చిత్రా రామకృష్ణ
చిత్రా రామకృష్ణ | |
---|---|
జననం | 1963 |
జాతీయత | భారతదేశం |
విద్య | బి.కామ్,ఎఫ్.సి.ఏ |
వృత్తి | నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ మాజీ ఎండీ, సీఈవో[1] |
అంతకు ముందు వారు | రవి నరైన్ |
చిత్రా రామకృష్ణ (జననం 1963) నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ (National Stock Exchange of India Limited) మాజీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్. ఆమె 2013 ఏప్రిల్ నుంచి 2016 డిసెంబర్ వరకు ఎన్‌ఎస్‌ఈ ఎండీ, సీఈవోగా బాధ్యతలు నిర్వహించింది.[2]
వృత్తి జీవితం
[మార్చు]చిత్రా ఛార్టెర్డ్ అకౌంటెంట్‌గా తన వృత్తి జీవితాన్ని ప్రారంభించి 1985లో ఐడీబీఐ బ్యాంక్‌కు చెందిన ప్రాజెక్ట్ ఫైనాన్స్ డివిజన్‌లో చేరింది. ఆమె ఆ తర్వాత కొంతకాలం సెబీలో పనిచేసి తిరిగి మళ్లీ ఐడీబీఐ బ్యాంక్‌కు తిరిగివచ్చింది. బీఎస్‌ఈలో హర్షద్ మెహతా కుంభకోణం తర్వాత పారదర్శక ట్రేడింగ్ కోసం కేంద్ర ప్రభుత్వం ఐదుగురితో ఎన్ఎస్ఈ ఏర్పాటు చేయగా అందులో చిత్ర రామకృష్ణ ఒకరిగా నియమితురాలైంది. ఆమె 2009లో ఎన్ఎస్ఈకి మేనేజింగ్ డైరెక్టర్(ఎండి)గా బాధ్యతలు చేపట్టి 2013లో నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ మాజీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్‌గా నియమితురాలై 2016 డిసెంబరులో ఎండీ, సీఈఓ పదవికి రాజీనామా చేసింది.
ఆరోపణలు
[మార్చు]చిత్రా ఎన్‌ఎస్‌ఈకి సంబంధించిన గోప్యనీయమైన సమాచారం (ఆర్థిక, వ్యాపార ప్రణాళికలు, ఆర్థిక ఫలితాలు మొదలైనవి), ఒక అజ్ఞాత వ్యక్తి (హిమాలయాల్లోని ఒక యోగి) సూచనల మేరకే ఆనంద్‌ను నియమించారని, ఎండీ.. సీఈవో స్థాయి అధికారాలన్నీ కూడా కట్టబెట్టారని, అడ్డగోలుగా జీతభత్యాలు పెంచారని, ఆనంద్ సుబ్రమణియన్‌ను ఎన్‌ఎస్‌ఈ చీఫ్ స్ట్రాటజిక్ అడ్వైజర్‌గా నియమించడం; తిరిగి గ్రూప్ ఆపరేటింగ్ ఆఫీసరుగా, ఎండీ సలహాదారుగా మార్చడం వంటి విషయాల్లో పాలనా పరమైన అవకతవకలు జరిగాయన్న ఆరోపణలు ఎదురుకుంటుంది.[3][4]
విచారణ
[మార్చు]ఎన్‌ఎస్‌ఈ కో-లొకేషన్ కుంభకోణం కేసులో చిత్రా రామకృష్ణను 2022 మార్చి 6న సీబీఐ అదుపులోకి తీసుకుని ఏడు రోజుల పాటూ విచారించింది. ఈ నేపథ్యంలో మరిన్ని వివరాలు రాబట్టేందుకు 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీకి అనుమతించాలన్న సీబీఐ విజ్ఞప్తి మేరకు ప్రత్యేక న్యాయస్థానం 2022 మార్చి 14న అనుమతించింది.[5]
మూలాలు
[మార్చు]- ↑ "Subramanian Anand resigned from NSE". MoneyLife. Archived from the original on 2017-03-17. Retrieved 2022-02-18.
- ↑ "Lunch with BS: Chitra Ramakrishna". Business Standard. 5 September 2014. Archived from the original on 18 February 2022. Retrieved 18 February 2022.
- ↑ Sakshi (14 February 2022). "హిమాలయా యోగి చెప్పారు.. చిత్ర చేశారు." Archived from the original on 18 February 2022. Retrieved 18 February 2022.
- ↑ Eenadu (17 February 2022). "వ్యాపార రారాణి.. యోగి.. ఓ 'అదృశ్య' కథ". Archived from the original on 18 February 2022. Retrieved 18 February 2022.
- ↑ "Chitra Ramkrishna: చిత్రా రామకృష్ణకు 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీ.. వీఐపీ ట్రీట్మెంట్‌కు కోర్టు నో". EENADU. Retrieved 2022-03-14.