Jump to content

చింతలపాటి వర ప్రసాద మూర్తి రాజు

వికీపీడియా నుండి
చింతలపాటి వర ప్రసాద మూర్తి రాజు
జననంచింతలపాటి వర ప్రసాద మూర్తి రాజు
1919
పశ్చిమగోదావరి జిల్లా చిననిండ్రకొలను
మరణం2012
వృత్తిదాత,
విద్యా ప్రదాత,
రాజర్షి,
రాజకీయ మహర్షి,
గాంధేయవాది,
అభ్యుదయ సారధి,
గ్రామాభ్యుదయ వారధి
ప్రసిద్ధిప్రముఖ గాంధెయ వాది,
విద్యాదాత,
సర్వోదయ నాయకులు
సీనియర్ కాంగ్రెసు నాయకులు
భార్య / భర్తసత్యవతి దేవి
చింతలపాటి వర ప్రసాద మూర్తి రాజు

ప్రముఖ గాంధెయ వాది, విద్యాదాత, సర్వోదయ నాయకులు, సీనియర్ కాంగ్రెసు నాయకులు.

క్షత్రియలోకాన మేటి శ్రీ చింతలపాటి సీతారామచంద్ర వర ప్రసాద మూర్తిరాజు. ఈయన ఆంధ్రదేశంలో ఒక సముచిత స్థానాన్ని కలిగిన దాత, విద్యా ప్రదాత, రాజర్షి, రాజకీయ మహర్షి, గాంధేయవాది, అభ్యుదయ సారథి, గ్రామాభ్యుదయ వారధి. ఈయన పశ్చిమగోదావరి జిల్లా చిననిండ్రకొలను గ్రామంలో 1919 లో బాపిరాజు, సూరయ్యమ్మ దంపతులకు జన్మించారు. శ్రీ మూర్తిరాజు గారి ధర్మపత్ని సత్యవతి దేవి గారు. వీరి పుట్టినిల్లు మొగల్తూరు. నారాయణపురంలో ప్రాథమిక విద్య, తణుకులో ఉన్నత పాఠశాల విద్య అభ్యసించారు.

సర్దార్ దండు నారాయణరాజు గారి దేశ భక్తి, సమాజసేవా భావాలు మూర్తిరాజులో బలంగా నాటుకున్నాయి. తణుకు స్కూలులో చదువుతున్న రోజుల్లోనే విద్యార్థికార్యదర్శిగా ఉండి స్వదేశీ దుస్తులు ధరించి, ఖద్దరు టోపీ ధరించి స్కూలుకి వెళ్ళేవారు. కర్రసాము విద్యను అభ్యసించిన వీరు దినచర్యలో కూడా ఎంతో క్రమబద్ధమైన జీవితాన్ని అలవర్చుకున్నారు. డాక్టర్ రాజేంద్రప్రసాద్, జయప్రకాశ్ వంటి నాయకుల ఉపన్యాసాలకు ఉత్తేజితులై చైతన్యబాటను ఎన్నుకొన్నారు.

1942 లో క్విట్ ఇండియా ఉద్యమాన్ని బలపరుస్తూ ఉద్యమ కార్యకర్తలకు చేదోడు వాదోడై నిలిచారు. పశ్చిమగోదావరి జిల్లా బోర్డు సభ్యునిగా పోటీలేకుండా ఎన్నికైయ్యారు. ఇదే మూర్తిరాజుకి మచ్చలేని రాజకీయ జీవితానికి రంగప్రవేశం అయ్యింది. 1952 లో ఉమ్మడి మద్రాసు రాష్ట్ర అసెంబ్లీకి తాడేపల్లిగూడెం నియోజకవర్గానికి ఎన్నికయ్యారు. 1955 లో భారత ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ అందించిన వీరు తిరిగి 1955 లో విజయాన్ని అందుకున్నారు. 1961 లో అఖిల భారత సర్వోదయ సమ్మేళనాన్ని పశ్చిమగోదావరి జిల్లా ఉంగుటూరులో ఏర్పాటు చేశారు. డాక్టర్ రాజేంద్రప్రసాద్, ఆచార్య వినోబా భావే, జయప్రకాశ్ నారాయణ, ఆర్యనాయకం చౌదరి, శంకర్ రావ్ దేవ్ వంటి నాయకులు ఈ సమ్మేళనాన్ని విజయవంతం చేశారు.

హరిజనులకోసం కాలనీలను, పేదలకోసం ఇళ్లను, బాటసారుల కోసం విశ్రాంతి గృహాలను, భూదాన యజ్ఞానికి అనేక ఎకరాలను, అనేక విద్యాసంస్థలకు స్థల భవనాలను దానం చింతలపాటి వర ప్రసాద మూర్తి రాజు.jpgచేసిన అపర కర్ణుడు. మూర్తిరాజు తన తండ్రిగారి పేరిట చింతలపాటి బాపిరాజు ధర్మసంస్థను స్థాపించి ఉన్నత ఓరియంటల్, ప్రాథమిక, జూనియర్, డిగ్రీ, ఫిజికల్ ఎడ్యుకేషన్ విభాగాల్లో 68 విద్యాసంస్థలను స్థాపించారు. భారతీయ కళా పరిషత్తును స్థాపించి కళాత్మకమైన సేవలను అందించారు. కొల్లేరు ప్రాంత రైతంగానికి సేవలందించారు.

గాంధేయవాది అయిన వీరు చిననిండ్రకొలనులో గాంధీజీ స్మారక భవనాన్ని నిర్మించారు. 1964 లో ఫిన్ లాండ్ ప్రపంచ శాంతి మహాసభలకు భారత ప్రతినిధిగా వెళ్ళారు. 1971 లో మార్కెటింగ్ శాఖామాత్యులుగా, 1972 లో దేవాదాయ శాఖామంత్రిగా, దేశీయ వైద్య శాఖా మంత్రిగా సేవలందించారు. సుప్రసిద్ధ చరిత్రకారుడైన శ్రీ బుద్ధరాజు వరహాలరాజు గారు తన 'శ్రీ ఆంధ్ర క్షత్రియ వంశ రత్నాకరము' లో ఈయన గురించి వ్యాసము రచించారు. ఈయన 2012 నవంబరులో కాలం చేశారు.

సి.వి.చారి అధ్యక్ష్యులు గాంధీ జ్ఞాన్ ప్రతిష్ఠాన్ గాంధీభవన్ హైదరాబాదు 2010 ఏమన్నారంటే

మన దేశంలో జాతీయోద్యమంలోనూ, ప్రజాసేవా రంగంలోనూ ప్రముఖ పాత్ర వహించిన మహనీయులెందరో ఉన్నారు. వారుప్రతిభావంతమైన తమ వ్యక్తిత్వంతో త్యాగం, సౌశీల్యం, ప్రవర్తన, శేముషితో సంస్కారంతో జాతిపై చెరగని ముద్రవేశారు. తమ జీవిత సర్వస్వాన్ని ప్రజాసేవకే అంకితం చేసిన వ్యక్తులు కొందరున్నారు. వారు ప్రజసేవ చేయటానికే జన్మించారేమో ననిపిస్తుంది. ఆ కోవకు చెందిన ప్రజాసేవా పరాయణులే శ్రీ చింతలపాటి సీతారామచంద్ర వరప్రసాదమూర్తి రాజు గారు.
బాల్యంలోనే గాంధీజీ సిద్దాంతాలకు ఆశయాలకు ప్రభావితుడై సత్యం, అహింసా సిద్దాంతాలకు అంకితుడై ప్రజాసేవా రంగంలో ప్రవేశించారాయన. నాటి నుండి చనిపోయేవరకు వరకు ఆయన గాంధీపధంలోనే నడిచారు. మూర్తిరాజు గారు గాంధేయవాదుల్లో రాజకీయ నాయకుడు. కేవలం రాజకీయ రంగంలోనే కాదు విద్యా, వైద్య, సాంఘిక, కళా, వైజ్ఞానిక రంగాలలో అభివృద్ధికి కూడా ఆయన గణనీయమైన పాత్ర వహించారు.
శ్రీ మూర్తిరాజు ఆంటే సేవామూర్తి, త్యాగమూర్తి, అహింసామూర్తి, సత్యమూర్తి. పేరుకు రాజు కాని అత్యంత నిరాడంబరుడైన సామాన్య వ్యక్తి ఆయన. తాను నమ్మిన సిద్దాంతాలను తూ.చ. తప్పకుండా ఆచరించే వ్యక్తి. ఆయన గురించి ఎంతచెప్పినా తక్కువే. ఇరవైయో శతాబ్దిలో ఆంధ్రదేశంలో జన్మించి సేవా కార్యక్రమాలలో పాల్గొన్నవారిలో అరుదైన మహా మనిషి ఆయన.
భోగభాగ్యాలతో తులతూగుతున్న సంపన్న కుటుంబంలో జన్మించిన మూర్తిరాజుగారు తనకు తానుగా పేదరికాన్నికోరుకొని ఒక మధ్యతరగతి వ్యక్తిగా అత్యంత నిరాడంబరంగా జీవితాన్ని గడపడం ఆయన ఔన్నత్యానికి నిదర్శనం. శ్రీ మూర్తిరాజు గారు ఒక సాధారణ వ్యక్తిగా కనిపిస్తారు. కాని ఆయన నిర్వహించిన అనేక సేవా కార్యక్రమాల వల్ల ఆయన ఒక అసాధారణ వ్యక్తిగా రూపొందినారు. 
శ్రీ మూర్తిరాజు గారు ఒక సాధారణ వ్యక్తిగా కనిపిస్తారు. కాని ఆయన నిర్వహించిన అనేక సేవా కార్యక్రమాల వల్ల ఆయన ఒక అసాధారణ వ్యక్తిగా రూపొందినారు. ఆయన అసలైన సిసలైన గాంధేయవాది. ఆయన ఇతర తత్వాలను ఇతర వాదనలను కూడా గౌరవిస్తారు. అందుకే ఆయన పార్టీలకు, వర్గాలకు, తెగలకు, విచారధార్లకు అతీతుడుగా విశాల దృష్టిగల భారతీయుడుగా విశ్వసనీయుడుగా ప్రఖ్యాతి చెందారు. 
ఐదు దశాబ్దాలకు పైగా వారితో నాకు పరిచయం ఉంది. ఎన్నో సంస్థలలో ఎన్నో సామాజిక నిర్మాణ కార్యక్రమాలలో ఆయనతో కలసి పనిచేసే అదృష్టం నాకు కలిగింది. ఆంధ్రప్రదేశ్ లో ఎన్నో గాంధేయ నిర్మాణ సంస్థలలో ఆయన కార్యనిర్వాహక సభ్యుడు, అధ్యక్షడు, మార్గదర్శి, సలహారు, ఎన్నో సంస్థలకు ఆయన ఆర్థిక సహాయం అందించి వాటిని ముందుకు నడిపించారు. ఆ సంస్థలను పరిపుష్టి చేసారు. విరాళాలిచ్చారు.
1952లో పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం నియోజకవర్గం నుంచి మద్రాసు శాసనసభకు మొదటిసారి శాసనసభ్యుడుగా ఎన్నిక కావటంతో ఆయన రాజకీయ జీవితానికి నాంది జరిగింది. ఆ తరువాత 1955లో పెంటపాడు శాసనసభకు పోటీ చేసి నెగ్గటం జరిగింది. 1962లో జనరల్ ఎన్నికలలో తిరిగి అదే పెంటపాడు నియోజక వర్గం నుంచి గెలుపొందారు. 1967లో కొత్తగా ఏర్పడిన ఉంగుటూరు నియోజకవర్గం నుంచి గెలుపొందారు. 1972లోనూ తిరిగి అదే నియోజకవరం నుంచి పోటీ లేకుండా ఎకగ్రీవంగా ఎన్నికైనారు. 1978లో కూడా రాష్ట్రశాసనసభకు ఎన్నికైనారు. 1971లో ఒకసారి మార్కెటింగ్ శాఖామాత్యులు ఆ తదుపరి 1972లో మరొకసారి దేవాదాయ ధర్మాదాయ శాఖా మంత్రిగా సమర్ధవంతంగా పనిచేసి ప్రజామన్నలను పొందారు. కొంత సమయం పాటు రాష్ట్ర శాసనసభ తాత్కాలిక స్పీకరుగా పనిచేసే గౌరవం కూడా శ్రీ మూర్తిరాజుగారికి దక్కింది. ఆరుసార్లు శాసనసభకు ఎన్నికై ప్రజల ఆదరాభిమానాలు, గౌరవము, ఆదరణము చూరగొన్న నాయకుడు ఆంధ్రదేశంలో మరొకరు లేరంటే ఇందులో అతిశయోక్తి ఎంతమాత్రం లేదు. ఆయనకు ఆయనే సాటి. ప్రజాసేవయే పరమావధిగా ఆయన తన జీవితాన్ని కొనసాగించుచూ తాను ఎన్నికైన నియోజక వర్గం అభివృద్ధికి శాయశక్తులా కృషి చేశారు.
జిల్లా రాష్ట్ర ప్రజల ఆదరాభిమానాలు పొందటమేకాక జాతీయ నాయకుల మన్ననలు కూడా ఆయన పొందినారు. ఆయన నిజాయితీని, పట్టుదలను, కార్యదీక్షను, అంకిత భావాన్ని, త్యాగనిరతిని, కార్యనిర్వాహణ పద్ధతిని రాష్ట్రపతి బాబురాజేంద్రప్రసాద్, లోక్ నాయక్ జయప్రకాశ్ నారాయణ, వినోబాభావే వంటి మహనీయులు కొనియాడారు. శ్రీ మూర్తిరాజుగారి మీద వినోబాజీ ప్రభావం ఎక్కువగా పడింది. వినోబాజీ ఆంధ్రదేశంలో భూదానోద్యమ పర్యటన జరుపుతూ పశ్చిమ గోదావరి జిల్లాలో పాదయాత్ర చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా కార్యక్రమ బాధ్యతనంతా ఆయన తన భుజస్కందాలమీద వేసుకొని విజయవంతంగా నిర్వహించి వినోబాజీ మెప్పు పొందినారు.
వినోబాజీ తమ పాదయాత్రలో ప్రతిరోజు గ్రామ బహిరంగ సభలో ప్రసంగం చేసెవారు. శ్రోతల ప్రశ్నలకు కూడా సమాధానాలిచ్చేవారు. ఇంకా ఎవరైనా తమకుకలిగిన సందేహాలు తీర్చుకోదలచినట్లయితే వారికి కూదా పగలు కొంత సమయం కేటాయించేవారు. పశ్చిమగోదావరి జిల్లా పర్యటనలో ఈ విధంగా ప్రతిరోజూ వినొబాజీ కావించిన ఉపన్యసాలు వారి సమాధానాలు వారి సమాధానాలు వారి ప్రవచనాలన్నీ క్రొడీకరించి వాటినీచ్చువేయించారు మూర్తిరాజుగారు. ఆచార్య వినొబాజీ పక్క జిల్లాలోకి ప్రవేశించే సమయంలో జరిగిన వీడ్కోలు సభలో ఈ పుస్తకాన్ని సమర్పించారు మూర్తిరాజుగారు.
ఒకరోజు ముందు తాను చెప్పిన మాటలు కూడా ఆ పుస్తకంలో ఉండటం వినొబాజీకి ఎంతో ఆశ్చర్యం కలిగించింది. మూర్తిరాజు గారి శ్రద్ధ, అంకిత భావం కార్య దీక్షను ఆయన శ్లాఘించకుండా ఉండలేకపోయినాడు. శ్రీ మూర్తిరాజుగారి వ్యక్తిత్త్వంలోనిఘనత ఆయనకు అవగతమైంది. ఇంకొక ఆశ్చర్యకరమైన విషయం ఎమిటంటే వినోబాజీ ఆ జిల్లాలో ప్రవేశించిన రోజు తీసిన చాయ చిత్రం మొదతి పేజీలో, వినోబాజీ ఆ జిల్లా వదిలి వెళుతున్న చిత్రం చివర పేజీలో చూచి అంతా ఆశ్చర్యచకితులైనారు. 100 పేజీలు గల ఈ పుస్తకం ఎంతో ప్రాచుర్యాన్ని, ప్రజాదరణను పొందింది.
మరొక విషయం 1961లో పశ్చిమ గోదావరి జిల్లా ఉంగుటూరులో అఖిల భరత సర్వోదయ సమ్మేళనం జరిగింది. ఈ సమ్మేళనం నిర్వహణ బాధ్యత మూర్తిరాజుగారు వహించారు. రాష్ట్రపతి బాబు రాజేంద్రప్రాసద్ ను ఈ సమ్మేళనానికి ఆహ్వానించారు. యావత్ భారతదేశంలోని అన్ని రాష్ట్రాలనుంచి ఎందరో సర్వోదయ కార్యకర్తలు గాంధేయనిర్మాణ సంస్థల ప్రతినిధులు ఈ సభకు హాజరైనారు. సభ బ్రహ్మాండంగా జరిగింది. ఈ మాహాసభ ఏర్పాట్లు, జన ప్రవాహాని చూచిన జాతీయ నాయకులంతా విస్తుపోయారు. రాజేంద్రప్రసాద్ తన ముగింపు ప్రసంగంలో ఇతర కార్యక్రమాల కారణంగా ఈ మహాసభలో పల్గొనతం సాధ్యం కాదేమోనని నేను అనుకున్నాను. కాని నిజంగా ఈ సభకు నేను రాకపోయి ఉన్నట్లయితే ఎంతో పెద్ద తప్పుచేసిన వాణ్ణి అయి ఉండేవాడిని అని అన్నారు. 
శ్రీ జయప్రకాశ్ నారాయణ్ మూర్తిరాజుగారి కార్యనిర్వహణ దీక్షత గురించి యేమన్నారంటే "నాకు స్తుతి వాక్యలు చెప్పటమంతే గిట్టదు. కాని ఇక్కడ ఈ సమ్మేళనంలో శ్రీ మూర్తిరాజు గంభీరమైన త్యాగశీలత్వం నిరంతర కార్యోత్సాహం కండ్లతో చూచినప్పుడు వారిని అభినందించకుండా ఆలింగనం చేసుకోకుండా ఉండలేకపోయానన్నారు". గ్రామ స్థాయిలోనూ, నియోజకవర్గం స్థాయిలోనూ, జిల్లా స్థాయిలోనూ, రాష్ట్ర స్థాయిలోనూ శ్రీ మూర్తిరాజు గారు ఎన్నో మహత్కార్యాలు, నిర్మాణకార్యక్రమాలు, దానధర్మాలు చేసారు. అట్టడుగున ఉన్న బలహీన వర్గాల అభ్యున్నతికి, అభివృద్ధికి, వారు ఎన్నో కార్యక్రమాలు నిర్వహించారు. కొల్లేరు భూములు సేద్యం చేసే పేద రైతులకు ఆయన అందించిన కహాయ కహకారాలు, తోకలపల్లి గ్రామంలో పేద హరిజనులకు ఇండ్లు కట్టించి దానికి బాపూనగర్ అని పేరు పెట్టటం తన నియోజక వర్గంలోని ఇంకా ఇతర గ్రామాలలో హరిజనులకు నివాశ స్థలాలు ఇప్పించటం, కొల్లేటి ముంపుకు గురైన 200 కుటుంబాలకు నిడమర్రు గ్రామంలో నివాస స్థలాలు ఇప్పించటం వంటివి ఆయన విర్వహించిన కార్యక్రకాలలో కొన్ని మచ్చుతునకలు మాత్రమే. గ్రామీణ ఆభుదయానికి వారు ఎన్నో సేవలు చేసారు.
తాడేపల్లిగూడెంలో "లలిత కళాకేంద్రం" స్థాపించి ఎందరో కళాకారులను సన్మానించారు. ముఖ్యంగా పెదనిండ్రకొలనులో ఆయన కలలకు సాకారంగా నిర్మించిన మహాత్మాగాంధీ మెమోరియల్ మ్యూజియం అండ్ లైబ్రరీ శ్రీ మూర్తిరాజుగారి ఆశయాల ప్రతీకగా విరాజిల్లుతున్నది. దాదాపు కోటి రూపాయల వ్యయంతో ఈ భవన నిర్మాణం జరిగింది. అట్లాగే తండ్రి బాపిరాజు గారిపేరుతో వారు స్థాపించిన వందలాది పాఠశాలలను గాంధీ సాహిత్యప్రచురణ, ఇంకా ప్రకృతివైద్యం వంటి అనేకానేక ప్రజాహిత కార్యక్రమాలు చేపట్టి వాటిని విజయవంతంగా నిర్వహించారు. శ్రీ మూర్తిరాజు గారు ఆంధ్రరత్నదినపత్రిక స్థాపించారు మరియూ ప్రకాశంగారి శతజయంతి ఉత్సవ సంచిక ప్రచురించారు. 
శ్రీ మూర్తిరాజుగారు బహుముఖ ప్రజ్ఞాశాలి. ఆయన ఒక వ్యక్తి మాత్రమే కాదు. ఒక సంస్థ. ఒక నూతన వ్యవస్థను రూపొందించటానికి కృషిచేసిన అభ్యుదయ వాది. నిరంతరకార్యశీలి, సత్య్, అహిన్సల క్రాంతికారుడు. ఒక నిస్వార్ధ నిరాడంబర దేశభక్తుడు, ఆదర్శపురుషుడు, నిష్కామ సేవ చేసే ప్రజాసేవా పరాయణుదు, కర్మయోగి. కర్మయోగి శ్రీ మూర్తిరాజుగారి జీవిత చరిత్ర భావితరాలకు మార్గదర్శం……………………………. సి.వి.చారి.