చర్చ:ముస్లింలలో అపవిశ్వాసాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

ఈ వ్యాసము వ్రాసిన రచయితకు ఒక విజ్ఞప్తి, మీ, ఈ ప్రయత్నం బాగుంది, అభినందనలు. అలాగే ఈ విషయసేకరణ ఎక్కడిదో, దీనికి మూలాలేమిటో తెలిపితే, వీటికి ఎదురుగా వాటిని ఖండించే లేఖనాలను గానీ, వాటి విశదీకరణలు ఇవ్వడానికి ప్రయత్నిస్తాను. సభ్యుడు nisar 20:57, 3 ఏప్రిల్ 2008 (UTC)Reply[ప్రత్యుత్తరం]

  • కొంత వివరణ వ్యాసంలోనే ఇచ్చాను .అయితే ఈ తెగలను పట్టికరూపంలో పెట్టటం చేతకావడం లేదు. లేఖనాల ప్రకారం ఈ విశ్వాసాలు ఎందుకని తప్పో ఆయా తెగలకు ఎదురుగా పట్టికరూపంలో ఇస్తే ఎవరైనా తమ అపవిశ్వాసాలను సరిదిద్దుకుంటారు.--Nrahamthulla 15:58, 9 సెప్టెంబర్ 2008 (UTC)
  • పట్టిక తయారైనది. ఈ విశ్వాసాలు తప్పో ఒప్పో, ఖురాన్, హదీసుల ఆధారంగా వివరాలు ఇవ్వడానికి ప్రయత్నిస్తాను. కొంచెం సమయం పట్టవచ్చును, నిసార్ అహ్మద్ 16:40, 22 నవంబర్ 2008 (UTC)
  • షుక్రియా భాయ్ .సమయంపట్టినా పరవాలేదు.ఖురాన్, హదీసులు ఈ నమ్మకాలగురించి ఏంచెబుతున్నాయో రెఫరెన్సులు వాటికెదురుగా పేర్కొంటే ఈ విశ్వాసాలు తప్పో ఒప్పో ఎవరికివారే నిర్ణయించుకుంటారు.--Nrahamthulla 17:28, 22 నవంబర్ 2008 (UTC)
    • ఇస్లాంలో దర్గాలు,ఉరుసులు,సంగీతం,కవిత్వం,నాట్యం,నటన,సారాయి,వ్యభిచారం,వడ్డీ,మాఫియా,రాచరికం,నియంతృత్వం,ఫోన్లో పెళ్ళిళ్ళు ...లాంటివన్నీ నిషిద్ధమని ఖురాన్,హదీసులు ఘోషిస్తున్నా ఈ నిషిద్ధ రంగాలన్నిటిలో లక్షలాది ముస్లిం నిపుణులున్నారు.--Nrahamthulla 13:12, 7 ఏప్రిల్ 2010 (UTC)Reply[ప్రత్యుత్తరం]
  • నిసార్ అహ్మద్ భాయ్, 22 నవంబర్ 2008 న మీరిచ్చిన మాట ప్రకారం వివరాలకోసం ఎదురుచూస్తున్నాను.ఇది ఎంతో ప్రయోజనకరమైన సమాచారం అవుతుంది.----Nrahamthulla (చర్చ) 09:02, 20 ఫిబ్రవరి 2014 (UTC)Reply[ప్రత్యుత్తరం]
    • రహమతుల్లా గారూ, అబ్దుల్ ఖాదిర్ గారి "గియాసుల్-లుగాత్" లో తెగలు మరియు వాటి నమ్మకాలు/వాదనలు గురించిన మూలాలుంటే తెలుపేది. కారణమేమంటే, ప్రపంచంలో "ఇస్లామీయ పాఠాశాలలు-శాఖలు" గురించి చదివితే ఈ వ్యాసంలో వున్న అనేక శాఖల ఉనికి కానరాదు. అహ్మద్ నిసార్ (చర్చ) 12:16, 20 ఫిబ్రవరి 2014 (UTC)Reply[ప్రత్యుత్తరం]
  • నిసార్ అహ్మద్ భాయ్,వ్యాసంలో నాకుదొరికిన మూలాలు పేర్కొన్నాను.ఇంకా ఏమైనా అదనపు సమాచారం దొరుకుతుందేమోనని ' ఆలిమ్' లో కూడా వెతికాను.సంకలనకర్తలందరూ ఈ తెగల ప్రస్తావన మిష్కాత్ ఎ షరీఫ్ గ్రంథం మొదటి విభాగం 4 వ అధ్యాయం 2 వ వచనంలో ఉంది అని పేర్కొన్నారు తప్ప ఆయా పేర్లకు హదీసుల ఆధారాలు జోడించలేదు.షేక్ అబ్దుల్ ఖాదిర్ గారు అయితే ఇస్లాంలో 150 పైగా తెగలున్నట్లు గియాసుల్ లుగత్ లో తెలియజేశారట.అయినా అదొక నిఘంటువు మాత్రమే గానీ ప్రామాణిక గ్రంధం కాదు. కాకపోతే ప్రవక్త నోటినుంచి వెలువడిన ఈ 73 అనే అంకె ప్రామాణికమే కాబట్టి వ్యాసంలో జాబితాగా ఇచ్చిన తెగలు ప్రపంచవ్యాప్తంగా అందరికీ తెలిసిపోయాయి.కానీ ఆయా విశ్వాసాలు ఎందుకని తప్పో ఏ సంకలన కర్తా వివరించనేలేదు.తెగల పేర్లకంటే ఆ జాబితాలో చెప్పబడిన 72 రకాల "విశ్వాసాలు" ఖురాన్ హదీసుల ప్రకారం సరైనవా కాదా అనేది పండితులు చెప్పగలిగితే సాధారణ ముస్లిముల జ్నానం అపారంగా పెరుగుతుంది.----Nrahamthulla (చర్చ) 11:59, 22 ఫిబ్రవరి 2014 (UTC)Reply[ప్రత్యుత్తరం]