చర్చ:హైదరాబాదు విద్యాసంస్థలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

Hi Kiran thanks for creating Hyderabad educational institutions page. I think we will try to shape up this one article. If the article becomes too big then we can create new sub articles--వైఙాసత్య 20:08, 13 అక్టోబర్ 2005 (UTC)

ఈ వ్యాసం తర్జుమా పూర్తయినది, దీని వికీకరణ కొరకు సూచనలివ్వవలెను. నిసార్ అహ్మద్ 16:40, 25 డిసెంబర్ 2008 (UTC)
ఇంగ్లీషు పేర్లు తొలగించండి. ప్రస్తుతానికి కేవలం వ్యాసాలున్నవాటికి మాత్రమే లింకులు ఇవ్వండి --వైజాసత్య 16:51, 25 డిసెంబర్ 2008 (UTC)
ఒక చిన్న గ్రామంలో విద్యాసంస్థలంటే సాధారణంగా పాఠశాలలు మాత్రమే ఉంటాయి. కాని ఒక మహానగరంలో విద్యాసంస్థలు గురించి వ్రాయాలంటే పాఠశాలలను మినహాయించడమే మంచిది. వేలాది పాఠశాలల గురించి వ్రాసినా లాభం లేదు. అవసరమైన వారు వాటి వివరాలు విద్యాశాఖ వెబ్‌సైట్లో చూసే అవకాశం ఉంది (ఆ లింకు ఇస్తే చాలు). విశ్వవిద్యాలయాలు, డిగ్రీ కళాశాలలు, సాంకేతిక విద్యాసంస్థలు లాంటివి సరిపోతాయి. జూనియర్ కళాశాలలు కూడా అవసరం లేదనుకుంటా. ఇలా వ్రాస్తూ లింకులిచ్చేస్తే దానిపైనా వ్యాసాలు సృష్టించే అవకాశం ఉంది. వాటి వల్ల ఉపయోగం ఉంటుందో లేదో కాని ప్రైవేటు విద్యాసంస్థలకు పబ్లిసిటి మాత్రం లభిస్తుంది. అది వికీ నియమాలకు విరుద్ధం. -- C.Chandra Kanth Rao(చర్చ) 16:54, 25 డిసెంబర్ 2008 (UTC)
డిగ్రీ ఆపై కళాశాలలు (లింకులు అవసరంలేదు), శాస్త్ర సాంకేతిక సంస్థలు విద్యాలయాలు (ఇప్పుడు లింకులుంటే అలాగే వదిలేద్దాం, మిగతా వాటికి లింకులు అవసరంలేదు), విశ్వవిద్యాలయాలు (లింకులిద్దాం), ఇంటర్మీడియట్ ఆ లోబడి పాఠశాలలు తీసివేద్దాం. ప్రస్తుతం ఇంగ్లీషు పేర్లు లేకుండా వ్రాస్తే సరిపోతుందా. నిసార్ అహ్మద్ 17:06, 25 డిసెంబర్ 2008 (UTC)
డిగ్రీ ఆపై కళాశాల వివరాలు ఇస్తే చాలనుకుంటా. లింకులు మాత్రం విశ్వవిద్యాలయాలకు, ఉన్నత సాంకేతిక విద్యాసంస్థలకు ఇస్తే చాలు. డిగ్రీకళాశాలకు లింకులు అవసరం లేదు. ప్రాచీన డిగ్రీ కళాశాలలైన నిజాం కాలేజీలాంటి పైన ఇప్పటికే వ్యాసాలున్నాయి. ఆ లింకులు మాత్రం ఉంచవచ్చు. -- C.Chandra Kanth Rao(చర్చ) 17:11, 25 డిసెంబర్ 2008 (UTC)