చర్చ:సమీ అల్-ఖసీమ్
స్వరూపం
పనిచేస్తున్న వ్యాసంపై కాపీహక్కుల మాస పెట్టడం
[మార్చు]నమస్కారం వాడుకరి:Arjunaraoc గారు. నేను రోజుకో వ్యాసం రాసే కాన్సెప్టులో ఉన్నానని, రోజులో నాకు దొరికిన సమయాల్లో ఆరోజు వ్యాసాన్ని పూర్తిచేస్తానని తెవికీ సభ్యులందరికి, మీకు కూడా తెలుసు. ఒక వ్యాసంలో మార్పులు జరుగుతున్నపుడు దానిపై ఇలాంటి చర్యలు చేయకూడదన్న విషయం మీకు తెలియందికాదు. నేను కొద్ది సమయం క్రితమే ఈ వ్యాసాన్ని ప్రారంభించాను. సమాచారంకోసం ఒక పత్రికలో వచ్చిన అంశం మొత్తాన్ని నేను అక్కడ పేస్ట్ చేసి, దానిని దశల వారిగా మార్చే పనిలో ఉన్నాను. ఈలోపే మీరు కాపీహక్కుల మాసను పెట్టారు. ఇది తగిన పని కాదు. తెవికీ వ్యాసాలు ఎలా ఉండాలన్న విషయం నాకు తెలుసు కాబట్టి, నా వ్యాసాల గురించి మీరు చింతించాల్సిన అవసరం లేదు. దయచేసి గమనించగలరు.-- Pranayraj Vangari (Talk2Me|Contribs) 11:11, 6 జూలై 2019 (UTC)
- @Pranayraj Vangari, మీ స్పందనకు మరియు వ్యాసాన్ని సవరించినందులకు ధన్యవాదాలు. నిర్వహణలో భాగంగా ఇతర కాపీహక్కుల ఉల్లంఘనలు పరిశీలుస్తూ అదే పనిలో భాగంగా హెచ్చరిక చేర్చడం జరిగింది. కాపీహక్కులగురించి తెలియనివారు చేసినట్లు మీరు మొదల ఇతర చోట వున్న పాఠ్యం అలాగే చేర్చి, తరువాత సవరించడం అంత మంచిది కాదు. కొత్త సభ్యులు మీ రచనలకు కొంతవరకే పరిశీలించి మీ పద్ధతులను కొంతవరకే పాటిస్తే తెవికీలో కాపీహక్కుల ఉల్లంఘనలు పెరిగే ప్రమాదముంది. కావున. ప్రధాన పేరుబరిలో ప్రతిసవరణలో అనుభవమున్న సభ్యులు, కాపీహక్కులు ఉల్లంఘన జరగకుండా వుండడం మంచిది. --అర్జున (చర్చ) 11:54, 7 జూలై 2019 (UTC)