Jump to content

చర్చ:రాయలసీమ సంస్కృతి

ఈ పేజీ లోని కంటెంటులకు ఇతర భాషలలో మద్దతు లేదు.
వికీపీడియా నుండి

రాయలసీమ సంస్కృతి వ్యాసంలో చేయవలసిన పనులు:

మార్చు - చరిత్ర - వీక్షించు - తాజా
  • ఈ బొమ్మలు సేకరించాలి - రాగిసంగటి, జొన్నరొట్టె, బంగినపల్లి మామిడిపండ్లు (సేకరించాను. సారంశంలో అవి ఏ వెబ్ సైట్ల నుండి తీసుకొన్నది వ్రాశాను. కావున ఇది తీసెయ్యండి.) sasi 12:15, 6 ఆగష్టు 2009 (UTC)
  • సీమ ఫ్యాక్షన్ ఆధారిత సినిమా పోస్టర్లతో ఒక చిన్న కొల్లాజ్ తయారుచెయ్యాలి (చేశాను. ఇది సరిపోతే ఈ పాయింటుని కూడా తీసెయ్యండి.) sasi 12:15, 6 ఆగష్టు 2009 (UTC)
  • మాండలికాలపై సమాచారం సేకరించాలి (ఇది చేయటానికి మీ సలహాలు సూచనలు అవసరం. చర్చించండి.) sasi 12:15, 6 ఆగష్టు 2009 (UTC)

విలీనం

[మార్చు]

హైదరాబాదు, హైదరాబాదు సంస్కృతికి వేర్వేరు వ్యాసములున్నవి కదా? పైగా భౌగోళికంగానూ, జనాభా పరంగానూ హైదరాబాదు కన్నా రాయలసీమ పెద్దది కదా? అందుకే ఈ పేజీని సృష్టించాను. కావున వేరేగా ఉంటేనే మంచిదేమో అని నా అభిప్రాయం. మీ అభిప్రాయాలను కూడా తెలపండి. sasi 07:08, 4 ఆగష్టు 2009 (UTC)

రాయలసీమ పేజీని ఈ సమాచారంతో విస్తరిస్తే చాలా బాగుంటుంది.Rajasekhar1961 07:36, 4 ఆగష్టు 2009 (UTC)
అలాగే విలీనం చేయండి! చేయగానే నాకు తెలపండి. sasi 08:23, 4 ఆగష్టు 2009 (UTC)
మీరు వ్యాస రచన ఆపవలసిన పనిలేదు. ఇది పూర్తయిన తర్వాత విలీనం సంగతి చూద్దా Rajasekhar1961 09:17, 4 ఆగష్టు 2009 (UTC)
ధన్యవాదాలు. ఇలాగే కొనసాగిస్తాను. sasi 10:13, 4 ఆగష్టు 2009 (UTC)
రాజశేఖర్ గారితో ఏకీభవిస్తున్నాను. ఈ సమాచారాన్ని ఒక ప్రత్యేక విభాగము గా రాయలసీమ పేజీ లో విలీనము చేయగలరు.--సుల్తాన్ ఖాదర్ 09:19, 4 ఆగష్టు 2009 (UTC)
వ్యాసం చక్కగా వస్తున్నది. కొనసాగించండి. రాయలసీమ అనే వ్యాసం కూడా పెద్దది అయ్యే ఆస్కారం ఉన్నది గనుక దీనిని ప్రత్యేక వ్యాసంగా ఉంచడమే మంచిదనుకొంటున్నాను --కాసుబాబు 11:33, 4 ఆగష్టు 2009 (UTC)
కాసుబాబు గారు! వచ్చేశారన్న మాట! ఈ మధ్య హైదరాబాదు మారాను. హైదరబాదులో ప్రదేశాలు కి ఫోటోలని జతపరచాలన్న మీ సలహాని పాటించే ఆలోచన ఉంది. సమయం దొరకగానే నా హ్యాండీక్యాం తో జతపరుస్తాను. ఆ పేజీ నుండి హైదరాబాదు సంస్కృతి కి వెళ్ళి అక్కడ కొంత రచించిన తర్వాత రాయలసీమ సంస్కృతి ని సృష్టించాలని స్ఫురించినది. అదీ బీజం. ఇప్పుడు మొక్క అయ్యినది. మీరంతా నా వెంట ఉండి దీనిని మహావృక్షంగా చేయాలని నా ప్రార్థన. sasi 12:01, 5 ఆగష్టు 2009 (UTC)

anecdotal evidence తో వచ్చే చిక్కులు

[మార్చు]

ఆంగ్ల పదాల్ని ఉపయోగించాల్సి వచ్చినందుకు క్షమించాలి. తెలుగు పదం స్ఫురించలేదు. వీరా గారూ ఈ వ్యాసం వ్రాయటానికి పూనుకున్నందుకు కృతజ్ఞతలు. ఇక ఈ వ్యాసం శైలిపై నేను చేసే వ్యాఖ్యలు ఈ వ్యాసం గురించే. మీ గురించి కాదు. కాబట్టి తగిన స్ఫూర్తితో తీసుకోగలరు.

ఈ వ్యాసాన్ని మీ అనుభవాలతో వ్రాస్తున్నట్టున్నారు. కానీ ఒక అనుభవాన్ని (anecdotal evidence) తీసుకోని దానిని empirical data తో సరిచూసుకొని వ్రాయగలిగితే ఇది అద్భుతమైన వ్యాసంగా తయారుకాగలదు. లేకపోతే ఏదో ఒక వారపత్రికలో స్వీయ అనుభవాలతో వ్రాసిన ఒక వ్యాసంగా మిగిలిపోతుంది.

ఉదహరణకు : మొదటి వాక్యంలోనే ఈ ప్రాంతంపై కర్ణాటక, తమిళ ప్రభావం ఎక్కువ అన్నారు. అది రాయలసీమ కేమీ ప్రత్యేకం కాదు. మహబూబ్ నగర్‌లో నారాయణ్‌పేట్, కొడంగల్, కోసిగి లాంటి ప్రాంతాల్లోనూ, రంగారెడ్డి జిల్లాలోని ధరూర్, తాండూర్ లాంటి ప్రదేశాల్లోనూ కన్నడ ప్రభావం ఉంది. అదిలాబాదు, బోథ్, గుడిహథ్నూర్ ప్రాంతాల్లో మరాఠీ ప్రభావం ఉంది, అలాగే శ్రీకాకుళంలోని పలుప్రాంతాల్లో ఒరియా ప్రభావం ఉంది. ఏ సరిహద్దు ప్రాంతం తీసుకున్నా ఎంతో కొంత పక్క ప్రాంతం ప్రభావం ఉండనే ఉంటుంది. రాయలసీమలో సరిహద్దులోని ప్రదేశాల్లో అలాంటి ప్రభావమున్నంత మాత్రాన మొదటి వాక్యంలో వ్రాయగలగినంత ముఖ్య విషయమేమీ కాదు అది.

అలాగే భాష గురించి ఇలా ఉట్టి కొన్ని పదాల జాబితాలు తయారుచేయటం వళ్ళ లాభం లేదు. ఓ ఫలానా పదాన్ని ఇలా అంటారా అనుకుంటాం కానీ నిజానికి రాయలసీమ మాండలికం గురించి ఏమీ తెలియజేయదు. అర్కైవ్స్.ఆర్గ్ లో వివిధ మాండలికాలపై చాలా పుస్తకాలున్నాయి. అందులో కొన్నింటిలో ఏయే మాండలికాలలో స్థూలంగా ఉఛ్ఛారణలో ఎలాంటి మార్పులు జరిగాయి. ఆ మాండలికం ఏర్పడిన విధానం చర్చించారు. అలాంటివి చదివి వ్రాయగలరు. (ఏదో వ్రాస్తుంటే మధ్యలో ఈయన రొద ఏంటి అనుకుంటున్నారా :-))
వెతికితే రాయలసీమ మరియు దాని సంస్కృతిపై కూడా కొన్ని పుస్తకాలు దొరకవచ్చు --వైజాసత్య 05:40, 5 ఆగష్టు 2009 (UTC)
మీ అభిప్రాయాలతో పరిపూర్ణంగా ఏకీభవిస్తున్నాను. వ్యాసంలో ఉండవలసిన అవసరం లేదు అని అనుకొన్న వాక్యాలన్నీ తీసెయ్యండి. సాధ్యమయినంత ఎక్కువ సమాచారం ఇవ్వాలన్నదే నా తాపత్రయం. ఆ తాపత్రయంలో నేను తప్పులు కుడా చెయ్యవచ్చు. దానిని సరి చేయవలసిన బాధ్యత మీదే కదా? sasi 11:06, 5 ఆగష్టు 2009 (UTC)

{{సహాయం కావాలి}}


సినిమా పోస్టర్ల కొల్లాజ్ అంటే ఏమిటి? అన్ని సినిమా పోస్టరులు ఒక్క ఫైలులోనే ఉండటమా? కేవలం పోస్టరులంటే తక్షణమే జత పరుచుదును. సూచించ గలరు. sasi 11:30, 5 ఆగష్టు 2009 (UTC)

  1. వివిధ పోస్టరులు, లేదా వాఠిలోని భాగాలను (ఎలక్ట్రానిక్‌గా) అతికించి చేసిన చిత్రం. ఉదాహరణకు ఫైలు:Telugu script samples.jpg అనే బొమ్మ ఒక కొల్లాజ్
  2. ఫైలు:Banaganapally mangoes.jpg, ఫైలు:Ragi sangati.jpg, ఫైలు:Jonnarotte.jpg వంటి బొమ్మలను సముచిత వినియోగం (ఫెయుర్ యూజ్) గా అప్‌లోడ్ చేశారు. ఇవి మీరే తీసినా గాని, లేదా తీసినవారు అనుమతి ఇచ్చినా గాని {{GFDL-self}} లేదా {{GFDL-no-disclaimers}} లేదా {{Cc-by-sa-2.5}} లేదా {{PD-self}} వంటి ట్యాగులు పెట్టండి. అలా కాకుండా ఏదైనా వెబ్‌సైటునుండి తీసుకొన్నట్లయితే ఆ సైటు పేరు సారాంశంలో వ్రాయండి.
--కాసుబాబు 13:12, 5 ఆగష్టు 2009 (UTC)
కాసుబాబు గారు, సారాంశంలో వెబ్ సైటులని చేర్చాను. sasi 13:04, 6 ఆగష్టు 2009 (UTC)
ఈ వ్యాసంలో చేయవలసిన పనులు చాలానే ఉన్నాయి. నాకు ఠకీమని తోచినవి కొన్ని చేయవలసిన పనుల జాబితాలో చేర్చాను. మీరూ ఆ జాబితాను పొడిగించవచ్చు. నా వ్యాఖ్యలను సరైన స్ఫూర్తితో తీసుకున్నందుకు కృతజ్ఞతలు --వైజాసత్య 16:01, 5 ఆగష్టు 2009 (UTC)
వైజాసత్య గారు! ఠకీమని మీకు కనీసం కొన్నయినా తోచాయి. నాకు అవి కూడా తోచలేదు. నేను చేసిన మార్పులని బట్టి మీ జాబితాని మార్చండి. ఇంకా అలోచించి జాబితాని పెంచండి. మీరు శాసించండి, నేను పాటిస్తాను. (సరదాకి!!!) sasi 13:04, 6 ఆగష్టు 2009 (UTC)

కడప జిల్లా/వై ఎస్ ఆర్ జిల్లా

[మార్చు]

కడప జిల్లాని వై ఎస్ ఆర్ జిల్లాగా మార్చటం గమనించాను. అధికారికంగా కడప జిల్లా వై ఎస్ ఆర్ జిల్లాగా సంబోధించబడుతున్నదా? అలా కాని పక్షం లో వికీ లో ఇలా సంబోధించడం సరియేనా? - శశి (చర్చ) 17:50, 10 మే 2013 (UTC)[ప్రత్యుత్తరం]

విస్తరణ

[మార్చు]

రాయలసీమ వ్యాసం నుండి కొంత టెక్స్టుని ఇందులో చేర్చి విస్తరించాను. కొన్ని డూప్లికేట్ ఎంట్రీలు ఉన్నాయి. త్వరలోనే వాటిని సవరిస్తాను. - శశి (చర్చ) 15:10, 3 డిసెంబర్ 2013 (UTC)

డూప్లికేట్ ఎంట్రీలని విలీనం చేశాను - శశి (చర్చ) 14:17, 4 డిసెంబర్ 2013 (UTC)