Jump to content

చిల్లర కృష్ణమూర్తి

వికీపీడియా నుండి

చిల్లర కృష్ణమూర్తి పండితులు, నటులు, పాటల రచయిత, శ్రీ చక్రోపాసకులు, శివ భక్తాగ్రేసరులు, అభినవ ధూర్జటి బిరుదాంకితులు, వృత్తి రీత్యా పూర్వ ఆంధ్రప్రదేశ్ సమాచార పౌర సంబంధాల శాఖలో విశ్రాంత సహాయ సంచాలకులు. 

జననం

[మార్చు]

1933, ఫిబ్రవరి 2న నెల్లూరు జిల్లా, కనుపర్తిపాడు గ్రామంలో జన్మించాడు. తల్లిదండ్రులు పిచ్చయ్య, మహలక్షమ్మ. వి.ఆర్ కళాశాలలో చదివారు. 1953లో ఆంధ్ర విశ్వవిద్యాలయం నుండి పట్టభద్రులయ్యారు.

రచనలు

[మార్చు]
  • శ్రీతారకరామవైభవము
  • (భాగ్యనగరం, నాంపల్లి శ్రీరామభక్త సమాజంవారి ప్రచురణ)
  • శివపంచతత్త్వ సుధా తరంగిణి
  • గణేశ్ పాటలు (కౌండిన్య కలం పేరుతో)
  • శతాధికంగా రచింపబడిన పాటలు
  • పద్యాలు (వివిధ నాటకములకు)
  • స్వరామృత లహరి
  • లలితామృత లహరి
  • శ్రీనృహరి కృపాలహరి
  • సాయి కృపామృతలహరి

ఉద్యోగం

[మార్చు]

రాష్ట్ర సమాచార పౌర సంబంధాల శాఖలో సహాయ సంచాలకులుగా పనిచేసి 1989లో పదవీ విరమణ చేశారు.

సమ్మానాలు

[మార్చు]
  • ఆం.ప్ర., సచివాలయ సాంస్కృతిక సంఘం,
  • సంస్కారభారతి (భాగ్యనగరం), యువకళావాహిని
  • సుప్రజాభారతి, శ్రీనివాసనాట్యకళా మండలి మున్నగు
  • సాంస్కృతిక సంస్థలనే సమ్మానస్వీకారం.

మరణం

[మార్చు]

2014 అక్టోబరు 25న మరణించారు