సమీ అల్-ఖసీమ్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
సమీ అల్-ఖసీమ్
సమీ అల్-ఖసీమ్
పుట్టిన తేదీ, స్థలం(1939-05-11)1939 మే 11
జార్ఖా, ఎమిరేట్ ఆఫ్ ట్రాన్స్ జోర్డాన్
మరణం2014 ఆగస్టు 19(2014-08-19) (వయసు 75)
సఫాద్, ఇజ్రాయిల్
వృత్తికవి, రచయిత
జాతీయతపాలస్తీనీయుడు
కాలం1963-2014
రచనా రంగంజాతీయత, ట్రాజెడీ

సమీ అల్-ఖసీమ్ (మే 11, 1939 - ఆగస్టు 19, 2014) పాలస్తీనాకు చెందిన కవి, జర్నలిస్ట్, సంపాదకులు, రాజకీయవేత్త. తన కవిత్వంతో, వ్యాసాలతో మధ్య ఆసియాలోని అరబిక్ దేశాల్లోని పేరొందిన సాహితీవేత్తలలో ఒకడిగా పేరుగాంచాడు.[1]

జననం[మార్చు]

సమీ అల్-ఖసీమ్ 1939, మే 11న జోర్డాన్ లోని జార్ఖా నగరానికి సమీపంలోని ఒక గ్రామంలో జన్మించాడు. ఈయన పూర్వీకులు పాలస్తీనా వాసులు, ఇతని తండ్రికి జోర్డాన్ రాజు అబ్దుల్లా ఆస్థానంలో ఉద్యోగం రావడంతో జోర్డాన్ ను వచ్చారు.

సాహిత్యరంగం[మార్చు]

1948లో ఇజ్రాయిల్ పాలస్తీనాపై దండెత్తి ఆక్రమించుకుంది. అనుక్షణం ఆ యుద్ధం గురించి ఆలోచించిన సమీ అల్-ఖసీమ్ యుద్ధ నేపథ్యంలోనే తన రచనలను కొనసాగించాడు.[2] 1984నాటికి ఇరవై నాలుగు సంపుటాల జాతీయవాద కవితలను రాసిన సమీ అల్-ఖసీమ్ ఆరు కవితా సంకలనాలను కూడా ప్రచురించాడు.[3]

  1. స్లిట్ లిప్స్
  2. సన్స్ ఆఫ్ వార్
  3. కాన్ఫెషన్ ఎల్ మిడ్ డే
  4. ట్రావల్ టిక్కెట్స్
  5. బ్యాట్స్
  6. అబాండోనింగ్
  7. ది స్టోరీ ఆఫ్ ఎ సిటీ
  8. కన్వర్జేషన్ బిట్వీన్ ఇయర్ ఆఫ్ కార్న్ అండ్ జెరూసలేం రోజ్ థోర్న్
  9. హౌ ఐ బికేమ్ ఎన్ ఆర్టికల్
  10. స్టోరి ఆఫ్ ది అన్నోన్ మెన్
  11. ఎండ్ ఆఫ్ ఎ డిస్కషన్ విత్ ఏ జైలర్
  12. ది విల్ ఆఫ్ ఎ మ్యాన్ డైయింగ్ ఇన్ ఎక్సైల్
  13. ది బోరింగ్ ఆర్బిట్
  14. ది క్లాక్ ఆన్ ది వాల్

రాజకీయరంగం[మార్చు]

తాను నమ్మిన సిద్ధాంతాల ఆచరణకు రాజకీయాలే సరైన దారి అని గుర్తించి, ఇజ్రాయెల్ కమ్యూనిస్ట్ పార్టీలో చేరి అనేకసార్లు అరెస్ట్ అయ్యాడు.[4] కొతంకాలం తరువాత హదాష్ అనే ప్రజాస్వామ్య పార్టీలో చేరి ఇజ్రాయెల్ లో మైనార్టీలైన తోటి అరబ్బులపై వారి జీవన స్థితిగతులపై అనేక ప్రసంగాలు చేయడమేకాకుండా తన రచనల ద్వారా కూడా వ్యక్తీకరించాడు.

ఇతర వివరాలు[మార్చు]

  1. ఈయన హైఫాలో జర్నలిస్టుగా పనిచేయడంతోపాటు, అక్కడే అరబెస్క్ ప్రెస్, ఫోక్ ఆర్ట్స్ సెంటర్‌ను నడిపాడు. ఇజ్రాయెల్ అరబ్ వార్తాపత్రిక కుల్ అల్-అరబ్ కు ప్రధాన సంపాదకుడిగా పనిచేశాడు.[5]
  2. ఈయన 1997లో, 2000లో సిరియాను సందర్శించాడు.
  3. 2001లో ఒక కవితా కార్యక్రమం కోసం ఇజ్రాయెల్ అధికారులు లెబనాన్ వెళ్ళకుండా ఇతన్ని అడ్డగించారు.[6]

మరణం[మార్చు]

ఈయన అనారోగ్యంతో 2014, ఆగస్టు 19న ఇజ్రాయిల్ లోని సఫాద్ లో మరణించాడు.

మూలాలు[మార్చు]

  1. నమస్తే తెలంగాణ, చెలిమె-ప్రపంచ కవిత (4 November 2018). "జీవిక-జీవితం!". మామిడి హరికృష్ణ. Archived from the original on 6 July 2019. Retrieved 6 July 2019.
  2. Palestinian Writers in Israel Archived 2007-11-20 at the Wayback Machine Hardy, Rogers. December 1982, Boston Review
  3. A Bilingual Anthology of Arabic Poetry - Victims of A Map by Samih al-Qasim, Adonis, and Mahmoud Darwish. Al-Saqi Books 26 Westbourne Grove, London W2 1984
  4. Lines of Resistance Palattaella, John. The Nation
  5. Poet Profile: Samih al-Qasim Archived 2013-09-06 at the Wayback Machine PBS Online
  6. Encyclopedia of the Palestinians by Philip Mattar. Facts on File 2005

ఇతర లంకెలు[మార్చు]