హ్యారీ పాటర్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
హ్యారీ పాటర్ (Harry Potter)
జె.కె.రౌలింగ్ రచించిన హ్యారీ పాటర్ పుస్తకాల పరంపరలో మొదటి దైన Harry Potter and the Philosopher's Stone ముఖచిత్రం(British/Canadian/Australian/Irish/ Japanese/Taiwanese/African version).
కృతికర్త: జే. కే. రౌలింగ్
బొమ్మలు: థామస్ టాయ్‌లర్, క్లిఫ్ రైట్, గైల్స్ గ్రీన్‌ఫీల్డ్, జేసన్ కాక్‌క్రాఫ్ట్
దేశం: యునైటెడ్ కింగ్‌డమ్
భాష: ఇంగ్లీషు
విభాగం (కళా ప్రక్రియ): కాల్పనిక సాహిత్యం
ప్రచురణ: Bloomsbury, et. al.
విడుదల: 26 జూన్ 1997

హ్యారీ పాటర్ పుస్తకాలు ఇంగ్లండుకు చెందిన రచయత్రి జె.కె. రౌలింగ్ రచించిన ఫాంటసీ సాహిత్యపు పుస్తకాల వరుస. 1997 లో మొదటి పుస్తకము హ్యారీ పాటర్ అండ్ ఫిలాసఫర్స్ స్టోన్ (Harry Potter and the Philosopher's Stone) విడుదల నుండి, ఆ పుస్తకాల పాప్యులారిటీ ప్రపంచ వ్యాప్తంగా అనూహ్యంగా పెరిగి పోయింది. హ్యారీ పాటర్ సినీమాలు, వీడియో గేమ్స్ ఇతర వస్తువులకు శ్రీకారము చుట్టడము జరిగింది. ఈ వరుసలో మొత్తం ఏడు పుస్తకాలున్నాయి, ఫిబ్రవరి 2018 నాటికి ప్రపంచవ్యాప్తంగా 50 కోట్ల కన్నా ఎక్కువ కాపీలు అమ్ముడయ్యాయి,చరిత్రలో అత్యధికంగా అమ్ముడైన పుస్తక శ్రేణిగా నిలిచాయి. ఈ పుస్తకాలు ఎనభై భాషలలోకి అనువదించబడ్డాయి.[1]

కథలో చాలా భాగము హాగ్వార్ట్స్ మంత్ర తంత్ర జాల పాఠశాలలో నడుస్తంది. బాలుడైన హ్యారీ పాటర్ కు క్షుద్రవిద్యలు నేర్చిన మంత్రగాడు వోల్డమోర్ట్ తో జరిగిన పోరాటము ఈ కథలో ముఖ్యాంశము. ఏడవ పుస్తకం హ్యారీ పాటర్ ఆండ్ డెత్లీ హాలోస్ (Harry Potter and the Deathly Hallows) 21 జూలై 2007 న విడుదలై సంచలనం సృష్తించింది. విడుదలైన రోజే కాపీలన్నీ అమ్ముడైపోయి రికార్డులకెక్కింది.[2]

అన్ని పుస్తకాలను చిత్రాలుగా తెరకెక్కించడం జరిగింది. ఈ చిత్రాలకు ప్రధానంగా డేవిడ్ హేమాన్ నిర్మించాడు. డేనియల్ రాడ్‌క్లిఫ్ (హ్యారీ పాటర్), రూపెర్ట్ గ్రింట్ (రాన్ వెస్లీ), ఎమ్మా వాట్సన్ (హెర్మియోన్ గ్రాంజెర్)లు మూడు ప్రముఖ పాత్రలలో నటించారు. ఈ సిరీస్‌లో నలుగురు దర్శకులు పనిచేశారు: క్రిస్ కొలంబస్, అల్ఫోన్సో క్యూరాన్, మైక్ న్యూవెల్, డేవిడ్ యేట్స్. ఏడవ ఆఖరి నవల అయిన హ్యారీ పాటర్ అండ్ ది డెత్లీ హాలోస్ (Harry Potter and the Deathly Hallows) రెండు భాగాలుగా తెరకెక్కింది. మొదటి భాగం నవంబర్ 2010 లో విడుదలైంది, రెండవది జూలై 2011 లో విడుదలైంది. [3] [4]

ఈ నవలల సాఫల్యం వలన, రౌలింగ్ సాహిత్య చరిత్రలోనే అతి ధనవంతురాలైనది.[5] పుస్తకాలు, చలన చిత్రాల విజయంతో హ్యారీ పాటర్ ఫ్రాంచైజీని అనేక ఉత్పన్న రచనలతో విస్తరించారు, 2009 లో చికాగోలో ఒక ప్రయాణ ప్రదర్శన ప్రదర్శించబడింది, లండన్లో ఒక స్టూడియో పర్యటన 2012 లో ప్రారంభమైంది, ఒక డిజిటల్ వేదికపై జే. కే. రౌలింగ్ సిరీస్‌ను క్రొత్త తలఁపులు,సమాచారంతో తాజాపరుస్తుంది[6], ఫన్టాస్టిక్ బీస్ట్స్ అండ్ వేర్ టు ఫైండ్ దెమ్‌ (Fantastic Beasts and Where to Find Them, 2016), ఫన్టాస్టిక్ బీస్ట్స్: ది క్రైమ్స్ ఆఫ్ గ్రిండెల్వాల్డ్ (Fantastic Beasts: The Crimes of Grindelwald, 2018) అనే రెండు క్రొత్త చలనచిత్రాలు ఈ ఫ్రాంచైజీలో (ఇదే ఫాంటసీ ప్రపంచంలో) విడుదలయ్యాయి.

ఎలా మొదలైందంటే

[మార్చు]

1990 లో జె.కె.రౌలింగ్ ఒక రష్ గా ఉన్న ట్రైనులో మాంచెష్టర్ నుండి ఇంగ్లండుకు వెళుతుండగా హ్యారీ పాటర్ ఐడియా అమె బుర్ర లోకి నడుచుకుంటూ వచ్చింది. ఒక చిత్తు కాగితము పై ఆ ఆలోచనలను వ్రాసుకున్నారు. రౌలింగ్ ఆమె వెబ్ సైటులో ఇలా అంటారు.

"ఆరు సంవత్సరముల వయస్సు ఉన్నపటి నుండి రచనలు చేస్తున్నా ఒక ఐడియా గురించి ఎప్పుడూ ఇంత ఉత్సాహము రాలేదు.[...] ఒక నాలుగు గంటలు (ట్రైను కోసము వైట్ చేస్తూ) ఆలోచిస్తుండగా, మెడడు లో వివరాలు రూపు దిద్దుకున్నాయి. ఈ సన్నటి, నల్ల జుత్తు గల (పాశ్చాత్య దేశాల లో నల్ల జుత్తు చాలా మందికి ఉండదు.) , కళ్ళజోడు ఉన్న బాలుడు, తాను నిజంగా మంత్రగాడనే విషయము తెలెయని వాడు, సాధ్యమని నాకు అనిపించడము మొదలు పెట్టింది.".[7]

ఆ రోజు సాయంత్రము ఆమె మొదటి నవల మమూనా, అనుకున్న ఏడు పుస్తకాల పాక్షిక వివరాలతో ఒక ప్లాన్, హ్యారీ పాటర్ పుస్తకాలలో పాత్రలు, మంత్ర ప్రపంచములో చాలా మొత్తములో చారిత్రిక, మనిషి చరిత్ర సంబంధము గల(బయోగ్రాఫికల్) వివరాలు వ్రాయడము మొదలు పెట్టారు.[8]

అ తరువాత ఆరు సంవత్సరముల కాలములో మొదటి బిడ్డ పుట్టడము, మొదటి భర్త నుండి విడాకులు పొందడము, పోర్చుగల్ కు నివాసము మార్చుకోవడము జరిగాయి. వీటన్నటి మధ్యలో ఆమె ఫిలాసఫర్స్ స్టోన్ వ్రాస్తున్నరు.[9] ఆ తరువాత ఎడింబరోలో స్థిరపడిన రౌలింగు కాఫీక్లబ్లో చాలామటుకు కూర్చుని ఫిలాసఫర్స్ స్టోన్ వ్రాశారు. మంచి నర్సరీ(బాలల కేంద్రము) దొరక్క పోవడముతో ఆమె కూతురు కూడా ఆమెతో నే ఉండేది.

1996 లో హ్యారీ పాటర్ అండ్ ఫిలాసఫర్స్ స్టోన్ పూర్తి అయినది. మొదటి ప్రతి (మాన్యుస్క్రిప్టు) ఏజంట్లకు పంపడము జరిగింది. ఆమె ప్రయత్నించిన రెండవ ఏజంటు క్రిష్టోఫర్ లిటిల్, అమెకు సారధ్యము వహించడానికి ఒప్పుకుని బ్లూమ్స్ బెర్రీకు ఆమె ప్రతిని పంపారు. ఎనిమిది మంది ప్రకాశకులు (పబ్లిషర్సు) నిరాకరించిన తరువాత, ఫిలాసఫర్స్ స్టోన్ ముద్రణ కొరకు బ్లూమ్స్ బెర్రీ అడ్వాన్సుగా £3,000 రౌలింగు ఇచ్చింది.[10]

వ్రాస్తున్నప్పుడు ఆమె బుర్రలో పాఠకుల వయోపరిమితి దృష్టిలో లేదని రౌలింగు చెప్పినప్పటికీ, పబ్లిష్ర్స్ మాత్రము 9-11 వయస్సు గల పిల్లలను దృష్టిలో ఉంచుకుని ముద్రించారు.[11]. ముద్రణ సమయము లో, జోఆన్ రౌలింగును ఒక లింగభేదము తెలియని కలము పేరు (జోఆన్ అంటే అమ్మాయి అని అందరికీ తెలుసు మరి) పెట్టుకోమని కోరగా (9-11 సంవత్సరముల బాలురు,ఒక స్త్రీ చేత రచించబడిన పుస్తకాలు చదవరు అనే ఒక అపోహతో ) ఆమె పేరును జోఆన్ రౌలింగు నుండి జె.కె. రౌలింగ్ గా మార్చుకున్నారు.[12]

జూలై 1997 లో మొదటి హ్యారీ పాటర్ పుస్తకము యునైటెడ్ కింగ్డమ్లో బ్లూమ్స్ బెర్రీ ద్వారా ప్రచురించబడింది. ఆ తరువాత జె.కె. రౌలింగ్ కు ఆరు అంకెల (డాలర్లలో లెక్క వేస్తే ఏడు) పారితోషికము ఆందిన తరువాత స్కాలష్టిక్ ప్రెస్, సెప్టెంబరు 1998 లో అమెరికాలో ఈ పుస్తకాన్ని ప్రచురించింది.

ఒక దశాబ్దమ పాటు హ్యారీ పాటర్, మంచి రివ్యూల వలన విజయము సాధించింది. ఇందులో పబ్లిషర్స్ మార్క్టంగు కొంత కాగా, సాధారణ పాఠకుల నోటి మాట ప్రచారము(ముఖ్యముగా యువకులలో) కూడా భాగమే. యువకులు ఇంటర్నెట్, వీడియో గేమ్స్ పై మక్కువ చూపే కాలములో పుస్తక పఠనము పై ఇంటరెస్టు తగ్గింది. పబ్లిషర్స్ మొదటి మూడు పుస్తకాలను వెంట వెంటనే విడుదల చేసి రౌలింగ్ పాఠకులలో ఉత్సాహము తగ్గకొండా చూసుకున్నారు.[13]. ఈ సీరీస్ పిల్లలనే కూడా పెద్దలను కూడా ఆకట్టు కోవడముతో హ్యారీ పాటర్ పుస్తకాలను రెండు ముఖ చిత్రాలతో విడుదల చెయ్యడము జరిగింది.(చిన్న పిల్లల కోసము ఒక రకమైన బొమ్మ,పెద్దల కోసము ఇంకొకటి).[14]. అనేక భాషలలోకి అనువదించబడడము వలన కూడా ఈ సీరీస్ కు పాప్యులారిటీ పెరిగి పోయింది. ఉదాహరణకు ఫ్రాన్స్ లో అత్యంత అమ్మకాలుగల మొట్టమొదట అమ్మబడిన ఇంగ్లీషు పుస్తకముగా Harry Potter and the Order of the Phoenix' ఖ్యాతి గడించింది. [14]

చెరుపు (స్పాయిలర్) హెచ్చరిక: నవల చదవ గోరిన వారు/సినిమా చూద్దామనుకున్న వారు ఈ క్రింది భాగాన్ని చదవ వద్దని మనవి. కథ వివరాలు తెలుపుతూ, ఉత్కంఠ లేకుండా చేసే అవకాశం ఉంది.

కథా వస్తువు(ప్లాట్/Plot) క్లుప్తంగా

[మార్చు]

మామూలుగా రహస్యంగా ఉండే [మంత్ర ప్రపంచము], చాలా సంవత్సరములు లార్డ్ వోల్డమోర్ట్ తో భయపెట్టబడి ఉండి, మొదట సారి జరుపుకునే సంబరాలతో మొదలవుతుంది. ముందు రోజు రాత్రి వోల్డమోర్ట్, దాక్కున్న హ్యారీ పాటర్ స్థావరానీ కనుక్కుని హ్యారీ తల్లిదండ్రులైన లిల్లీ, జేమ్స్ పాటర్ లను సంహరిస్తాడు. ఆ తరువాత వాడు మంత్ర దండమును పసి హ్యారీ పై ప్రయోగించినప్పుడు, చావు మంత్రము తిరగ గొట్ట బడుతుంది. వోల్డమోర్ట్ శరీరము నశించి, ఒక బలహీనమైన ఆత్మగా మారి, ప్రపంచములో ఎవ్వరూ లేని ప్రదేశాలలో శరణు కోరడము మొదలెడతాడు. హ్యారీ నుదిటి మీద వోల్డమోర్ట్ శాపానికి ప్రతిబింబముగా మెరుపు లాంటి చార మటుకు మిగిలిపోతుంది. వోల్డమోర్ట్ ఓటమితో మంత్ర ప్రపంచములో 'బ్రతికిన బాలుడు' గా హ్యారీ పేరు పొందుతాడు.

అనాథ అయిన హ్యారీని క్రూరమైన, మంత్రగాళ్ళు గాని, హ్యారీ మంత్ర శక్తి వారసత్వముతో పరిచయము లేని, హ్యారీ భవిష్యత్తు పై అవగాహన లేని, చుట్టాలు డర్స్లీ కుటుంబముతో పెరుగుతాడు. పదకొండవ పుట్టినరోజు దగ్గర పడేసరికి, హాగ్వార్ట్స్ మంత్ర తంత్రజాల పాఠశాల నుండి హ్యారీకి ఆహ్వానములు వస్తాయి. వాటిని హ్యారీ పిన్ని హ్యారీకి అందకుండా చింపి వేస్తూ ఉంటుంది. పదకొందవ పుట్టిన రోజు మటుకు హాగ్వార్ట్స్ లో ఆటల నిర్వాహకుడైన హాగ్రీడ్, హ్యారీ ఇంటికి వచ్చి, హాగ్వార్ట్స్ కు హాజరు కావలసిందిగా హ్యారీని పిలుస్తాడు. ఒకొక్క పుస్తకము, హ్యారీ హాగ్వార్ట్స్ జీవితము లోని ఒకొక్క సంవత్సరమూ, వాడు అక్కడ మేజిక్ ను వాడడము ఎలా నేర్చుకున్నాడు?, మేజిక్ వస్తువులని ఎలా వాడాడు?, మేజిక్ కషాయాలతో ఏమేమి చేశాడు? అని వివరిస్తుంది. హ్యారీ అక్కడ యుక్త వయస్సుకు చేరుతున్న కొద్దీ మేజిక్ సంబంధించిన,సామాజిక, ఎమోషనల్ ఇబ్బందులను అధిగమించడము నేర్చుకుంటూ ఉంటాడు. వోల్డమోర్ట్ కూడా ఇంతలో బలము సంపాదించుకుంటాడు.

మాయా ప్రపంచము

[మార్చు]
గ్రంధాలపై ఆధారించిన చలన చిత్రాలలో చూపబడిన హాగ్వార్ట్స్ స్కూల్.

హ్యారీ వెళ్ళిన మాయా ప్రపంచము, మామూలు ప్రపంచానికి దూరంగా ఉన్నపటికీ, మన ప్రపంచముతో చాలా దగ్గర సంబంధము కలిగి ఉంటుంది. నార్నియా ప్రపంచములో ప్రత్యేక విశ్వము, లార్డ్ ఆఫ్ ది రింగ్స్లో మిడిల్ ఎర్త్ ఒక గొప్ప గతముగా ఉండగా, హ్యారీ పాటర్ లోని మంత్ర ప్రపంచము మన పక్కన ఉండి, మాంత్రికులు సాధారణమైన పనులు చేస్తూ ఉంటారు. చాలా సంస్థలు, లండన్ వంటి నగరాలు గుర్తింప బడేవిగా ఉంటాయి. విడి విడిగా దాగి ఉన్న వీథులు,ఎవ్వరూ చూడని పురాతన బార్లు, మ్యాజిక్ తెలియని వారికి (మగుల్) కనబడని ఒంటరి భవనాలు,కోటలు ఉంటాయి. మంత్ర శక్తి నేర్చుకునే దాని కన్నా పుట్టుకతో వచ్చేదే ఎక్కువ. హాగ్వార్ట్స్ స్కూల్ కు వెళ్ళడము ఆ విద్యను వశపరుచుకోవడానికి. చాలా మంది మంత్రగాళ్ళకు పుట్టుక తోనే మంత్ర శక్తి ఉంటుంది కనుక వారికి మగుల్ ప్రపంచము ఉందని తెలియదు. (మగుల్ ప్రపంచము కూడా మామూలు ప్రపంచము లాగానే కనపడుతుంది.) అయినా కాని మ్యాజిక్ ప్రపంచము, దానిలోని విచిత్ర వస్తువులు చాలా సాధారణంగా చూపించబడ్డాయి. కథలో ముఖ్య విషయము ఏమిటంటే మ్యజిక్, మామూలు వస్తువులను పక్క పక్కను చూపించడము. కథలలో పత్రలన్ని మ్యజిక్ పరిసరాల్లో సాధారణ జీవితాలు సాధారణ సమస్యలతో గడుపుతారు.

పుస్తకాల వరుస

[మార్చు]
 1. Harry Potter and the Philosopher's Stone (June 26 1997) (titled Harry Potter and the Sorcerer's Stone in the United States)
 2. Harry Potter and the Chamber of Secrets (July 2 1998)
 3. Harry Potter and the Prisoner of Azkaban (September 8 1999)
 4. Harry Potter and the Goblet of Fire (July 8 2000)
 5. Harry Potter and the Order of the Phoenix (June 21 2003)
 6. Harry Potter and the Half-Blood Prince (July 16, 2005)
 7. Harry Potter and the Deathly Hallows (July 21, 2007)

మూలములు

[మార్చు]
 1. The Pottermore News Team (1 February 2018). "500 million Harry Potter books have now been sold worldwide". Pottermore. Archived from the original on 14 March 2018.
 2. "Final 'Potter' launch on July 21". CNN. 2007-02-01. Archived from the original on 2007-02-10. Retrieved 2007-02-12.
 3. https://www.latimes.com/archives/la-xpm-2010-nov-07-la-et-1107-harry-potter-20101107-story.html
 4. https://www.wsj.com/articles/SB10001424052748703567304575628783648960748
 5. Watson, Julie and Kellner, Tomas. "J.K. Rowling And The Billion-Dollar Empire". Forbes.com, 26 February 2004. Accessed 19 March 2006.
 6. "Wizarding World: The Official Home of Harry Potter". www.wizardingworld.com (in ఇంగ్లీష్). Retrieved 2021-06-27.
 7. Rowling, J.K. "Biography". JKRowling.com. Archived from the original on 2008-12-17. Retrieved 2006-05-21.
 8. "J.K. Rowling interview transcript, The Connection". Quick Quote Quill. October 12, 1999.
 9. "Barnes & Noble.com". Archived from the original on 2007-03-11. Retrieved 2007-02-24.
 10. Lawless, John. "Nigel Newton". BusinessWeek Online. Retrieved 2006-09-09.
 11. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2007-12-24. Retrieved 2007-02-24.
 12. Savill, Richard. "Harry Potter and the mystery of J K's lost initial". The Daily Telegraph. Archived from the original on 2006-09-07. Retrieved 2006-09-09.
 13. "Books' Hero Wins Young Minds". New York Times. Jul 12, 1999.
 14. 14.0 14.1 "OOTP is best seller in France - in English!". BBC. July 1, 2003.

అధికారిక వెబ్ సైటులు

[మార్చు]