చర్చ:భారత స్వాతంత్ర్య సమరయోధులు-జాబితా
స్వరూపం
భారత స్వాతంత్య సమరంలో రాష్ట్రాలుగా విడగొట్టడం ఏమీ బాగుండదు. అప్పుడు భారతదేశం అంతా ఒక్క తాటి మీద, ఒకే ధ్యేయం కోసం పోరాడింది. సమరయోధుల్ని అక్షర క్రమంలో ఏర్పాటుచేస్తే సరిపోతుంది. సభ్యులందరూ కలసి భారత స్వాతంత్ర్య పోరాటం మీద సమగ్రమైన వ్యాసం తయారుచేస్తే బాగుంటుంది. వీరందరి కష్టాన్ని భావి తరాలకు తెలియజేయాలి.Rajasekhar1961 05:40, 13 జనవరి 2009 (UTC)
- విడగొట్టాలనుకున్ననూ మరో ఇబ్బంది ఏమిటంటే అప్పటి రాష్ట్ర భౌగోళిక సరిహద్దులకు, ఇప్పటి సరిహద్దులకు చాలా తేడా ఉంది. పేర్లలో కూడా తేడా కనిపిస్తుంది. అప్పుడున్న రాష్ట్రాల పేర్లు కొన్ని ఇప్పుడు లేవు కూడా. అప్పటి రాష్ట్రాలు ఇప్పుడు విభజించబడ్డాయి లేదా పేర్లు మార్పు చెందాయి. అలాంటప్పుడు వారిని ఏ రాష్ట్రంలో ఉంచాలనేదానిపై వివాదం రావచ్చు. -- C.Chandra Kanth Rao(చర్చ) 11:57, 13 జనవరి 2009 (UTC)