Jump to content

చలిమిడి

వికీపీడియా నుండి
చలిమిడి
మూలము
ఇతర పేర్లుపచ్చి చలిమిడి, పాకపు చలిమిడి
ప్రదేశం లేదా రాష్ట్రంఆంధ్రప్రదేశ్
తయారీదారులుప్రాచీన భారతీయులు
వంటకం వివరాలు
వడ్డించే విధానంవంటకం
ప్రధానపదార్థాలు బియ్యం పిండి, నెయ్యి, ఏలకల పౌడర్, బెల్లం, కొబ్బరి మొదలగునవి.

చలిమిడి వరిపిండితో తయారుచేసుకొనే ఆహార పదార్ధము. దీనిలో రెండు విధములు: పచ్చి చలిమిడి, పాకపు చలిమిడి. పాకపు చలిమిడి ఎక్కువకాలం నిలువ ఉంటుంది.

రకాలు

[మార్చు]
  • పచ్చి చలిమిడి: బియ్యము నానబోసి, పిండిచేసి, బెల్లము లేక పంచదార కలిపి, అందులో కొబ్బరికాయ ముక్కలు లేదా కొబ్బరికోరు చేర్చి, నీరయినా లేదా పాలయినా పోసి కలిపి ముద్ద చేయుదురు. ఇది పచ్చి చలిమిడి.[1]
  • పాకపు చలిమిడి: బెల్లము లేక పంచదార పాకము తయారుచేసి, అందులో కొబ్బరి లేదా నువ్వుపప్పు కలిపిన బియ్యపుపిండిని పోసి కలుపుతారు. ఇది తీసి గుత్తముగా కలిపిన లేహ్యపు ముద్దవలె నుండును. ఇది పాకపు చలిమిడి. ఈ పాకపు చలిమిడి అరిసెలుగ, పాకుండలుగ వండుదురు.

విశేషాలు

[మార్చు]

ఆడపిల్లను  అత్తవారింటికి  పంపే  సందర్భాలలో ప్రతి సారీ  కన్నతల్లి , తన కూతురికి  చలిమిడి  పెట్టి  పంపిస్తారు. అలాగే గర్భవతి ఐన కుమార్తెకు మూడవ నెల రాగానే వియ్యాల వారి ఇంటికి వెళ్ళి కుమార్తె ఒడిలో చలిమిడి పెడతారు. కుమార్తెకు ఏడవ నెల రాగానే సీమంతం సందర్భంగా ముత్తయిదువులందరికీ ఇచ్చే తాంబూలాలలో చలిమిడి పెడతారు. కుమార్తె ప్రసవం అయిన తరువాత పుట్టిన బిడ్డకు మూడవ నెలలో కానీ, ఐదవ నెలలో కానీ బిడ్డతో పాటు కుమర్తెను అత్తవారింటికి పంపేటప్పుడు చలిమిడి పంపిస్తారు. ఇలా  అన్ని  శుభ సందర్భాలలో   చలిమిడి  కూతురుకు  పెట్టి పంపడం అనేది తర తరాలుగా మన ఇళ్ళల్లో వస్తున్న సాంప్రదాయం. ఇలా చలిమిడి  పెట్టి  పంపడం తన బిడ్డకు కడుపు చలవే కాకుండా , ఇరు కుటుంబాలకు క్షేమకరం  అని  పెట్టి పంపుతారు.

మూలాలు

[మార్చు]
  1. "Pachi Chalimidi from Andhra | Akki Thambittu from Karnataka". ãhãram (in బ్రిటిష్ ఇంగ్లీష్). 2020-10-27. Retrieved 2021-04-15.

బాహ్య లంకెలు

[మార్చు]
"https://te.wikipedia.org/w/index.php?title=చలిమిడి&oldid=3170625" నుండి వెలికితీశారు