చిన్నాగిరిపల్లి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

"చిన్నాగిరిపల్లి" కృష్ణా జిల్లా అగిరిపల్లి మండలానికి చెందిన రెవెన్యూయేతర గ్రామం. [1]

చిన్నాగిరిపల్లి
—  రెవెన్యూయేతర గ్రామం  —
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా కృష్ణా
మండలం అగిరిపల్లి
ప్రభుత్వం
 - సర్పంచి
పిన్ కోడ్ 521211
ఎస్.టి.డి కోడ్ 08656

గ్రామ చరిత్ర[మార్చు]

ఆంధ్ర ప్రదేశ్ రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ (సీఆర్‌డీఏ) పరిధిలోకి వస్తున్న మండలాలు, గ్రామాలను ప్రభుత్వం విడిగా గుర్తిస్తూ ఉత్తర్వులు జారీచేసింది. ప్రస్తుతం గుర్తించిన వాటిలోని చాలా గ్రామాలు వీజీటీఎం పరిధిలో ఉన్నాయి. గతంలో వీజీటీఎం పరిధిలో ఉన్న వాటితోపాటుగా ఇప్పుడు మరిన్ని కొన్ని గ్రామాలు చేరాయి. సీఆర్‌డీఏ పరిధిలోకి వచ్చే గుంటూరు, కృష్ణా జిల్లాల్లోని మండలాలు, గ్రామాలను గుర్తిస్తూ పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి ద్వారా ఉత్తర్వులు జారీ అయ్యాయి.[2]

కృష్ణా జిల్లాలోని మండలాలు, గ్రామాలు[మార్చు]

విజయవాడ రూరల్ మండలం పరిధితో పాటు, పట్టణ పరిధిలోకి వచ్చే ప్రాంతం. విజయవాడ అర్బన్ మండలం పరిధిలోని మండలం మొత్తంతో పాటు అర్బన్ ఏరియా కూడా. ఇబ్రహీంపట్నం మండలం మొత్తంతో పాటు అర్బన్ ప్రాంతం, పెనమలూరు మండలం పరిధితో పాటు అర్బన్ ఏరియా, గన్నవరం మండలంతో పాటు అర్బన్ ఏరియా, ఉంగుటూరు మండలంతో పాటు అర్బన్ ఏరియా, కంకిపాడుతో పాటు అర్బన్ ఏరియా, ఉయ్యూరుతో పాటు అర్బన్ ఏరియా, జి.కొండూరు మండలంతో పాటు అర్బన్ ఏరియా, కంచికచర్ల మండలంతో పాటు అర్బన్ ఏరియా, వీరుళ్లపాడు మండలంతో పాటు అర్బన్ ఏరియా, పెనుగంచిప్రోలు మండల పరిధిలోని కొంత భాగంతో పాటు శనగపాడు గ్రామం ఉన్నాయి.

అగిరిపల్లె మండలం[మార్చు]

అగిరిపల్లె మండలం మొత్తంతో పాటు పట్టణ పరిధిలో ఉన్న ప్రాంతం కూడా సీఆర్‌డీఏ పరిధిలోకి వస్తుంది.

గ్రామ భౌగోళికం[మార్చు]

ఇది సముద్రమట్టానికి 24 మీ.ఎత్తులో ఉంది.

గ్రామానికి రవాణా సౌకర్యాలు[మార్చు]

నూజివీడు, గన్నవరం నుండి రోడ్దురవాణా సౌకర్యం ఉంది. రైల్వేస్టేషన్; విజయవాడ 28 కి.మీ.దూరంలో ఉంది.

గ్రామంలో విద్యా సౌకర్యాలు[మార్చు]

జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాల, సూరవరం.

చుక్కపల్లి ఉన్నత పాఠశాల, అగిరిపల్లి.

ఎస్.ఎఫ్.ఉన్నత పాఠశాల, వడ్లమాను.

గ్రామములోని మౌలిక సదుపాయాలు[మార్చు]

పాల ఉత్పత్తిదారుల పరస్పర సహాయ సహకార సంఘం.

గ్రామ విశేషాలు[మార్చు]

ఈ గ్రామానికి చెందిన పామర్తి రామకోటేశ్వరరావు ప్రస్తుతం మచిలీపట్నం సమీపంలోని వాసవీ ఇంజనీరింగ్ కళాశాలలో ఆచార్యులుగా పనిచేయుచున్నారు. వీరికి ఆంధ్ర విశ్వవిద్యాలయం నుండి డాక్టరేట్ పట్టా లభించినది. ఒక వ్యక్తి స్వరం ఆధారంగా అతని ఐడెంటిటీని గుర్తించుటకు వీలుగా వీరు చేసిన పరిశోధనాంశానికి గాను, వీరికి ఈ డాక్టరేట్ పట్టా లభించినది.

మూలాలు[మార్చు]

  1. భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు Archived 2014-07-18 at the Wayback Machine భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు]
  2. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2016-08-18. Retrieved 2016-08-20.

వెలుపలి లంకెలు[మార్చు]