Jump to content

చర్చ:వేమన శతకము

ఈ పేజీ లోని కంటెంటులకు ఇతర భాషలలో మద్దతు లేదు.
వికీపీడియా నుండి

మకుటం

[మార్చు]

ఆటవెలది చందస్సు ప్రకారం మకుటము "విశ్వదాభిరామ వినుర వేమ" అని ఉండాలిగానీ "వినుర వేమా" అని కాదు.

తగిన మార్పులు చేశాను. సూచనకు కృతజ్ఞతలు--వైఙాసత్య 14:00, 13 జూన్ 2006 (UTC)[ప్రత్యుత్తరం]

అనువుగాని చోట అధికులమనరాదు కొంచెముందుటెల్ల కొదువకాదు కొండ యద్దమందు కొంచమై ఉండదా విశ్వదాభిరామ వినురవేమ

ఈ పద్యమును రెండు సార్లు టైప్ చేసినట్టున్నారు. అంతే కాకుండా, అనగనగ రాగం అని మొదలయ్యే పద్యం అసలు లేనే లేదు.

నేనే రాయుదును, కానీ స్పెల్లింగ్ తప్పులొస్తాయేమోనని భయం. :-) -- అక్షయ్

అలాగే చేయండి. అచ్చుతప్పులు ఎవరో ఒకరు దిద్దుతారు. --వైఙాసత్య 11:21, 28 జూన్ 2006 (UTC)[ప్రత్యుత్తరం]

పద్యాలు

[మార్చు]

వేమన పద్యాలు 2,000 - 3,000 వరకు ఉండవచ్చునని పరిశోధకుల అంచనా. బ్రౌన్ సంకలనం చేసినవి 1,100 పద్యాలు పుస్తకరూపంలో ప్రచురించడము జరిగినది.ఏవరైనా వాటిని వికిలో చేర్చడానికి అవకాశం కలిగించాలి. అందుకోసం పద్యాలను క్రమములో పేర్చడము ముఖ్యం.Rajasekhar1961 11:24, 21 జూన్ 2007 (UTC)Rajasekhar1961[ప్రత్యుత్తరం]

ఇక్కడ కాదుకానీ వికీసోర్స్లో తప్పకుండా చేర్చవచ్చు. మొదలుపెట్టండి. అక్షరక్రమంలో కూర్చేందుకు నేను సహాయం చెయ్యగలను --వైజాసత్య 11:32, 21 జూన్ 2007 (UTC)[ప్రత్యుత్తరం]
శతకం అంటే నేను 100 పద్యాలు మాత్రమే ఉన్నాయి అని అనుకొన్నాను. కాని ఇలా 2000-3000 ఉన్నాయి అని అనుకోలేదు.--మాటలబాబు 11:52, 21 జూన్ 2007 (UTC)[ప్రత్యుత్తరం]