చిక్కడు దొరకడు (1988 సినిమా)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చిక్కడు దొరకడు (1988 సినిమా)
(1988 తెలుగు సినిమా)
దర్శకత్వం రేలంగి నరసింహారావు
నిర్మాణం ఎస్.పి. వెంకన్నబాబు
తారాగణం రాజేంద్ర ప్రసాద్,
మంజుల (నటి),
రజని
సంగీతం రాజ్ - కోటి
నృత్యాలు శరత్
కూర్పు డి. రాజగోపాల్
నిర్మాణ సంస్థ మహేశ్వరి మూవీస్
భాష తెలుగు

చిక్కడు దొరకడు 1988 లో వచ్చిన యాక్షన్ చిత్రం. మహేశ్వరి మూవీస్ కోసం, రేలంగి నరసింహారావు దర్శకత్వంలో ఎస్పీ వెంకన్న బాబు నిర్మించాడు. ఇందులో రాజేంద్ర ప్రసాద్, రజని ప్రధాన పాత్రల్లో నటించారు. రాజ్-కోటి సంగీతం సమకూర్చారు.[1][2]

కథ[మార్చు]

రాజా (రాజేంద్ర ప్రసాద్) & రాణి (రజని) చిన్న దొంగలు. వారు ప్రిన్సిపాల్ కృష్ణ పరమాత్మ (గొల్లపూడి మారుతీరావు) నేతృత్వంలోని దొంగల కళాశాల విద్యార్థులు. ప్రారంభంలో, వారి పరిచయము ఫన్నీ తగాదాలతో మొదలవుతుంది. తరువాత ఇద్దరూ ప్రేమలో పడతారు. రత్నగిరి ఎస్టేట్ యజమాని గాయత్రి దేవి (మంజుల), ఆమెకు ఇద్దరు కుమారులు పెదబాబు ప్రదీప్, చినబాబు దిలీప్ (మళ్ళీ రాజేంద్ర ప్రసాద్) ఉన్నారు. ప్రదీప్ కారు ప్రమాదంలో మరణించాడు, అతనికి భార్య సుమిత్ర (జ్యోతి), ముగ్గురు పిల్లలూ ఉన్నారు. ఆ ప్రమాదంలో సుమిత్రా మానసిక షాక్ లోకి వెళ్ళింది. దిలీప్ అమెరికాలో చదువుతున్నాడు. అందువల్ల గాయత్రీ దేవి ముగ్గురు సోదరులు సత్యం (సత్యనారాయణ), శివం (గిరి బాబు), సుందరం (బ్రహ్మానందం) ఆమె ఆస్తిని చూసుకుంటున్నారు. వీరంతా నేరస్థులు, ప్రదీప్‌ను హత్య చేసిన వారు. తమ ఆస్తిని, అత్యంత విలువైన కుటుంబ వారసత్వ సూర్యకాంతి వజ్రాన్ని లాక్కోవడానికి దిలీప్‌ను చంపే అవకాశం కోసం ఎదురు చూస్తున్నారు. నగరంలో ఒకసారి, ముగ్గురూ దిలీప్‌ను పోలిన రాజాను చూసి ఆశ్చర్యపోతారు. కాబట్టి, వారు ఒక ప్రణాళిక వేసి, అతనికి కథొకటి చెప్పి, డబ్బుతో ఆకర్షించి దిలీప్‌కు బదులుగా అతని స్థానంలో చేరుస్తారు. మరోవైపు సూర్యకాంతి వజ్రం దోపిడీకి కృష్ణ పరమాత్మతో సుందరం రహస్యంగా ఒప్పందం కుదుర్చుకున్నాడు. అతను ఆ పనిని రాణికి అప్పగిస్తాడు. ఆమె కూడా సీతాదేవి పేరిట పిల్లలకు ఉపాధ్యాయురాలిగా ఎస్టేట్ చేరుకుంటుంది. రాజా, రాణి ఇద్దరూ అక్కడ కలుస్తారు కాని వారు ఒకరినొకరు తెలియని విధంగా వ్యవహరిస్తారు. కొంతకాలం తర్వాత, ముగ్గురూ కలిసి దిలీప్‌ను చంపేసి, ఆ నేరాన్ని రాజాపై మోపి అరెస్టు చేయిస్తారు. అయితే ఆశ్చర్యకరంగా దిలీప్ తిరిగి వస్తాడు. రాజా కూడా ముగ్గురిపై ప్రతీకారం తీర్చుకోవడానికి జైలు నుండి తప్పించుకుంటాడు. ఈ ప్రక్రియలో, రాజా దిలీప్ వలె డబుల్ గేమ్ ఆడుతున్నాడని రాణి మాత్రమే గుర్తిస్తుంది. ఆమె దీని గురించి ప్రశ్నించినప్పుడు, అతను ఈ ముగ్గురి యొక్క దుర్మార్గం, చెడు ప్రణాళికలను వెల్లడిస్తాడు. అతను ముగ్గురి నేరాలను బయటకు తీసుకురావడానికి ఆ కుటుంబ శ్రేయస్సు కోరే ఎస్.ఐ రామారావు (రంగనాథ్) సహాయంతో బయలుదేరాడు. రాజా కుటుంబాన్ని రక్షించడం, ముగ్గురిని ఆటపట్టించడం, వారి ముగింపు చూడటం అంతా కామిక్‌గా సాగుతుంది.

తారాగణం[మార్చు]

పాటలు[మార్చు]

ఎస్ పాట పేరు గాయకులు పొడవు
1 "చలినే నమ్ముకుందామా" ఎస్పీ బాలు, ఎస్.జానకి 4:21
2 "సాయంకాలం ఆందగత్తె" ఎస్పీ బాలు, ఎస్.జానకి 4:04
3 "ఓ రబ్బీ నీ" ఎస్పీ బాలు, ఎస్.జానకి 4:31
4 "ఎత్తు ఎత్తువేయి" ఎస్పీ బాలు, ఎస్.జానకి 3:49
5 "వినవే బాలా" ఎస్పీ బాలు 4:23

మూలాలు[మార్చు]

  1. "Chikkadu Dorakadu (Cast & Crew)". Chitr.com.[permanent dead link]
  2. "Chikkadu Dorakadu (Review)". The Cine Bay. Archived from the original on 2018-08-02. Retrieved 2020-08-30.