చర్చ:భవభూతి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఈ వ్యాసాన్ని మెరుగుపరచడంలో భాగంగా, వ్యాసంలో బొమ్మ(లు) చేర్చమని కోరడమైనది. బొమ్మలు ఎక్కించడంలో సహాయం కోసం ఈ పేజీ చూడండి.

కంపా శాస్త్రి గారు. నమస్తే. సీనియర్ వికిపీడియన్ అయిన మీనుండి భవభూతి ఆర్టికల్ కు ఎదో పొరపాటుగా ఒక పిట్ట కథ చేర్చబడి వుంటుంది అని భావిస్తూ వ్రాస్తున్నాను. ఈ పిట్ట కథ క్రింది కారణాల వల్ల కొంత అసమంజసంగా వుందనిపించి తొలగించాలని కోరుకొంటున్నాను. కాళిదాసు క్రీ.శ. 4 లేదా 5 వ శతాబ్దానికి చెందిన కవి. దండి క్రీ.శ. 6 లేదా 7 వ శతాబ్దానికి చెందిన కవి. ఇకపోతే భవభూతి క్రీ.శ. 8 వ శతాబ్దానికి చెందిన కవి. ఇలా విభిన్న కాలాలకి చెందిన కవులు ముగ్గురు కలసి ఒక ఆలయానికి వెళ్ళారని ఒక పిట్టకథలు వినడానికి ఓహో అనిపించవచ్చు కాని విజ్ఞానసర్వస్వంగా ఉండాల్సిన వికీపీడియా ఆర్టికల్స్ లలో పిట్టకథలు పోగుపడటం ఒకింత ఇబ్బందిగా ఉండవచ్చు అనిపిస్తుంది. భవభూతి గురించి సమాచారపరంగా రెండు ముక్కలు తెలుసుకోవాలనుకొనేవారికి పిట్టకథలు ఒకింత ఇబ్బందికరంగా వుంటాయి. అందులోను

  • ముగ్గురూ వేర్వేరు కాలాలకు చెందిన కవులు ఒకచోట కలుసుకోవడం అనేది చదువరులను తప్పుదోవ పట్టిస్తుంది. ఆ ముగ్గురూ కవులు సమకాలికులు అనే అభిప్రాయం wikipedia పాఠకులకు కలుగుతుంది. (అది పిట్ట కథ అని చెప్పినప్పటికీ)
  • ఆ పిట్ట కథలోనూ “ ఓసి లంజా ”, “ లంజకొడుకువు ” లాంటి పద ప్రయోగాలు ఉచ్చరించడానికి సభ్యతగా లేవు.
  • ప్రాధమికంగా wikipedia ఒక విజ్ఞాన సర్వస్వం వంటిది. తలా తోకా లేని పిట్ట కథలు లాంటివి ఆర్టికల్స్ లలో చొప్పించడం బాగుండదు అని భావిస్తున్నాను. తలా తోక లేని అనే పద ప్రయోగం ఎందుకు చేయవలసి వస్తున్నది అంటే- ఉదాహరణకు డోనాల్డ్ ట్రంఫ్ (US president) గురించి wiki లో ఒక ఆర్టికల్ వుంది. ఈ ఆర్టికల్ లో “ఒకసారి డోనాల్డ్ ట్రంఫ్, జార్జ్ వాషింగ్టన్, జాన్. ఎఫ్. కెనడీ లు ముగ్గురూ కలసి ఒక రెస్టారెంట్ లో కూర్చోని సరదాగా మాట్లాడుకొంటున్నారు. ... “ అంటూ ఒక పిట్ట కథ చేరుస్తే ఎంతో అసందర్భంగా, అసమంజసంగా వుంటుంది. ఈ రకమైన పిట్ట కథల వలన విజ్ఞానాధారితంగా, సమాచార పరంగా ఆర్టికల్ లో ఉండాల్సిన గంభీరత తగ్గిపోతుంది. పైగా విశ్వసనీయత కూడా దెబ్బతింటుంది. మీకు తెలియనిది కాదు. అందుకే మీరు చేర్చిన పిట్టకథను కొంతమేరకు స్వతంత్రించి తొలగిస్తున్నాను.