చీము పుండు
చీము పుండు | |
---|---|
ఇతర పేర్లు | ఆబ్సెస్ |
సహజంగా ద్రవం బయటకు పోయిన పుండు | |
ప్రత్యేకత | చర్మ వ్యాధులు |
లక్షణాలు | ఎరుపుతో కూడిన వాపు, నొప్పి |
సంక్లిష్టతలు | బాక్టీరియా సంక్రమణం |
సాధారణ ప్రారంభం | ఎపుడైనా |
రకాలు | రాచ పుండు |
కారణాలు | బాక్టీరియా సంక్రమణం |
ప్రమాద కారకములు | సిరల లోనికి మందు వినియోగం |
రోగనిర్ధారణ పద్ధతి | అల్ట్రాసౌండ్, సి.టి.స్కాన్ |
నివారణ | పుండుని గాజుబట్టతో మూయడం |
చికిత్స | కోత,సూక్ష్మజీవ నాశకాలు, ద్రవం బయటకు తీయడం |
చీము పుండు అంటే శరీరంలోని కణజాలంలో కొంచెం కొంచెంగా ఒకదగ్గరగా ఏర్పడిన చీము సమాహారం. ఇవి గడ్డలుగా రూపొందుతాయి. వీటిని ఆంగ్లం లో సాధారణంగా యాబ్స్ స్ (abscess) అంటారు. ఈ పుండ్ల లక్షణాలు ఏమంటే ఎరుపుగా ఉండి, నొప్పి, వెచ్చదనం, వాపు. ఈ గెడ్డని నొక్కినప్పుడు వాపు ద్రవంతో నిండినట్లు అనిపించవచ్చు.[1] ఎరుపు ప్రాంతం తరచుగా వాపుకు మించి విస్తరించి ఉంటుంది. [2] చీము పుండ్లు లో రాచ పుండ్లు (Carbuncle - కార్బంకిల్ ), గెడ్డలు అనేవి రకాలు. ఇవి తరచుగా వెంట్రుకల కుదుళ్లను కలిగి ఉంటాయి. రాచ పుండ్లు పెద్దవిగా ఉంటాయి.[3] తిత్తి (cyst) అనేది చీముకు సంబంధించినదే, కానీ అది చీము కాకుండా వేరే పదార్థాన్ని కలిగి ఉండవచ్చు. తిత్తికి స్పష్టంమైన గోడ ఉంటుంది.
సంకేతాలు, లక్షణాలు
[మార్చు]ఈ చీము పుండ్లు ఏ రకమైన కణజాలంలోనైనా సంభవించవచ్చు, కానీ తరచుగా చర్మం ఉపరితలం లోపల (అవి గడ్డలు లేదా లోతైన చర్మపు గడ్డలు కావచ్చు), ఊపిరితిత్తులు, మెదడు, దంతాలు, మూత్రపిండాలు, టాన్సిల్స్‌లో కూడా సంభవిస్తాయి. ప్రధాన సమస్యలలో చీము పదార్థం ప్రక్కనే ఉన్న లేదా దూరంగా ఉన్న కణజాలాలకు వ్యాప్తి చెందడం, విస్తృతమైన ప్రాంత కణజాలం కుళ్లిపోవడం (గ్యాంగ్రీన్) వంటివి ఉండవచ్చు.[4]
చీము పుండ్లను చర్మపు పుండ్లు లేదా అంతర్గత గడ్డలుగా వర్గీకరించవచ్చు. చర్మపు కురుపులు సాధారణంగా పైకి కనపడుతాయి; చర్మపు చీములను చర్మసంబంధమైన లేదా సబ్కటానియస్ అబ్సెసెస్ అని కూడా అంటారు.[5] అంతర్గత పుండ్ల గుర్తించడం, రోగనిర్ధారణ కష్టం, మరింత తీవ్రమైనవి.[6] కానీ ప్రభావిత ప్రాంతంలో నొప్పి, అధిక ఉష్ణోగ్రత, ఎక్కువ జ్వరము, చలి ఉండవచ్చు. సాధారణంగా అనారోగ్యంగా అనిపిస్తుంది. ఈ అంతర్గత గడ్డలు చాలా అరుదుగా తమను తాము నయం చేసుకుంటాయి, కాబట్టి అటువంటి చీము ఉన్న అనుమానించిన వెంటనే వైద్య సహకారం తీసుకోవాలనే సూచిస్తారు. చీము ఉన్న ప్రదేశం బట్టి ప్రాణాంతకం కావచ్చు.[7][8] డిస్క్ హెర్నియేషన్, వెన్నెముక అంటారు. కానీ నిరూపించబడలేదు. వెన్నెముక అడుగు పొరలలో (సబ్‌డ్యూరల్) ఏర్పడిన చీములలో, మెథిసిలిన్-సెన్సిటివ్ స్టెఫిలోకాకస్ ఆరియస్ అత్యంత సాధారణ జీవి.[9]
అవి సాధారణంగా వ్యాధికారక బాక్టీరియా సంక్రమణం (ఇన్ఫెక్షన్) వల్ల కలుగుతాయి. [10] తరచుగా ఒక సంక్రమణంలో అనేక రకాల బ్యాక్టీరియా క్రిములు కూడా ఉండవచ్చు. [2] ప్రపంచంలోని అనేక ప్రాంతాలలో, అత్యంత సాధారణంగా మెథిసిలిన్-రెసిస్టెంట్ స్టెఫిలోకాకస్ ఆరియస్ బ్యాక్టీరియా సంక్రమణం కలుగచేస్తుంది.[1] అరుదుగా, పరాన్నజీవులు కూడా చీము పుండ్లను కలిగిస్తాయి; అభివృద్ధి చెందుతున్న దేశాలలో ఇది సర్వసాధారణం. [11]
రోగనిర్ధారణ
[మార్చు]చర్మపు చీము పుండ్ల రోగనిర్ధారణ సాధారణంగా అది చర్మం మీద ఎలా కనపడుతుంది, కోసుకుపోయింది అనే దాని ఆధారంగా చేస్తారు, పుండు తెరచి నిర్ధారిస్తారు. రోగ నిర్ధారణ స్పష్టంగా లేని సందర్భాలలో అల్ట్రాసౌండ్ ఇమేజింగ్ ఉపయోగపడుతుంది.[1] పాయువు చుట్టూ ఉన్న గడ్డలలో, లోతైన సంక్రమణం అంచనావేయడం కోసం కంప్యూటర్ టోమోగ్రఫీ (CT) స్కాను ముఖ్యమైనది. [11]
చికిత్స
[మార్చు]చాలావరకు చర్మంలో లేదా మృదు కణజాలంలో ఏర్పడ్డ గడ్డలకు సాధారణ చికిత్స దానిని తెరిచి ద్రవం బయటకు పోవువిధంగా కత్తిరించడం జరుగుతుంది. [12] సూక్ష్మజీవి నాశకాలు (యాంటీబయాటిక్స్) ఉపయోగించడం వల్ల కూడా కొంత ప్రయోజనం ఉన్నట్లు తెలుస్తోంది. [1] ద్రవం బయటకు తీసిన తర్వాత గాజుగుడ్డతో ఈ కుహరాన్ని మూయకూడదని ఆధారాలు తెలియ చేస్తున్నాయి. ఈ కుహరాన్ని వెంటనే మూసివేయడం వల్ల చీము తిరిగి వచ్చే ప్రమాదం పెరగకుండా త్వరగా నయమవుతుంది.[13] సూదితో చీమును లాగడం సాధారణంగా సరిపోదు. [1]
వ్యాప్తి
[మార్చు]చర్మం మీద చీము పుండు (స్కిన్ అబ్సెస్) సాధారణం ఇటీవలి కాలంలో సర్వసాధారణంగా మారింది.[1] సిరలలోనికి మందులు (ఇంట్రావీనస్ డ్రగ్) వాడకం వినియోగదారులలో 65% పైన ఉన్నట్లు నివేదికలు తెలియ చేస్తున్నాయి. ఇది ప్రమాద కారకాలు గా పరిగణిస్తారు.[14] ఈ చీము పుండ్లు వలన 2005లో, 3.2 మిలియన్ల మంది ప్రజలు అమెరికాలో వైద్య శాలలో అత్యవసర విభాగాలకు వెళ్లారు. [15] ఆస్ట్రేలియాలో, 2008లో దాదాపు 13,000 మంది ఈ పరిస్థితితో ఆసుపత్రి పాలయ్యారు. [16]
మందులు
[మార్చు]మూలాలు
[మార్చు]- ↑ 1.0 1.1 1.2 1.3 1.4 1.5 Singer AJ, Talan DA (March 2014). "Management of skin abscesses in the era of methicillin-resistant Staphylococcus aureus" (PDF). The New England Journal of Medicine. 370 (11): 1039–1047. doi:10.1056/NEJMra1212788. PMID 24620867. Archived from the original (PDF) on 2014-10-30. Retrieved 2014-09-24.
- ↑ 2.0 2.1 Elston DM (2009). Infectious Diseases of the Skin. London: Manson Pub. p. 12. ISBN 978-1-84076-514-4. Archived from the original on 2017-09-06.
- ↑ Marx JA (2014). "Dermatologic Presentations". Rosen's emergency medicine : concepts and clinical practice (8th ed.). Philadelphia, PA: Elsevier/Saunders. pp. Chapter 120. ISBN 978-1-900151-96-2.
- ↑ "Skin abscess: MedlinePlus Medical Encyclopedia". medlineplus.gov (in ఇంగ్లీష్). Retrieved 2023-07-19.
- ↑ "Abscess". Medline Plus. Archived from the original on 2016-04-07.
- ↑ "Abscess". United Kingdom National Health Service. Archived from the original on 2014-10-30.
- ↑ Ferri FF (2014). Ferri's Clinical Advisor 2015 E-Book: 5 Books in 1 (in ఇంగ్లీష్). Elsevier Health Sciences. p. 20. ISBN 978-0-323-08430-7.
- ↑ Fischer JE, Bland KI, Callery MP (2006). Mastery of Surgery (in ఇంగ్లీష్). Lippincott Williams & Wilkins. p. 1033. ISBN 978-0-7817-7165-8.
- ↑ Kraeutler MJ, Bozzay JD, Walker MP, John K (January 2015). "Spinal subdural abscess following epidural steroid injection". Journal of Neurosurgery. Spine. 22 (1): 90–93. doi:10.3171/2014.9.SPINE14159. PMID 25343407.
- ↑ Cox C, Turkington JS, Birck D (2007). The encyclopedia of skin and skin disorders (3rd ed.). New York, NY: Facts on File. p. 1. ISBN 978-0-8160-7509-6. Archived from the original on 2017-09-06.
- ↑ 11.0 11.1 Marx JA (2014). "Skin and Soft Tissue Infections". Rosen's emergency medicine : concepts and clinical practice (8th ed.). Philadelphia, PA: Elsevier/Saunders. pp. Chapter 137. ISBN 978-1-4557-0605-1.
- ↑ American College of Emergency Physicians, "Five Things Physicians and Patients Should Question", Choosing Wisely: an initiative of the ABIM Foundation, American College of Emergency Physicians, archived from the original on March 7, 2014, retrieved January 24, 2014
- ↑ Singer AJ, Thode HC, Chale S, Taira BR, Lee C (May 2011). "Primary closure of cutaneous abscesses: a systematic review" (PDF). The American Journal of Emergency Medicine. 29 (4): 361–366. doi:10.1016/j.ajem.2009.10.004. PMID 20825801. Archived from the original (PDF) on 2015-07-22.
- ↑ Ruiz P, Strain EC, Langrod J (2007). The substance abuse handbook. Philadelphia: Wolters Kluwer Health/Lippincott Williams & Wilkins. p. 373. ISBN 978-0-7817-6045-4. Archived from the original on 2017-09-06.
- ↑ Taira BR, Singer AJ, Thode HC, Lee CC (March 2009). "National epidemiology of cutaneous abscesses: 1996 to 2005". The American Journal of Emergency Medicine. 27 (3): 289–292. doi:10.1016/j.ajem.2008.02.027. PMID 19328372.
- ↑ Vaska VL, Nimmo GR, Jones M, Grimwood K, Paterson DL (January 2012). "Increases in Australian cutaneous abscess hospitalisations: 1999-2008". European Journal of Clinical Microbiology & Infectious Diseases. 31 (1): 93–96. doi:10.1007/s10096-011-1281-3. PMID 21553298. S2CID 20376537.