చర్చ:ముచ్చివోలు
స్వరూపం
అదనపు సమాచారం
[మార్చు]ఈ వారం వ్యాసంగా ప్రకటించిన తరువాత చాలా అదనపు సమాచారం చేర్చాను. ఇతర సభ్యుల సలహాలు, సూచనలను ఆహ్వానిస్తున్నాను. -- రవిచంద్ర(చర్చ) 11:20, 11 ఏప్రిల్ 2009 (UTC)
- రవిచంద్ర గారూ, చాలా మంచి సమాచారం చేర్చారు. గ్రామల వ్యాసాలలో ఎలాంటి సమాచారం చేర్చాలి అన్న విషయంలో ఈ వ్యాసం మంచి ఉదాహరణ కాగలదు. సాధారణంగా గ్రామాల వ్యాసాలను కేవలం జాబితాలతో నింపెయ్యటం చూస్తుంటాము. బైకమ్మ గురించి, వరవకట్టడం గురించిన సమాచారం చాలా ఆసక్తికరంగా ఉంది. గ్రామచరిత్ర విభాగం మొత్తం బైకమ్మ గురించే ఉంది కాబట్టి ఆ విభాగానికి బైకమ్మ అని పేరు పెడితే బాగుంటుంది. ఇక గ్రామ చరిత్రలో ఎలాంటి విషయాలు వ్రాయవచ్చు అంటే..నేను వెతికినంతవరకు అక్కుర్తికి, ముచ్చివోలుకు అవినాభావ సంబంధం ఉన్నట్టుంది. కొన్నిచోట్ల ముచ్చివోలుకు పోస్టాఫీసు అక్కుర్తి అని ఉంది. ఇంతకుముందేమైనా ముచ్చివోలు అక్కుర్తి పంచాయితీలో ఉండేదా? --వైజాసత్య 13:20, 11 ఏప్రిల్ 2009 (UTC)
- రవీ! నా ట్రిక్కు పని చేసింది. నువ్వు ఈ వూరిలో పెరిగావని నీ సభ్యుని పేజీలో వ్రాశావు గనుక నీతో బలవంతంగా వ్రాయించడానికి "ఈ వారం వ్యాసం పరిగణన" బోర్డు పెట్టాను! ఇక వైజా సత్య వూరేమిటో కనుక్కోవాలి. --కాసుబాబు - (నా చర్చా పేజీ) 18:11, 11 ఏప్రిల్ 2009 (UTC)
- ప్రోత్సాహం, నిత్య నూతన బలం. :-) అహ్మద్ నిసార్ 19:00, 11 ఏప్రిల్ 2009 (UTC)
- రివ్యూ చేసిన వైజా సత్య గారికీ, కాసుబాబు గారికీ, అహ్మద్ నిసార్ గారికీ ధన్య వాదాలు. ఫోటోలు ఇంకా కొన్ని చేర్చాలి. ఈసారి మా ఉరెళ్ళినపుడు తీసుకువస్తాను. నిజమే కాసుబాబు గారి ట్రిక్కు పని చేసింది. ఈ వ్యాసం విస్తరించడం కొరకే నేను శనివారం సెలవైనా సరే (తీరికగా పనిచేయవచ్చు కూడా) ఆఫీసుకు వచ్చి, ఈ వ్యాసాన్ని విస్తరించాను. ఇకపోతే కాసుబాబు గారన్నట్లు అందరి సభ్యుల గ్రామాల గురించి సమగ్రంగా వ్యాసాలు పొందుపరిస్తే చూడాలని ఉంది. అది నిర్వాహకుల నుంచే ప్రారంభం కావాలి. -- రవిచంద్ర(చర్చ) 05:15, 12 ఏప్రిల్ 2009 (UTC)