Jump to content

చర్చ:సామెతలు - న

ఈ పేజీ లోని కంటెంటులకు ఇతర భాషలలో మద్దతు లేదు.
వికీపీడియా నుండి

Sametalu and Superstitions are not one and same. Nowhere Sametalu are followed as Superstitions. Sametalu are used only to highlight a point or quoted to stress one's point. Therefore,I deleted the word "MOODHANAMMAKAM". When Iam logged in, I am unbale to write in Telugu and when I am not logged in, I am able to write in telugu. Its strange and do not know reasons therefor. Hence, my name has not come in History of the Change made by me.--S I V A 07:23, 4 జనవరి 2009 (UTC)[ప్రత్యుత్తరం]

సామెతల్లో మూఢనమ్మకాలు,వివక్ష,అవహేళన

[మార్చు]

ఆకాలంలో చెల్లాయిగానీ ఈనాడు ఏవిధంగానూ సమర్ధించలేని సామెతలివిగో:

  • ముందువెళ్ళే ముతరాచవాడినీ ప్రక్కన బోయే పట్రాతి వాడినీ నమ్మరాదు
  • ముందుపోయే ముతరాచవాడినీ వెనుకవచ్చే ఈడిగ వాడినీ నమ్మరాదు
  • నీ కూడు నిన్నుతిననిస్తే నేను కమ్మనెలా ఔతాను?
  • తుమ్మనీ కమ్మనీ నమ్మరాదు
  • రెడ్లున్నఊరిలో రేచులున్న కొండలో ఏమీ బ్రతకవు
  • నరంలాంటివాడికి జ్వరం వస్తే చెయ్యి చూచినవాడు బ్రతకడు
  • తురకల్లో మంచివాడెవరంటే తల్లికడుపులో ఉన్నవాడు గోరీలో ఉన్నవాడు
  • మాలవానిమాట నీళ్ళమూట
  • చాకలి అత్త మంగలి మామ కొడుకు సాలోడైతేనేమి సాతానోడైతేనేమి?
  • విధవముండకు విరజాజి దండలేల?
  • కాశీలో కాసుకొక లంజ
  • నంబీ నా పెళ్ళికి ఎదురురాకు
  • నియోగి ముష్టికి బనారసు సంచా?
  • మాలదాన్ని ఎంగటమ్మా అంటే మదురెక్కి దొడ్డికి కూర్చుందట
  • కులం తక్కువ వాడు కూటికి ముందు
  • చాకలిదాని అందానికి సన్యాసులు గుద్దుకు చచ్చారు
  • మాలలకు మంచాలు బాపలకు పీటలా?
  • మాలబంటుకు ఇంకొక కూలిబంటా?
  • ఉల్లిపాయంత బలిజ ఉంటే ఊరంతా చెడుస్తాడు
  • పైసామెతల్లో మూఢనమ్మకాలు,వివక్ష,అవహేళన ఉన్నాయి కదా.ఇప్పుడు వీటిని మనం వాడలేము వాడితే ఊరుకోరు--Nrahamthulla 05:36, 5 జనవరి 2009 (UTC)[ప్రత్యుత్తరం]
    • నేను వ్రాసిన వ్యాఖ్య మూఢ నమ్మకాలుగా సామెతలను పాటించటంలేదు అని. మీరు ఎక్కడేక్కడ వెతికి వ్రాశారోగాని, నాకు మాత్రం "నల్లబ్రామ్మడినీ ఎర్రకోమటినీ నమ్మకూడదు" తప్ప మిగిలిన సామెతలుఎవీ కూడా పరిచయలో లేనివి. మీరు వ్రాసిన వాటిలోలాగా సామెత ఇప్పుడు వాడతారా లేదా, వాడితే ఏమవుతుంది అన్న విషయాలు ప్రస్తుత చర్చ విషయం కాదు గనుక అప్రస్తుతం. వికీలో సామెతల పుట ఉద్దేశ్యం, ఆ సామెతల అర్ధాలు వ్రాయటం అని నేను అనుకుంటున్నాను.--S I V A 17:20, 5 జనవరి 2009 (UTC)[ప్రత్యుత్తరం]
  • సామెతలంటే సమాజం పోకడలలో హెచ్చు తగ్గులు అవకతవకలు అతిక్లుప్తంగా చెప్పే అక్షరసత్యాలు.పెద్దలచే చెప్పబడిన అనుభవసారాలు.ప్రత్యక్షంగా చెప్పలేనివి పరోక్షంగా చెప్పటానికి వీటిని చురకలుగా ఉపయోగించడం పరిపాటి.సామెతలు ఏమి చెప్తున్నాయి అన్నది తెలుసుకోవడం ముఖ్యమే కానీ అవి స్త్రీలని,కులాలనీ,మతాలనూ హేళనచేసేవి అనిభావిస్తే జీవిత సత్యాలను క్లుప్తంగా చెప్పే సామెతలలాంటి విషయాలు మరుగున పడతాయి.--t.sujatha 00:48, 6 జనవరి 2009 (UTC)[ప్రత్యుత్తరం]
  • వేలాది సామెతలు ఉపయోగించి 15 సంవత్సరాలపాటు (1986-2001) నేను గీటురాయి లోరాసిన ఉబుసుపోక పుస్తకం త్వరలో రాబోతోంది.తెలుగు సామెతలు: సంపాదక వర్గం- దివాకర్ల వెంకటావధాని, పి.యశోదా రెడ్డి, మరుపూరి కోదండరామరెడ్డి.- తెలుగు విశ్వవిద్యాలయం మూడవ కూర్పు పునర్ముద్రణ 1986 చూడండి.ఇప్పటికే అనేక పుస్తకాలలో కొన్నివేల సామెతలతో పాటు ఇవికూడా గ్రంధస్తమై ఉన్నాయి.సామెతల్లో భక్తి,వైరాగ్య,శృంగార,నీతి,విజ్ఞాన,చమత్కారాల వలెనే ,మూఢనమ్మకాలు,వివక్ష,అవహేళనా సామెతలు కూడా ఉన్నాయి.ప్రస్తుతమైనా అప్రస్తుతమైనా ఈ జీవిత సత్యాలను మనం విడమరచి వర్గాలవారీగా దేనికదిగానే చెప్పుకోవాలి.--Nrahamthulla 02:29, 6 జనవరి 2009 (UTC)[ప్రత్యుత్తరం]
  • నేను సుజాత గారితో పూర్తిగా ఏకీభవిస్తున్నాను. సామెతలను మూఢ నమ్మకాలుగా నమ్మటం అన్న విషయం మొదటిసారి మీదగ్గరనుంచే వింటున్నాను. మీ పుస్తకం పేరు మాత్రం బాగున్నది. మీ వాదనకు మీరు వ్రాసిన పుస్తకాన్నే ప్రామాణికంగా ఉదహరించటం ఎంతవరకు సబబు అన్న విషయం పక్కనపెట్టి, నాకు అది దొరికి చదవగలిగినాక చర్చ కొనసాగిద్దాం. అప్పటివరకు శలవు. --S I V A 04:27, 8 జనవరి 2009 (UTC)[ప్రత్యుత్తరం]
  • అది నా పుస్తకం కాదు సామెతల్లో మూఢ నమ్మకాలుకూడా ఉన్నాయని చెబుతున్నతెలుగు విశ్వవిద్యాలయం పుస్తకం.--Nrahamthulla 05:44, 9 జనవరి 2009 (UTC)[ప్రత్యుత్తరం]