చర్చ:రామదూతస్వామి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఈ చర్చ పేజీకి సంబంధించిన వ్యాసం పేజీ తొలగించబడింది. ఆ తొలగింపు నేపథ్యాన్ని ఈ చర్చ పేజీ వివరిస్తోంది. అందుచేత ఈ చర్చ పేజీని తొలగించరాదు. అలాగే, ఈ చర్చ ముగిసిపోయింది కాబట్టి ఇకపై ఈ పేజీలో ఏమీ రాయకండి.

వ్యాసాన్ని పూర్తిగా తొలగించకుండా విమర్శలు తీసేసి సమతూకంగా సరిదిద్దితే బాగుండేది.భవిషత్తులో అతనిపై మంచి విషయాలుకూడా ఎవరన్నా జోడించేవారు కదా?--Nrahamthulla 17:10, 22 అక్టోబర్ 2009 (UTC)

విమర్శలు తీసివేస్తే మిగిలేది ఏమీ ఉండదు. వ్యాసం మొత్తం విమర్శనాత్మకంగానే ఉంది. ఒక వ్యక్తి వ్యాసం అంటే ఆ వ్యక్తి బాల్యం నుండి వర్ణన, సాధించిన కార్యాలు, గొప్పతనం, వృత్తి జీవితం తదితరాలతో పాటు విమర్శలు ఏమైనా ఉంటే పర్వాలేదు కాని ఈ వ్యాసం మొత్తం ఎలాంటి సమతూకంగా లేదు. నేను కూడా మీరు చెప్పినట్లే విమర్శలు మాత్రమే తొలిగించాను. వాటిని తొలిగించిన తరువాత వ్యాసం ఖాళీగా ఉంటుందని పేజీ కూడా తొలిగించాను. స్వామివారి చరిత్ర మీకు లభ్యమైతే మొత్తం చేర్చండి. వార్తాపత్రికలలో లభ్యమైన సమాచారం మాత్రమే కాకుండా పుట్టుపూర్వోత్తరాలతో సహా చేర్చాల్సి ఉంటుంది. పత్రికలో ఒక సంఘటనపై వార్త వస్తే కేవలం ఆ సంఘటనను మాత్రమే చేర్చలేము, అలా చేరిస్తే అది వ్యాసం అనిపించుకోదు. వ్యాసం అంటే ఒకవిషయంపై పూర్తి సమాచారాన్ని సమగ్రదృష్టితో చేర్చాల్సి ఉంటుంది. పత్రికలలో వచ్చిన మనకు గిట్టని. నచ్చని సంఘటనలు మాత్రమే తెవికీలో చేర్చడం బాగుండదు. -- C.Chandra Kanth Rao-చర్చ 19:17, 22 అక్టోబర్ 2009 (UTC)
  • స్వామిని గురించిన మొదటి సమాచారంలో అతని ఆశ్రమం ఎక్కడ ఉంది లాంటివి ఉన్నాయి.చరితంలోనైనా ఉంటే తిరిగి తెచ్చుకునే వీలు ఉండేది.వ్యాసంలో పదిమంది తమకు తెలిసిన విషయాలు జోడిస్తూ పోతే క్రమేణా సమగ్రత సంతరించుకుంటుంది అని నాఅభిప్రాయం.--Nrahamthulla 03:16, 23 అక్టోబర్ 2009 (UTC)
స్వామివారికి డి.జి.పి.కాళ్ళు మ్రొక్కడం అతని వ్యక్తిగత విషయం. దాన్ని కమ్యూనిస్టులు విమర్శించడం, వార్తాపత్రికలలో రావడం, ఆశ్రమంపై వివాదం తదితర విషయాలతో మనకేంటి పని ! ప్రయోజనకరమైన వ్యాసం అయితే తప్ప ఒక్కరోజు మాత్రమే వార్తాపత్రికలలో వచ్చే సంఘటనల గురించి తెవికీలో చేర్చాల్సిన అవసరం లేదని ఇంతకు క్రితమే చర్చ జరిగింది. వాటన్నింటినీ పరిగణలోకి తీసుకొనే పేజీతొలిగించడమైనది. -- C.Chandra Kanth Rao-చర్చ 17:01, 23 అక్టోబర్ 2009 (UTC)
  • సత్య సాయి బాబా వ్యాసంలో విమర్శలు వాటికి సమాధానాలు ఉన్నట్లే రామదూతస్వామి వ్యాసంలో కూడా విమర్శలూ ప్రశంసలూ ఉంటాయి.రామదూతస్వామి తెలుగువాడు.ఎంతోమంది అధికారులు నేతలను ప్రభావితం చేసిన ప్రముఖుడు.విశ్వాసం లేకుండా ఏ ప్రయోజనం లేకుండా అతని దగ్గరకు అంతమంది వెళ్ళరు?వ్యాసం అంటూ ఉంటే అసలు ఆయన చెప్పేది ఏమిటో తెలిసిన భక్తులు జోడించేవారు.--Nrahamthulla 03:33, 24 అక్టోబర్ 2009 (UTC)
  • వ్యక్తిగత హోదాలోనే కావలి ఆశ్రమాన్ని సందర్శించినట్లు ఆశ్రమంలో ఉన్న కుర్తాలం పీఠాధిపతి ని దర్శించుకునేందుకే వెళ్లానని డీజీపీ గిరీష్‌కుమార్‌ చెప్పారు.గుంటూరు ఎస్పీగా పనిచేస్తున్నప్పటి నుంచి పీఠాధిపతి తనకు తెలుసన్నారు. తన చర్య మతపరమైనది కాదన్నారు. లౌకికవాదానికి కట్టుబడి ఉన్నానని, ఆశ్రమసందర్శన తాను తీసుకునే నిర్ణయాలను ప్రభావితం చేయబోదన్నారు.(ఈనాడు24.10.2009)

రామదూతస్వామి గురించి చర్చ మొదలు పెట్టండి

చర్చను మొదలుపెట్టండి