Coordinates: 16°1′11.68″N 75°52′52.46″E / 16.0199111°N 75.8812389°E / 16.0199111; 75.8812389

చాళుక్య శివాలయం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చాళుక్య శివాలయం
ప్రదేశం
దేశం:భారతదేశం
రాష్ట్రం:కర్ణాటక
జిల్లా:బాగల్ కోట్
ప్రదేశం: ఐహోల్
అక్షాంశ రేఖాంశాలు:16°1′11.68″N 75°52′52.46″E / 16.0199111°N 75.8812389°E / 16.0199111; 75.8812389
ఇతిహాసం
సృష్టికర్త:చాళుక్య రాజవంశం

చాళుక్య శివాలయంని లాడ్ ఖాన్ టెంపుల్ అని కూడా  పిలుస్తారు. ఇది భారతదేశంలోని కర్ణాటక రాష్ట్రంలోని బాగల్ కోట్ జిల్లాలోని ఐహోల్ వద్ద ఉన్న స్మారక కట్టడాల సమూహంలో ఉంది. ఈ ఆలయ ప్రధాన దేవత శివుడు. ఈ ఆలయం మలప్రభ నది ఒడ్డున ఉంది. ఇది దాదాపు 5వ శతాబ్దానికి చెందినది, ప్రస్తుతం ఈ ఆలయం సెంట్రల్ ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా పరిరక్షణలో ఉంది. ఇది చాళుక్య రాజవంశంచే నిర్మించబడింది. ఈ ఆలయం ఐహోల్ లో ఉన్న దుర్గా ఆలయానికి దక్షిణంగా ఉంది.[1]

చరిత్ర[మార్చు]

ఈ ఆలయం భారతదేశంలోని పురాతన దేవాలయంలో ఒకటిగా భావించబడుతుంది. వాతాపి చాళుక్య రాజవంశ మొదటి సార్వభౌమాధికారి అయిన పులకేశిన్ I అశ్వమేధం యజ్ఞం ఇక్కడే చేసాడని నమ్ముతారు. ఆదిల్ షాహి రాజవంశం పాలనలో, లాడ్ ఖాన్ అనే జనరల్ ఈ ప్రాంతంలో తన సైనిక ప్రచారంలో భాగంగా ఈ ఆలయాన్ని తన నివాసంగా ఉపయోగించుకున్నాడు. అందువలన ఈ ఆలయాన్ని లాడ్ ఖాన్ ఆలయం అని పిలుస్తారు.[2]

నిర్మాణం[మార్చు]

ఈ ఆలయం తూర్పు ముఖంగా ఉంటుంది. ఈ ఆలయంలో గర్భాలయం, సభా మండపం, ముఖ మండపం ఉన్నాయి. ముఖ మండపం పొడవు 18.6 అడుగులు, వెడల్పు 33.4 అడుగులు. ముఖ మండపంలో 12 స్తంభాలు 3 వరుసలలో ఉన్నాయి. దక్షిణ స్తంభంపై గంగా చిత్రం, ఉత్తర స్తంభంపై యమున చిత్రం చెక్కబడి ఉన్నాయి. సభా మండపంలో 16 స్తంభాలు ఉన్నాయి. గర్భగుడికి ఎదురుగా, హాలు మధ్యలో రెండవ చిన్న గర్భగుడి ఉంది, దీని వెలుపలి గోడలు అనేక చెక్కిన చిత్రాలను కలిగి ఉన్నాయి. ఈ ఆలయం పంచాయతన శైలిలో నిర్మించబడింది. నాలుగు కేంద్ర స్తంభాల మధ్య నుండి నందిని చూడొచ్చు. ఆలయం లోపల వెలుతురు కోసం సభా మండపానికి నాలుగు వైపులా రాతి జాలీ కిటికీలు ఉన్నాయి. ఈ కిటికీలు పూలు, రేఖాగణిత డిజైన్ లను కలిగి ఉన్నాయి. కర్ణాటకలో రాతి నిచ్చెన కనిపించే కొన్ని దేవాలయాలలో ఈ దేవాలయం ఒకటి. ఈ ఆలయం పైన చాళుక్యుల రాజ చిహ్నం, కీర్తి ముఖం ఉన్నాయి. ఈ ఆలయం దీర్ఘచతురస్రాకార నిర్మాణంతో ప్రారంభమై చతురస్రాకారంలో ముగుస్తుండటం ఈ ఆలయం ప్రత్యేకత.[3]

ఎలా చేరుకోవాలి[మార్చు]

ఈ ఆలయం ఐహోల్ బస్టాండ్ నుండి 300 కి.మీ దూరంలో ఉంది. బాదామి రైల్వే స్టేషన్ నుండి 30 కి.మీ, భాగల్ కోట జంక్షన్ రైల్వే స్టేషన్ నుండి 33 కి.మీ, హుబ్బళ్ళి విమానాశ్రయం నుండి 136 కి.మీ, బెల్గామ్ నుండి 164 కి.మీ దూరంలో ఉంది.[4]

మూలాలు[మార్చు]

  1. "Did You Know that Lad Khan Temple in Aihole is a Hindu Temple?". nativeplanet.com. 2018-04-18. Retrieved 2023-06-02.
  2. Ilamurugan (2022-06-13). "Hindu Temples of India: Chalukya Shiva Temple, Aihole, Karnataka". Hindu Temples of India. Retrieved 2023-06-02.
  3. Ilamurugan (2022-06-13). "Hindu Temples of India: Chalukya Shiva Temple, Aihole – The Temple". Hindu Temples of India. Retrieved 2023-06-02.
  4. Hussain, Zakir (2021-11-17). "Chalukya Shiva Temple - Glorious Karnataka-Karnataka Tourist Places". Retrieved 2023-06-02.