస్లిముల్లో జరుగుతున్ననిజం ప్రాక్టికల్ గా చూశారు చావాకిరణ్ గారూ.బీబీ నాంచారమ్మ ఒక వేళ ముస్లిమ్ అయినా ఆమెను గౌరవించరా శశికాంత్?.ఆమె వారసులమని చెబుతూ మా బంధువుల్లో కొన్ని వందల కుటుంబాలు వెంకన్న కు ముడుపులు కడుతున్నాయి.అదే నా ధైర్యం.విజయవాడ వస్తే ఎన్నో గ్రామాల్లో తిప్పి చూపిస్తాను.మక్కా నాది కాదు.చస్తే ఆరడుగుల నేల మాత్రమే నాది.భారతీయ ముస్లిములు హజ్ యాత్రకోసం చేసే ఖర్చు,ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీ పేదముస్లిముల సంక్షేమానికిస్తే చాలు.ఎవరి వాటా అక్కరలేదు.గుళ్ళలో,మసీదుల్లో బాంబులు పెట్టే రాక్షసులవల్ల మత ఘర్షణలు పెరుగుతాయే కానీ ఎవరూ మారరు.మార్పు ప్రేమ ద్వారానే కలుగుతుంది.ముస్లిములు ఆ వెంకన్నను ఇష్టపడి నాంచారమ్మ లాగా మతం మారదలుచుకుంటే ఆమెను వెంకన్న చేర్చుకున్నట్లుగా హిందువులు చేర్చుకోవాలి.--Nrahamthulla 14:32, 7 ఆగష్టు 2010 (UTC)
  • జోగి జోగి రాసుకుంటే బూడిద రాలిందని సామెత. నేను ఏ వాక్యంలో నాంచారమ్మని కించ పరిచానో చెప్పండి. ఒక పక్క హిందువులను కవ్వించే వ్యాఖ్యలు చేస్తూనే మరో పక్క నీతులు వల్లిస్తున్నారు. తిరుపతి హిందువుల పుణ్యక్షేత్రం. అందులో వాటాలు అడిగితే ఎవ్వరూ ఊరుకోరు. ఐనా కురాన్ ప్రకారం కేవలం అల్లాహ్ మాత్రమే దేవుడు కదా. కాదంటారా? విగ్రహ పూజ చేసే వారిని చంపమని చెబుతుంది. మరి వెంకన్నని దేవుడిగా ఒప్పుకోని వారికి వాటాలు మాత్రం కావాలి. ఈ దేశంలో హిందువులకు మాత్రం సబ్సిడీలు లేవు కానీ ముస్లింలకి తీర్ధయాత్రలకి సబ్సిడీలు ఉన్నాయి. దీని బట్టి అర్ధం అవుతోంది కదా ఈ దేశంలో హిందువుల పరిస్ధితి. మతం మారితే అక్కున చేర్చుకుంటారా అని అడిగారు.... మీరు మారకపోయినా అక్కున చేర్చుకుంటారు. దానికి నిలువెత్తు సాక్షం పైన చావాకిరణ్ ఉన్నారు. కానీ మా ఉనికినే ప్రస్నార్ధకం చేస్తుంటే ? --శశికాంత్ 17:09, 7 ఆగష్టు 2010 (UTC)
  • మారిన వాళ్ళనే ఇలా కవ్విస్తూ ఉంటే ఎలా?తిరుపతిలో వాటా అడిగింది ముస్లిములు కాదు.దివికుమార్ అనే పెద్దాయన.అయినా ఈ చర్చ బీబీ నాంచారమ్మకు చెందినట్లులేదు.ఆమెకు సంబంధం లేని వ్యాఖ్యలన్నీతొలగించండి.--Nrahamthulla 02:10, 8 ఆగష్టు 2010 (UTC)
  • ఎవరో దారిన పోయే దానయ్య అన్న మాటలు రాస్తే కుదరదు. మూలాలు పేర్కొనండి. ఆ వ్యక్తి ఎవరు, ఏం చేస్తాడు, ? మొదటి నంచి నేను అడిగేది ఒక్కటే . మూలాలు. అవి లేకుంటే ఆ వాక్యాలని తొలగించండి. . --శశికాంత్ 05:11, 8 ఆగష్టు 2010 (UTC)
  • హహ్హహ... ఎవరో అనామకుడు రాసిన బ్లాగులో మరో అనామకుడు రాసిన కామెంటు తీసుకువచ్చి వికీలో రాశారు. దానికి ఆ బ్లాగుని మూలంగా చేర్చారు. ఇలాంటి మూలాలు పనికి రావు. బ్లాగులోని కామెంట్లని వికీలో చేర్చుకుంటూ పోతే ఇక అంతే సంగతులు... దానిని మీరే స్వయంగా తొలగించండి --శశికాంత్ 06:22, 8 ఆగష్టు 2010 (UTC)
  • మీ అమర్యాదకర వ్యాఖ్యలు ఉపసంహరించుకోండి.దివికుమార్ గారు దారిన పోయేదానయ్య కాదు.అనామకుడూ కాదు.ప్రజాసాహితి మాసపత్రిక సంపాదకవర్గ సభ్యులు."రావణకాష్టం" లాంటి పలుగ్రంధాల రచయిత.బ్రాహ్మణుడు.తెలుగు భాషోధ్యమకారుడు.--Nrahamthulla 06:29, 8 ఆగష్టు 2010 (UTC)
  • మొదట అనామకుడు అనే పదం అమర్యాద కాదు. మీకు ఆ వ్యక్తి పరిచయస్తుడే కావచ్చు, కానీ ఆ వ్యక్తి ఎవరో ఏంటో ఎవరికీ తెలీదు. అలాంటి వ్యక్తుల్ని అనామకులు అంటారు. మనం దినపత్రికలలో చదువుతూనే ఉంటాం, అనామకుడి చేతిలో ఫెదరర్ పరాజయం అని. మరి అది కూడా తప్పా. ఇహ రెండోది , దారిన పోయే దానయ్య అనేది ఒక సామెత. దానికి కూడా పైన పేర్కొన్న వివరణ వర్తిస్తుంది. అది తిట్టు కాదు. పరుష వాక్యం అంతకంటే కాదు. అయినా మీరు ఇబ్బంది పడ్డారు కనుక ఉపసంహరించుకుంటాను. కానీ అసలు విషయం, మీరు ఇచ్చిన మూలం వికీ నిబంధనలకు విరుద్ధం. అలా కామెంట్లు తీసుకు వచ్చి రాయకూడదు. మీరు బహుశా గమనించలేదు. ఆ లంకెలో ఉన్న వ్యాసం షేక్ కరీముల్లా గారి అభిప్రాయం. ఆ వ్యాసంలో దివికుమార్ అనే వ్యక్తి కామెంటు చేశారు. ఏ విధంగా చూసినా ఆ మూలం పనికిరాదు. --శశికాంత్ 06:44, 8 ఆగష్టు 2010 (UTC)
  • సొంత అభిప్రాయాలు ఏకపక్షరాతలు ఉంటే శుద్ధి చేయాలి కానీ ఇలావ్యాసాన్ని తొలగించాలని ప్రతిపాదించటం ఎంతవరకు సమంజసం?----Nrahamthulla 14:16, 25 ఆగష్టు 2010 (UTC)

తొలగింపు కోరటానికి కారణం[మార్చు]

ఈ వ్యాసాన్ని ఎందుకు తొలగించాలనుకుంటున్నారో నాకు సరిగా అర్ధం కాలేదు. ఎవరైనా వివరించగలరు --వైజాసత్య 15:04, 25 ఆగష్టు 2010 (UTC)

నాంచారమ్మ ముస్లిం అని సాంప్రదాయకంగా తెలిసినదే. దానికి మూలాలు కావాలంటే చాలా చోట్ల దొరుకుతాయి.[1] తెలుగు ముస్లిం అన్న దానికి ఆధారాలు లేవనుకుంటా. రహంతుల్లా గారు, శశికాంత్ గారు చెప్పినట్టుగానే బ్లాగులు వగైరా వనురులుగా వీలైనంత తక్కువుగా ఉపయోగించండి. శశికాంత్ గారూ, నాంచారమ్మ అన్న పేరు తెలుగు వాళ్ళలో కనిపించినా, తెలుగు పేరైనా, దాన్ని కారణంగా చూపి నాంచారమ్మ ముస్లిం కాదని ఏ ఆధారం లేకుండా కొట్టివేయలేము. నేననుకోవటం ఈ నాంచారు అన్నపదం తమిళ నాచ్చియార్ అన్న పదాల వ్యుత్పత్తి ఒకటే అనుకుంటా. ఉదాహారణకి అండాళ్ ను చూడికొడుత్త నాచ్చియార్ అన్నట్టే బీబీ నాంచారమ్మకు తుళుక్క నాచ్చియార్ అని తమిళంలో పేరున్నది. కాబట్టి నాచ్చియార్ లేదా నాంచారు నిర్ధిష్టమైన పేరు కాకపోవచ్చు. ఇక బీబీ అన్నది కూడా ఒక జెనెరిక్ ముస్లిం స్త్రీ పేరు అనుకుంటా. ఉదాహరణికి మా ఊళ్లో ముస్లిం/దూదేకుల వయసున్న మహిళలను బూమ్మ అని జెనెరిగ్గా పిలుస్తారు, బొంబాయిలో పనోడు రాము, పోలీసోడు పాండు అయినట్టు. ఇది నా ఆలోచన మాత్రమే. ఎవరైనా తమిళం తెలిసినవారు నచ్చియార్ అంటే ఏవిటో వివరించగలరు --వైజాసత్య 15:58, 25 ఆగష్టు 2010 (UTC)
నాచ్చియార్ అంటే దేవత అని ఇక్కడ ఉంది --వైజాసత్య 16:41, 25 ఆగష్టు 2010 (UTC)
మరికొంత సమాచారం ఇక్కడ --వైజాసత్య 16:45, 25 ఆగష్టు 2010 (UTC)
  • వైజాసత్య గారు, మీరు అయిపోయిన చర్చ గురించి మాట్లాడుతున్నారు. మీరు ఇచ్చిన లంకెను మీరు చదవలేదనుకుంట. ఒక సారి చదవండి. 31. Q .చదవండి. సూపర్‌గా ఉంది.ఇక్కడ
  • తొలగించడానికి కారణాలు: ఇక్కడ ఉన్న విషయం ఏమీ లేదు. కేవలం రెండు పాయంట్లు తప్ప మిగాతాది వ్యాసపరిమాణం పెంచడానికి పెట్టిన పాటలు, అభిప్రాయాలు. మొదటి పాయంటు ఆమె వెంకన్న భార్య అని, రెండొవది ఆమె ముస్లిం అని తప్ప మిగతా విషయంలో పస లేదు. ఈ రెండు కూడా వివాదాస్పదమే. సరైన ఆధారాలు లేవు. రెండు పాయింట్ల కోసం వ్యాసం అనవసరం అని నా ఉద్ధేశం. --శశికాంత్ 16:53, 25 ఆగష్టు 2010 (UTC)
  • ఈ కారణంతో తొలగించవచ్చని వికీ పాలసీ ఒకటి ఉంది. కింద పాలసీని చూడండి.
వ్యాసంలోని సమాచారం నిర్ధారణ కాలేదు: నిర్ధారణ పధ్ధతిని అనుసరించండి. నిజంగానే నిర్ధారణ చెయ్యలేనిదయితే, తొలగించవచ్చు.

కేవలం ముస్లింలచే కొల్లగొట్టకుండా తిరుపతిని రక్షించడానికి ఈ కథ అల్లి నట్టు మీరు పేర్కొన్న లంకెలో ఉంది. భారతదేశంలో ఎన్నో దేవాలయాలు కూల్చివేశారు ముస్లిం పాలకులు, మరి అంత బంగారం ఉన్న తిరుపతిని ముస్లింల నుంచి కాపాడటానికి ఈ కథ అల్లారని వాదన. ఆమె ముస్లిం అనీ, లేక ఈ కధ కల్పితమనీ నిర్ధారణ చెయ్యలేని విషయాలు. ఒకవేళ మీరు ఈ వ్యాసం ఉంచ దలిస్తే ఈ విషయాలు కూడా రాయడం సబబు. అంతేగాక ఆ పాటలు , ఆంగ్ల వాక్యాలు కూడా తొలగించాల్సి వస్తుంది. అప్పుడు వ్యాస పరిమాణం చిన్నదైపోతుంది. కానీ రెండు నిర్ధారణ చెయ్యలేని పాయంట్ల కోసం వ్యాసం అనవసరం. మీరు ఇచ్చిన ఆంగ్ల వికీలో ఎక్కడా బీబీ నాంచారమ్మ లేదా ముస్లిం అన్న పదాలు లేవు. ఆ ఆంగ్ల వ్యాసాన్ని అదే పేరుతో తర్జుమా చేసినా నాకు అభ్యంతరం లేదు. --శశికాంత్ 01:11, 26 ఆగష్టు 2010 (UTC)

The history of the Balaji incarnation on earth is given in an upapurana called Padmavati Purana. Both his consorts were incarnations of Lakshmi,neither came as muslims according to this Purana. Also the incarnation didnot take place in this Kali Yuga. It took place in a previous Kali yuga.Perhaps there may be some local superstitions created to bring harmony amongdifferent religions. మన దేవుళ్ళకి పురాణాల ప్రాతిపదికగా చేసుకోవాలి తప్పితే పుకార్లు మరియు కల్పిత కధలు కాదు. --శశికాంత్ 01:39, 26 ఆగష్టు 2010 (UTC)

నేను ఆ 31 ప్రశ్న చదివే, ఆ లింకును ఇచ్చానండీ :-) మీరు చెప్పినవన్నింటినీ నేను అంగీకరిస్తున్నాను. ఈ వివాదాస్పద విషయాలు కూడా వ్యాసంలో చేర్చాలి. ఈ ఆసక్తికరమైన వ్యాసాన్ని అభివృద్ధి పరచాలి కానీ తొలగించడానికి అంతగా హేతువు కనిపించడంలేదు నాకు. సమాచారం తక్కువ, సమగ్రత లోపించింది అని అంగీకరిస్తాను. నాంచారమ్మ కల్పన అయినా విషయప్రాముఖ్యతకు వచ్చిన లోటేం లేదు. వైజాసత్య 03:24, 26 ఆగష్టు 2010 (UTC)
  • ఆమె గురించి రకరకాల కధనాలున్నాయి.తిరుపతిని ముస్లింల నుంచి కాపాడటానికి బీబీ నాంచారి కథను కల్పించారనే వాదనకు ఆధారం ఏమిటి?నీలకంఠశాస్త్రి,డా.సి.వి.సుబ్బన్న శతావధాని లాంటివాళ్ళు రాసిన గ్రంధాలలో పస లేదా?పురాణాలు,ఆయా గ్రంధాలు చదివిన వారు క్రమేణా ఈ వ్యాసానికి విషయాలు జోడిస్తూపోతే భవిష్యత్తులో వ్యాసం సమగ్రంగా తయారవుతుంది.ఆమె మా మనిషి అనే నమ్మకంతో తిరుపతి పోతున్న లక్షలాది ముస్లిం భక్తులున్నమాట నిజం.మసీదులు,గుళ్ళూ కూలదోసే తీవ్రవాదులతో వీరికి ఎంతమాత్రం సంబంధం లేదు.విషయాలు అన్నీ ఒక్కరికే తెలియవు.కాస్త సమయమిస్తే తెలుగు ప్రజలు తమకు తెలిసిన సమాచారాన్ని చెప్పవచ్చు.ఆంగ్ల భాగాలను తెలుగులోకి మార్చవచ్చు.అభ్యంతరకరమైన విషయాలను తొలగించవచ్చు.దయచేసి వ్యాసాన్ని మాత్రం ఉంచండి.--Nrahamthulla 06:39, 26 ఆగష్టు 2010 (UTC)

అన్నమయ్య కీర్తన - నాంచారమ్మ[మార్చు]

ఈ వ్యాసంలో ప్రస్తావించిన అన్నమయ్య కీర్తన బీబీ నాంచారమ్మ గురించి కాదనుకుంట. ఎందుకంటే 1) ఇంతకు ముందు నేను అనుకున్నట్టే, నాంచారు అన్నపదం తమిళ నాచ్చియార్ అన్నపదం నుండి వచ్చింది. నాచ్చియార్ అంటే దేవత, అందరు దేవతలనూ నాచ్చియార్ అని ప్రస్తావించవచ్చు ఉదాహరణకు : చూడుకొడిత్త నాచ్చియార్. ఇక్కడ అన్నమయ్య నాంచారమ్మ అంటున్నది అలిమేలుమంగను మాత్రమే. (ఇద్దరినీ సంబోధించి ఉంటే మిగిలిన కీర్తనలో ఎక్కడా బహువచన ప్రసక్తి కనిపించదు). కాబట్టి అలిమేలుమంగమ్మనే అలిమేలుమంగమ్మ నాంచారు అన్నాడు తప్ప ఇక్కడ బీబీనాంచారమ్మ ప్రసక్తిలేదు అనుకుంటున్నాను. నేను సరిగా అర్ధం చేసుకొనలేదనుకుంటే తెలుగు బాగా తెలిసిన వాళ్ళెవరైనా వివరించగలరు --వైజాసత్య 02:10, 27 ఆగష్టు 2010 (UTC)

  • వైజాసత్య గారూ, సయ్యద్ మీర్జా గురించి నాకు ఇప్పటివరకూ తెలియదు.మూలవిరాట్టుకు అతను సమర్పించిన బంగారు పుష్పాలతో స్వర్ణ పుష్పార్చన చేయటం, ఉత్సవదేవతలైన శ్రీదేవి, భూదేవిలకు అతను సమర్పించిన మంగళసూత్రాలనే నేటికీ వేంకటేశ్వర కళ్యాణోత్సవంలో ఉపయోగించటం విశేషమే.ఇతనికీ బీబీ నాంచారికీ బందుత్వం ఏమన్నా ఉందా?ఎవరీ సయ్యద్ మీర్జా?అతని గురించి తెలిసిన వాళ్ళెవరైనా వివరించగలరు.--Nrahamthulla 03:41, 28 ఆగష్టు 2010 (UTC)