Jump to content

చుట్ట పంపు

వికీపీడియా నుండి
చుట్ట పంపు నమూనా

చుట్ట పంపు అనగా తక్కువ లిఫ్ట్ పంపు, ఇది రింగులు, రింగులుగా చుట్టబడిన పైపుతో చక్రం వలె ఉంటుంది. దీనిని ఆంగ్లంలో స్పైరల్ పంప్ అంటారు. ఈ చుట్ట పంపు చక్రం వలె తిరుగుతున్నపుడు మొదలు నీటిలో మునుగుతూ కొంత నీటిని తీసుకొని పై వైపుకి చేరినపుడు ఆ నీరు మరొక రింగులోకి చేరుతుంది, ఈ విధంగా చుట్ట పంపు తిరుగుతున్నపుడు మొదలు నుంచి మరొక రింగ్ లోకి, ఆ రింగ్ లో నుంచి మరొక రింగ్ లోకి అలా అలా అన్ని రింగ్ లలోకి నీరు చేరుతూ చుట్ట పంపు మధ్యగా నున్న పైపు చివరి నుంచి నీరు బయటికి వస్తుంది. ఈ స్పైరల్ పంపు ప్రవేశద్వారం నీటిని తీసుకునేందుకు ఆ నీటిని మధ్య నున్న బాహ్య కుహరం ద్వారా పై భాగానున్న నీటి సరఫరా గొట్టానికి అందించేందుకు ఈ పంపు మధ్య భాగం నీటివనరుకు ఎత్తుగా ఉండేటట్లు ప్రవేశ కుహరంలో నీరు చేరేందుకు కొంత భాగం నీటివనరులో మునిగేట్లు నిలువుచక్రంగా బిగించబడివుంటుంది[1].

ఈ పంపు సామర్థ్యం ముఖ్యంగా ఇది తిరిగే వేగంపై అధారపడి ఉంటుంది, ఈ పంపు సమర్ధవంతంగా పని చేసేందుకు విద్యుత్ యంత్రశక్తిని లేదా జంతుశక్తిని ఉపయోగిస్తారు.

సాధారణంగా నీటిపారుదల ప్రయోజనాల కోసం అనేక "తక్కువ లిఫ్ట్ పంపు"ల వలె ఈ చుట్ట పంపును ఉపయోగిస్తున్నారు.

ప్రయోజనాలు

[మార్చు]

చుట్ట పంపు ఆర్కిమెడెస్ స్క్రూకు ప్రత్యామ్నాయంగా నిర్మించబడింది. ఆర్కిమెడెస్ స్క్రూ వలె కాక దీనిని సమంగా నడిపించవచ్చు, ఆర్కిమెడెన్ స్క్రూ అయితే 30° వంగి ఉంటుంది. సరైన రొటేటింగ్ సీల్ బిగించి ఉన్న చుట్ట పంపు, ఎక్కువ ఎత్తుకు నీటిని సరఫరా చేయగలదు, సాధారణంగా 5 నుంచి 10 మీటర్ల పైకి నీటిని పంపించగలదు. ఇతర సూత్రాలతో నడుపబడుతున్న కొత్త పంపులు ఉద్భవిస్తున్నప్పటికి, కొన్ని ఇతర ప్రయోజనాల దృష్ట్యా ఒక ముఖ్యమైన సాధనంగా చుట్ట పంపు మిగిలిపోయింది, దీనిని నిర్మించడం, మరమ్మతు చేయడం సులభం, అంతేకాక దీనికి అయ్యే ఖర్చు చాలా తక్కువ. ఈ పంపు నిర్మించేందుకు అవసరమైన అన్ని భాగాలు మెటల్ గా స్థానిక వనరుల నుండే లభించగలదు. దీని రూపం సులభంగా చెయ్యవచ్చు[2].[3]

ప్రతికూలతలు

[మార్చు]

ముందు చెప్పినట్లుగా, ఈ పంపు కేవలం చిన్న ఎత్తు మీదకే నీటిని పంపించగలదు. డ్రైనేజీ, సాగునీటిపారుదల వ్యవస్థలలో వచ్చిన అనేక ఇతర పంపింగ్ అనువర్తనాల వలన లేదా నీరు ఎక్కువ లోతు నుండి తోడవలసిన పరిస్థితుల వలన ఈ పంపులు తగినవిగా లేవు.

మూలాలు

[మార్చు]
  1. Water Lifting Devices - National Resources Management and Environment: 3.6.4 Coil and Spiral Pumps - Retrieved December 23, 2012 Spiral pump
  2. The Spiral Pump - A High Lift, Slow Turning Pump - Peter Tailer - First Distributed 1986, Retrieved December 23, 2012 [1] Archived 2014-04-09 at the Wayback Machine
  3. "PDF: Spiral Pumps - How to Make (2008) - Retrieved December 23, 2012" (PDF). Archived from the original (PDF) on 2013-12-20. Retrieved 2014-04-03.

ఇవి కూడా చూడండి

[మార్చు]