చిట్టేపల్లి
Jump to navigation
Jump to search
ఈ వ్యాసంలో మూలాలను ఇవ్వలేదు. |
చిట్టేపల్లి | |
— రెవెన్యూయేతర గ్రామం — | |
ఆంధ్రప్రదేశ్ పటంలో గ్రామ స్థానం | |
అక్షాంశరేఖాంశాలు: 14°24′44″N 79°45′45″E / 14.4122337°N 79.7624177°E | |
---|---|
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా |
మండలం | పొదలకూరు |
ప్రభుత్వం | |
- సర్పంచి | |
పిన్ కోడ్ | 524345 |
ఎస్.టి.డి కోడ్ | 08621 |
చిట్టేపల్లి , శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా, పొదలకూరు మండలానికి చెందిన రెవెన్యూయేతర గ్రామం.ఈ ఊరిలో మొత్తం జనాభా సుమారు 1000 వరకు ఉంటుంది. ఈ ఊరు పొదలకూరుకి చాలా దగ్గరలో ఉంది. ఈ ఊరికి ఒక విశిష్ట స్థానం ఉంది. ఈ ఊరికి 125 సంవత్సరాల చరిత్ర ఉంది.
- చిట్టేపల్లి గ్రామంలో నారాయణస్వామి దేవగిరి క్షేత్రం (చిట్టేపల్లి కొండ) ఉంది. భగవాన్ శ్రీ వెంకయ్యస్వామి ప్రథమ శిష్యులు నారాయణస్వామి ఆరాధనోత్సవాలు, ప్రతి సంవత్సరం మాఘమాసంలో 5 రోజులపాటు ఘనంగా నిర్వహించెదరు. 2014, ఫిబ్రవరి-17న నారాయణస్వామి విగ్రహ ప్రతిష్ఠ జరుగును. [1]
- చిట్టేపల్లి గ్రామంలో పోలేరమ్మ ఆలయం ఉంది. సంక్రాంతి పండుగ తరువాత వచ్చే మాఘమాసంలో, పోలేరమ్మ తల్లికి పొంగళ్ళు పెడితే పాడిపంటలు వృద్ధి చెందుతవనీ, పశువులకు వచ్చే వ్యాధులు సంక్రమించవని నమ్మకంతో, పొంగళ్ళు పెట్టి గ్రామస్థులు మొక్కులు తీర్చుకుంటారు. గ్రామంలోని ప్రతి ఇంటినుండి, స్త్రీల సంఖ్య నైవేద్యాలతో నిండిన బుట్టలను నెత్తిపై పెట్టుకొని, సుమారు 4 కి.మీ. దూరం నడుచుకొని దేవాలయం చేరుకుంటారు. అక్కడ పొంగళ్ళు పెట్టి తొలి నైవేద్యాన్ని అమ్మవారికి భక్తిశ్రద్ధలతో సమర్పిస్తారు. రెండు మంగళవారాలు గ్రామంలో సద్ది పెట్టిన తరువాత పొంగళ్ళు పెట్టడం జరుగుతుంది. ఈ ఆలయంలో భక్తుల సౌకర్యార్ధం కొత్తగా హుండీని ఏర్పాటుచేశారు. [2]