చర్చ:స్వలింగ సంపర్కం
ఈ వ్యాసానికి ఇచ్చిన లింకులు పోయాయి. తెలుగు పత్రీకలు లింకులను శాశ్వత ప్రాతిపదిక మీద ఉంచటం లేదు. అందుకని, తెలుగు పత్రికల లోని వ్యాసాల లింకులతో పాటు, ఆ వ్యాసం ప్రచురింపబడిన తేదీ కూడా ఇస్తే భవిష్యత్తులో ఆ వ్యాసాన్ని కూడా చదవటానికి ఉపయోగపడుతుంది. Talapagala VB Raju 07:41, 3 జూలై 2011 (UTC)
"'వర్గం: వికీకరించవలసిన వ్యాసములు"' లో ఉన్నది. జె.వి.ఆర్.కె.ప్రసాద్ 08:54, 3 జూలై 2011 (UTC)
అభిప్రాయాలే ఎక్కువగా ఉన్నాయి
[మార్చు]ఇందులో వాస్తవాల కన్నా అభిప్రాయాలే ఎక్కువగా ఉన్నాయి. ఉదాహరణకు:
అహం బ్రహ్మాస్మి ప్రకారం అందరూ పరబ్రహ్మలే గనుక వీళ్ళను వివక్షతో చూడకూడదు.తృతీయా ప్రకృతి జీవులను,స్వలింగసంపర్కులను కూడా మనతో సమానంగా గౌరవించాలి.కలియుగానికి సూచన స్వలింగ సంపర్కం కాదు.వాళ్ళను అవమానించటం హింసించటమే కలియుగానికి సూచన. వీళ్ళు కూడా దైవసేవకులే.ఆశ్రమాలలో ఉండవచ్చు. స్వలింగసంపర్కులు/వివాహులు కూడా ఆశ్రమవాసులై బ్రహ్మచర్యాన్ని పాటించి గొప్పవాళ్ళయ్యారు.జీవితాంతమూ బ్రహ్మచర్యాన్నీ పాటించటం కష్టమే.కానీ బ్రహ్మచర్యమూ, సర్వసంగపరిత్యాగమూ, భవబంధ విమోచనము,ముక్తి పొందటానికి మొదటి అవసరం.ఆధ్యాత్మికతలో ఏకపత్నీవ్రతానికి దక్కేది రెండవ స్థానమే.మొదటి స్థానం బ్రహ్మచర్యానిదే.దైవశక్తి తరతమ బేదాలు లేకుండా సకల చరాచర జగత్తు అంతా విస్తరించి ఉంది. జీవులైనా, నిర్జీవులైనా ,చెట్టులో పుట్టలో, గట్టులో, పాములో, చివరకు పందిలో కూడ దేవుడున్నాడు.సర్వాంతర్యామి అయిన దేవుడే చేప, తాబేలు, పంది, సింహం,కుక్క ,పాము అవతారాల్లో ఉన్నపుడు సాటి మనిషి అంటరాని వాడు ఎలా అవుతాడు?
వంటివి పూర్తిగా వ్యక్తిగత అభిప్రాయాలే తప్ప రిఫరెన్సులతో వివరించగలిగే విషయాలు కావు. హిందూ మతంలో స్వలింగ సంపర్కం అన్న భాగంలో కామసూత్రాల్లో ఈ విషయాన్ని గురించి ఏమన్నారో చెప్పారు. ఐతే కామసూత్రాలు హిందూమతంలో ఏ స్థాయి, ఏ క్రమంలో భాగమో తెలియలేదు. అది ఒక శాస్త్రగ్రంథం కాగా దానికీ మతానికి నేరుగా సంబంధం లేదు. ఇవి మౌలిక పరిశోధనలు కాగా రచయిత స్వంత ఆలోచనలు వికీ ఫార్మట్‌లో సరిపోవని భావిస్తున్నాను.--పవన్ సంతోష్ (చర్చ) 18:17, 1 జూలై 2014 (UTC)