Jump to content

చింతలాయపల్లి

అక్షాంశ రేఖాంశాలు: 15°01′13″N 78°06′22″E / 15.020370°N 78.106094°E / 15.020370; 78.106094
వికీపీడియా నుండి
చింతలాయపల్లి
—  రెవెన్యూయేతర గ్రామం  —
చింతలాయపల్లి is located in Andhra Pradesh
చింతలాయపల్లి
చింతలాయపల్లి
అక్షాంశరేఖాంశాలు: 15°01′13″N 78°06′22″E / 15.020370°N 78.106094°E / 15.020370; 78.106094
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా అనంతపురం
మండలం యాడికి
ప్రభుత్వం
 - సర్పంచి
పిన్ కోడ్ 515 408
ఎస్.టి.డి కోడ్

చింతలాయపల్లి అనంతపురం జిల్లా, యాడికి మండలానికి చెందిన రెవెన్యూయేతర గ్రామం.

కొత్త వెంకటరమణుడి కల్యాణోత్సవం

[మార్చు]

చింతలాయపల్లి వద్ద కొత్త వెంకటరమణుడి (కొత్తరాయుడు) కల్యాణోత్సవం ప్రతి సంవత్సరం వైభవంగా జరుగుతుంది. చుట్టుపక్కల గ్రామాల నుంచి వచ్చిన జనంతో ఆలయ ఆవరణ కిటకిటలాడింది. కొత్తరాయుడి తిరుణాల సందర్భంగా స్వామికి బిందెసేవ, విష్వక్సేన ఆరాధనం, పూర్ణకుంబాభిషేకం, అష్టోత్తర మంత్రపుష్పనివేదన, ఉదయం ఉత్సవమూర్తులను మూలస్వామి సన్నిధికి చేర్చి కళ్యాణోత్సవం ఘనంగా నిర్వహిస్తారు. కల్యాణోత్సవాన్ని తిలకించడానికి మహిళలుపెద్దసంఖ్యలో తరలి వస్తారు. అనంతరం భక్తులకు అన్నదానకార్యక్రమం ఏర్పాటు చేస్తారు. కల్యాణోత్సవం సందర్భంగాచింతలాయపల్లి భక్తబృందం ఆధ్వర్యంలో భజన కార్యక్రమం జరుగుతుంది. సాయంత్రం పారువేట, లేదా పార్వేట రాత్రికి గ్రామోత్సవం ఘనంగా నిర్వహిస్తారు. మూలవిరాట్‌ను దర్శించుకోవడానికి భక్తులుబారులు తీరుతారు. గ్రామానికి దూరంగా ఉన్నందున భక్తులకు అసౌకర్యంకలగకుండా పలు స్వఛ్ఛంద సంస్థల ఆధ్వర్యంలో అన్నదానం, చలివేంద్రం, వైద్యశిబిరం, విద్యుత్తు సౌకర్యం, చల్లని మజ్జిగ వంటి సౌకర్యాలు కల్పిస్తారు.

మూలాలు

[మార్చు]

వెలుపలి లంకెలు

[మార్చు]