చర్చ:మహాప్రస్థానం
Jump to navigation
Jump to search
పుస్తకం వికీలో చేర్చడం
[మార్చు]మహా ప్రస్థానం మొదటి అచ్చు విడుదలై సుమారుగా 55 సంవత్సరాలైంది, కాని చదివిన ప్రతీ సారి కొత్తగా అనిపిస్తదంటే అతిశయోక్తి కాదు. మహా ప్రస్థానం మరియు ఖడ్గసృష్టి లోని ప్రతి కవితను వికిపీడియాలో ప్రచురిస్తే ఎలా ఉంటుందంటారు? కాపీరైట్లు విస్మరించలేని విషయమైనా ఎందరో అభిమానులు వాటి ప్రతిని దొరకబట్టుకోలేక వాటికి దూరమైపోతున్నారని అనిపిస్తుంది. --2005-12-02T23:16:23(UTC) Japes
- ఇదివరకు శ్రీ శ్రీ తనయుడు వెంకటరమణ తో ఇదే విషయం ప్రస్తావించాను, కాపీరైట్లు ఉల్లంఘన అవుతుందని అయన వెబ్‌సైట్లో పెట్టలేదని, దీనివల్ల పుస్తకాల అమ్మకాలమీద ప్రభావం పడుతుందెమో అని అన్నారు. ఇంటర్‌నెట్ లో తెలుగు సాహిత్యం కోసం వెదికేవారు సాధారణంగా విదేశాలలో ఉన్నవారు, ఎక్కువ శాతం మంది పుస్తకాలు కొని చదవాలనుకున్నా చాలకారణాలవల్ల అది సాధ్యపడదు. మహా ప్రస్థానం మరియు ఖడ్గసృష్టి లోని కవితలను వికీపీడియాలో చేరుస్తే బాగుంటుంది, చాలా మందికి అందుబాటులో ఉంటుంది అని నా అభిప్రాయము, మీరంతా ఏమంటారు? (ఇటువంటి విషయాల గురించి రచ్చబండ లేదా Google forum లో polls నిర్వహిస్తే బాగుంటుందని అనిపిస్తుంది, దీనిగురించి కూడా మీ స్పందన?) - జయ ప్రకాశ్ 17:46, 2 డిసెంబర్ 2005 (UTC)
- మీరన్నట్లు కాపీహక్కుల గొడవ లేకపోతే, అలా చెయ్యవచ్చు..చెయ్యాలి కూడా. అయితే దానికి వికీపీడియా కంటే వికీసోర్స్ సరైన చోటు. రచ్చబండలో ఇటువంటి పోల్స్ పెట్టవచ్చనుకుంటా. __చదువరి 17:52, 2 డిసెంబర్ 2005 (UTC)
- మంచి ఆలోచన. కాపీ రైట్ల గొడవ లేకుంటే వికిసోర్సెస్ కానీ వికిపుస్తకాలలో కానీ చేర్చవచ్చు --వైఙాసత్య 20:17, 2 డిసెంబర్ 2005 (UTC)
- ఇప్పుడు వచ్చిన చిక్కల్లా, కాపీరైట్ల నిర్ధారణ ? మహా ప్రస్థానం మరియు ఖడ్గసృష్టి యొక్క కాపీరైట్లు ఎవరికి చెందినవి, వారిని సంప్రదించి ఒప్పించుట ఎలా? లేక వికీసోర్స్ లో చెప్పినదాని ప్రకారం ఇదివరకు ప్రచురించినవి కూడా చేర్చొచ్చు అని ఉన్నది, కాబట్టి మనం ప్రచురణకర్తలను సంప్రదించకుండా వికీసోర్స్ లో చేరిస్తే సబబుగా ఉంటుందా? - - జయ ప్రకాశ్ 20:40, 2 డిసెంబర్ 2005 (UTC)
- According to this (http://www.naukri.com/lls/copyright/section5.htm#22 ) the copyright is for 60 years after the death of author; So they are under copyright protection. Thus we need to avoid in putting in any wiki, other than one or two peoms. yE mE mata@h Chavakiran 09:20, 3 డిసెంబర్ 2005 (UTC)