చీపురు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చీపురు

చీపురు లేదా పొరక నేలను, గదులను ఊడ్చి శుభ్రము చేయటానికి ఉపయోగించే గృహోపకరణము. ఆంధ్ర దేశములో సాంప్రదాయక చీపుర్లను పొరక గడ్డి (అరిస్టిడా)[1], బోద గడ్డి, కొబ్బరి ఆకుల ఈనెలతో తయారు చేస్తారు. రైతులో ఆరుబయట గరుకు నేలను శుభ్రపరచటానికి తాత్కాలికంగా కంది కట్టెలతోనూ, నూగు కట్టెలతోనూ చీపుర్లను తయారుచేసుకుంటారు. ఆ తరువాత కాలములో చీపురు అంచులను సులువుగా పట్టుకునేందుకు వీలుగా ఒక రేకు గొట్టంలో లేదా ప్లాస్టిక్ ట్యూబులో అమర్చడం ప్రారంభించారు.

తెలుగు భాషలో చీపురును మొత్తంగా చీపురు కట్ట అని, చిన్నచిన్న పుల్లల్ని చీపురు పుల్లలు అని వ్యవహరిస్తారు. చీపురు పుల్లల కోసం పెంచే గడ్డిని చీపురు గడ్డి అంటారు.[2]

పాతకాలంలో కొంతమంది పనివారిని, పిల్లల్ని చీపురుతో కొట్టి శిక్షించేవారు.

  • హ్యారీ పాటర్ లో పొడుగాటి చీపురు మీద కూర్చుని గాలిలో ఎగురుకుంటూ 'క్విడిఛ్' ఆట ఆడతారు.

మూలాలు[మార్చు]

  1. CRC World Dictionary of Grasses By Umberto Quattrocchi పేజీ.158 [1]
  2. "బ్రౌన్ నిఘంటువు ప్రకారం చీపురు పదప్రయోగాలు". Archived from the original on 2016-01-25. Retrieved 2009-12-29.
"https://te.wikipedia.org/w/index.php?title=చీపురు&oldid=2803115" నుండి వెలికితీశారు