Jump to content

చింతామణి మహారాజ్

వికీపీడియా నుండి

చింతామణి మహారాజ్ భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2024లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో సర్గుజా లోక్‌సభ నియోజకవర్గం నుండి తొలిసారి లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.[1]

తొలినాళ్ళ జీవితం, చదువు

[మార్చు]

ఈయన ఛత్తీస్‌గఢ్‌లోని సుర్గుజా జిల్లా శ్రీకోట్ గ్రామానికి చెందినవాడు. ఈయన తండ్రి దివంగత రామేశ్వర్ సింగ్. చింతామణి 2014 లో ఛత్తీస్‌గఢ్ సంస్కృత విద్యామండల్‌కు రాంపురంలో అనుబంధంగా ఉన్న కళాశాల నుండి 12వ తరగతి పాసయ్యాడు. [2]

కెరీర్

[మార్చు]

2013 ఛత్తీస్‌గఢ్ శాసనసభ ఎన్నికల్లో భారత జాతీయ కాంగ్రెస్ తరపున లుంద్రా అసెంబ్లీ నియోజకవర్గం నుండి మహారాజ్ ఎమ్మెల్యేగా తొలిసారిగా గెలిచాడు.[3][4] 2013లో 64,771 ఓట్లతో ఆయన తన సమీప ప్రత్యర్థి, భారతీయ జనతా పార్టీకి చెందిన విజయ్ బాబాను 9,946 ఓట్ల తేడాతో ఓడించాడు. తర్వాత ఆయన భారతీయ జనతా పార్టీలో చేరి, 2024 ఛత్తీస్‌గఢ్‌లో జరిగిన భారత సార్వత్రిక ఎన్నికల్లో సర్గుజా లోక్‌సభ నియోజకవర్గం నుండి గెలిచి పార్లమెంటు సభ్యుడయ్యాడు. [5] [6] 7,13,200 ఓట్లుతో మహారాజ్ తన సమీప ప్రత్యర్థి భారత జాతీయ కాంగ్రెస్‌కు చెందిన శశి సింగ్‌ను 64,822 ఓట్ల తేడాతో ఓడించాడు.[7][8]

మూలాలు

[మార్చు]
  1. ↑ Election Commision of India (4 June 2024). "2024 Loksabha Elections Results - Surguja". Archived from the original on 31 July 2024. Retrieved 31 July 2024.
  2. ↑ "Chintamani Maharaj(Bharatiya Janata Party(BJP)):Constituency- SURGUJA (ST)(CHHATTISGARH) - Affidavit Information of Candidate". myneta.info. Retrieved 2024-10-23.
  3. ↑ "Lundra(Chhattisgarh) Election Result 2018 Updates: Candidate List, Winner & Runner-up MLA List".
  4. ↑ "Archived copy" (PDF). Archived from the original (PDF) on 12 July 2018. Retrieved 6 August 2018.{{cite web}}: CS1 maint: archived copy as title (link)
  5. ↑ "Sarguja (ST) election results 2024 live updates: BJP's Chintamani Maharaj wins against Congress' Shashi Singh Koram with a margin of 64822 votes". The Times of India. 2024-06-04. ISSN 0971-8257. Retrieved 2024-06-06.
  6. ↑ "Surguja Election Result 2024 LIVE Updates Highlights: Lok Sabha Winner, Loser, Leading, Trailing, MP, Margin". News18 (in ఇంగ్లీష్). 2024-06-04. Retrieved 2024-10-23.
  7. ↑ Live, A. B. P. (2024-06-04). "Surguja Election Result 2024 LIVE Updates". news.abplive.com (in ఇంగ్లీష్). Retrieved 2024-10-23.
  8. ↑ "Surguja Lok Sabha Election 2024: Get Latest News Updates of Surguja Lok Sabha Constituency for General Election 2024". The Indian Express (in ఇంగ్లీష్). Retrieved 2024-10-23.