చిలకా ఏతోడులేక (పాట)
Appearance
(చిలక ఏతోడులేక నుండి దారిమార్పు చెందింది)
"చిలకా ఏతోడులేక" | |
---|---|
రచయిత | సిరివెన్నెల సీతారామశాస్త్రి |
సంగీతం | ఎస్. వి. కృష్ణారెడ్డి |
సాహిత్యం | సిరివెన్నెల సీతారామశాస్త్రి |
ప్రచురణ | శుభలగ్నం (1994) |
రచింపబడిన ప్రాంతం | ఆంధ్రప్రదేశ్ |
భాష | తెలుగు |
గాయకుడు/గాయని | ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం |
చిత్రంలో ప్రదర్శించినవారు | జగపతిబాబు, ఆమని, రోజా |
చిలకా ఏతోడు లేక పాట 1994లో విడుదలైన శుభలగ్నం చిత్రంలోని పాట. ఈ పాట రాసినందుకు సిరివెన్నెల సీతారామశాస్త్రి కి రాష్ట్రస్థాయిలో ఉత్తమ గీత రచయితగా నంది బహుమతి వచ్చింది. ఎస్. వి. కృష్ణారెడ్డి సంగీతం అందించిన ఈ పాటను ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం పాడాడు.[1]
పాట నేపథ్యం
[మార్చు]డబ్బుకోసం కట్టుకున్న భర్తను వేరే అమ్మాయికి అమ్ముకున్న భార్యకు తన భర్త, మాంగళ్యం విలువ తెలిసిన సందర్భంలో వచ్చే పాట.
పాటలోని సాహిత్యం
[మార్చు]పల్లవి:
చిలుకా ఏ తోడు లేక ఎటేపమ్మ ఒంటరి నడక
తెలిసీ అడుగేసినావే ఎడారంటి ఆశల వెనుక
మంగళసూత్రం అంగడి సరుకా కొనగలవా చేజారాక
లాభం ఎంతొచిందమ్మ సౌభాగ్యం అమ్మేశాక //చిలుకా//
చరణం 1:
బ్రతుకంతా బలిచేసే పేరాశను ప్రేమించవే
వెలుగుల్ని వెలివేసే కలలోనే జీవించావే
అమృతమే చెల్లించి ఆ విలువతో హాలహలం కొన్నావే అతి తెలివితో
కురిసే ఈ కాసుల జడిలో అలసీ నిరుపేదైనావే //చిలుకా//
పురస్కారాలు
[మార్చు]- సిరివెన్నెల సీతారామశాస్త్రి- ఉత్తమ గీత రచయితగా నంది పురస్కారం -1994
- కళాసాగర్ అవార్డు -1994
- మనస్విని అవార్డు -1994
మూలాలు
[మార్చు]- ↑ "Chilaka Ye Thodu Lekha". www.amazon.com. Retrieved 2020-12-22.
{{cite web}}
: CS1 maint: url-status (link)