చర్చ:మదనపల్లె

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
Cscr-candidate.svg మదనపల్లె వ్యాసం తెలుగు వికీపీడియా మొదటి పేజీలో ఈ వారపు వ్యాసం శీర్షికలో ప్రదర్శన కోసం పరిగణింపబడుతున్నది.
Wikipedia

మదనపల్లె చరిత్ర గురించి ఆంగ్లంలో వ్రాయబడిన ఒక పుస్తకాన్ని గతంలో నేను చదివాను. 'Madanapalle: The blessed jewel of Andhra Pradesh' అనే పేరుతో ఉన్న ఆ పుస్తకంలో మదననపల్లెకు ఆ పేరెలా వచ్చిందన్న విషయాన్ని మొదలుకుని గత చరిత్ర చాలా కూలంకుశంగా వ్రాయబడి ఉన్నది. ప్రస్తుతం అమెరికాలో ఉండటం మూలాన ఆ పుస్తకం నాకు అందుబాటులో లేదు. ఆ పుస్తకం ఎక్కువ సంఖ్యలో ప్రచురింపబడి ఉండకపోవచ్చు. మదనపల్లెలోని గ్రంథాలయాలలో దొరికే అవకాశం ఉంది. సభ్యులెవరైనా చొరవ తీసుకుని ఆ పుస్తకం సంపాయించగలిగితే ఎన్నో విషయాలను మదనపల్లెను గురించిన వ్యాసానికి చేర్చవచ్చని నా మనవి.

నాకు తెలిసినది ఈ ఒక్క పుస్తకమే. సభ్యులెవరికైనా వేరే పుస్తకాల వివరాలు తెలిసి ఉన్నట్టైతే ఇక్కడ తెలియజేయవలసిందిగా ప్రార్థన. Namboori 04:37, 10 ఫిబ్రవరి 2008 (UTC)

నేను సాధారణంగా ఇలాంటి విషయాలపై సమాచారం కొరకు గూగూల్ బుక్స్ లో శోధిస్తుంటాను. ఈ ఫలితాలు చూడండి [1] --వైజాసత్య 05:53, 10 ఫిబ్రవరి 2008 (UTC)
ప్రస్తుతం మదనపల్లెలో వుంటున్నవారు, మదనపల్లెకు చెందిన ప్రముఖ ప్రదేశాల చిత్రాలు, ప్రముఖుల ఫోటోలు ఏవైనా వుంటే అప్లోడ్ చేసేది. సరైన వాటిని వ్యాసంలో చేర్చడానికి అనుకూలంగా వుంటుంది. అహ్మద్ నిసార్ (చర్చ) 15:50, 10 జూలై 2014 (UTC)