Jump to content

చార్వాక ఆశ్రమం

వికీపీడియా నుండి
చార్వాక ఆశ్రమం ముఖద్వారం
చార్వాక ఆశ్రమం ముఖద్వారం

చార్వాక ఆశ్రమం 1973లో బి.రామకృష్ణ స్థాపించిన ఒక ప్రత్యామ్నాయ సంస్కృతిని పెంపొందించే ఆశ్రమం. ఇది గుంటూరు జిల్లా మంగళగిరికి 3 కిలోమీటర్ల దూరంలోని నిడమర్రులో ఉంది. ప్రజలలో శాస్త్రీయ దృక్పథం, విమర్శనాత్మక ఆలోచన, సామాజిక బాధ్యతను పెంపొందించడం వీరి ముఖ్య ఉద్దేశం.[1]

చరిత్ర

[మార్చు]

తాడికొండ పట్టణంలోని ఓరియంటల్ కళాశాల ప్రిన్సిపాల్‌గా చార్వాక రామకృష్ణ ఉండేవారు. యాజమాన్యం అతని బోధనలు, సిద్ధాంతాలను వ్యతిరేకించడంతో, ఉద్యోగాన్ని వదిలివేసి తన స్వగ్రామం తుళ్ళూరు సమీపంలోని నిడమర్రులో ప్రగతి విద్యావనం పేరుతో చార్వాక విద్యాపీఠాన్ని ప్రారంభించాడు. శాస్త్రీయ విద్యా విధానాన్ని రూపొందించి పాఠాలు చేప్పేవారు.[2] తమ విద్యార్థుల్లో ప్రశ్నించే నైజాన్ని పెంపొందిచే విధంగా ప్రశ్న గుర్తును (?) ఈ పాఠశాల సింబల్ గా పెట్టారు. చార్వాక పత్రికను కూడా నడిపారు. చార్వాక రామకృష్ణ 2007లో అనారోగ్యంతో కన్నుమూయగా, ఆయన భార్య గృహలక్ష్మి, బిడ్డ సుధాకర్‌ ఆశ్రమాన్ని నిర్వహిస్తున్నారు.[3]

ప్రాంగణం

[మార్చు]

ఆశ్రమం ప్రాంగణంలో సామాజిక మార్పు కోసం ఉద్యమించిన అంబేడ్కర్‌, పెరియార్‌ రామస్వామి, త్రిపురనేని రామస్వామి, జ్యోతిరావు ఫూలే, సావిత్రిబాయి ఫూలే, కె.వి.కృష్ణ, సామినేని ముద్దు నరసింహం, పాయసి విగ్రహాలు ఉంటాయి. దుస్తులు ధరించిన వేమన, భగత్ సింగ్, భారతీయ ప్రాచీన హేతువాదులైన అజిత కేశకంబళుడు, కణాదుడు, కపిలుడు, మక్కలి గోశాలుడు తదితరుల విగ్రహాలున్నాయి.[2]

నాస్తిక మేళా

[మార్చు]

1992 సంవత్సర్రం నుండి ప్రతి ఏటా ఫిబ్రవరి రెండో శని, ఆదివారాల్లో చార్వాక ఆశ్రమంలో జాతీయ స్థాయిలో నాస్తిక మేళా నిర్వహిస్తున్నారు. 33వ నాస్తిక మేళా 2025 ఫిబ్రవరీ 8, 9 తేదీలలో జరిగింది.[4][5]

మూలాలు

[మార్చు]
  1. B1, Charan Teja1,Nitin2 (2019-04-17). "At the heart of Andhra's booming capital lies a quaint ashram for rationalists". The News Minute (in ఇంగ్లీష్). ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 2024-12-18.{{cite web}}: CS1 maint: multiple names: authors list (link) CS1 maint: numeric names: authors list (link)
  2. 1 2 "చార్వాక ఆశ్రమం: తెలుగునాట హేతుబద్ధ ఆలోచనల వేదిక.. నాస్తిక మేళాలతో హేతువాదులకు వేడుక". BBC News తెలుగు. 2021-03-12. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 2025-04-10.
  3. ABN (2020-02-20). "ఈ ఆశ్రమం.. మానవతకు ఆశ్రయం!". Andhrajyothy Telugu News. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 2025-04-10.
  4. "ప్రజల మధ్య కుల, మత అడ్డుగోడలు తొలగాలి". EENADU. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 2025-04-10.
  5. "చార్వాక ఆశ్రమం: తెలుగునాట హేతువాదుల నాస్తిక మేళా". BBC News తెలుగు. 2021-03-12. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 2025-04-10.