Jump to content

చర్చ:మూఢ నమ్మకాలు

ఈ పేజీ లోని కంటెంటులకు ఇతర భాషలలో మద్దతు లేదు.
వికీపీడియా నుండి

ప్రకాశం జిల్లా హేతువాద సంఘం, ఒంగోలు ఈ క్రింది డిమాండ్లు చేస్తోంది: రాజ్యాంగం ఆర్టికల్ 51 ఎ(హెచ్) ప్రకారం ప్రజలలో శాస్త్రీయ విజ్ఞానాన్ని, ప్రశ్నించే తత్వాన్ని, మానవ వాదాన్ని పెంచాలి. ప్రభుత్వం మూఢనమ్మకాల నిర్మూలనా కార్యక్రమాలు చేపట్టాలి. ప్రభుత్వం చేసే ప్రారంభోత్సవాలకు మతపరమైన విధానాలను అమలు పరచకూడదు. ప్రభుత్వ కార్యాలయాలలో దేవుని బొమ్మలు, మతపరమైన చిహ్నాలు తొలగించాలి. ప్రభుత్వ ఉన్నతాధికారులు ప్రజా ధనంతో గుళ్లు, గోపురాల చుట్టూ, బాబాల ఆశ్రమాల చుట్టు తిరగడం ఆపివేయాలి. ప్రాథమిక విద్య నుండి కులం, మతం, పురాణాలు లేని శాస్త్రీయ విద్యను అందించాలి. గత జూన్ నెలలో కేరళ ప్రభుత్వం దొంగ బాబాలను అరెస్ట్ చేసి, మకర జ్యోతి మానవ కల్పితమేనని స్పష్టంగా ప్రకటించింది. మన రాష్ట్ర ప్రభుత్వం సైతం ఈ విషయాన్ని స్ఫూర్తిగా తీసుకొని రాష్ట్రంలోని దొంగబాబాలను అరెస్ట్ చేసి వారి ఆశ్రమాలను స్వాధీనం చేసుకోవాలి. (http://www.andhrajyothy.com/editshow.asp?qry=/2009/feb/letters)--Nrahamthulla 07:07, 10 ఫిబ్రవరి 2009 (UTC)[ప్రత్యుత్తరం]

  • వ్యాసం బాగా అభివృద్ధిచేయాల్సి ఉన్నది. అసలు నమ్మకాలకు, మూఢ నమ్మకాలకు భేదాన్ని వ్యాసం ప్రారంభంలోనే తెలియజేస్తే బాగుంటుంది.Rajasekhar1961 06:02, 6 నవంబర్ 2009 (UTC)
  • వాస్తు దోషాలతోనేనా ఈ పరిస్థితి!

సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత, అంతకు ముందు పీఆర్పీ పలు రకాలుగా కష్టాలు ఎదుర్కోడానికి పార్టీ ప్రధాన కార్యలయం వాస్తు బాగాలేకపోవడమూ కారణమని పలువురు నేతలు అభిప్రాయపడుతున్నారు. పార్టీ కార్యాలయం మార్చితేగానీ పార్టీ పరిస్థితిలో మార్పు రాదనే వాదన వారు వినిపిస్తున్నారు. భవనానికి దక్షిణం పక్క టాయిలెట్ల నిర్మాణం, బోర్‌వెల్‌ వాస్తుకు పూర్తి విరుద్ధంగా ఉన్నాయని, జెండా దిమ్మెలూ ఇప్పుడున్న స్థానంలో ఉండకూడదని చెబుతున్నారు. (ఆంధ్రజ్యోతి7.11.2009)--Nrahamthulla 03:15, 7 నవంబర్ 2009 (UTC)

  • ప్రార్థనతోనే వ్యాధులు నయమవుతాయన్న మూఢనమ్మకంతో ఓ నిండుప్రాణం బలయ్యింది. కారంపూడికి చెందిన ఓ గర్భవతికి నాలుగు నెలల క్రితం ధనుర్వాతం వచ్చింది. తల్లి మూఢనమ్మకంతో ప్రార్థనలు చేస్తే వ్యాధి నయమవుతుందని వైద్యం చేయించలేదు. రెండు నెలల క్రితం ఆమె ఓ బిడ్డకు జన్మనిచ్చింది. అనంతరం వ్యాధి మరింతగా పెరిగి ఆ బాలింత మృతి చెందింది. ఇంత జరిగినా తల్లి తన కూతురు దేవుని దగ్గరకు వెళ్లిందని పేర్కొంది.http://www.eenadu.net/district/districtshow1.asp?dis=guntur#9--Nrahamthulla 16:38, 2 జనవరి 2010 (UTC)[ప్రత్యుత్తరం]
  • పాకిస్థాన్‌ అధ్యక్షుడు జర్దారీ తనకు ఎవరిదిష్టి తగలొద్దని, అరిష్టాలు దూరం కావాలని రోజూ మూగజీవాలను బలి ఇస్తున్నారు.క్షుద్ర విద్యలు, దుష్ట శక్తుల నుంచి రక్షించుకునేందుకు రోజూ ఒక నల్ల మేకను జర్దారీ బలిస్తారు మూగజీవాలను బలి పీఠం ఎక్కించే ముందు జర్దారీ వాటిని తాకుతాడు(ఈనాడు28.1.2010)