చెంచా

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఒక త్రుప్పురహిత ఉక్కు చారు చెంచా

చెంచా (ఆంగ్లం Spoon) ఒక చిన్న గరిటె. ఆంగ్లంలో చెంచా, గరిట రెండింటినీ స్పూను అని పిలుస్తారు. తెలుగువారు పెద్ద స్పూనును గరిట అంటారు. వీటిని సాధారణంగా వంట గదిలో వివిధ పనులకు, భోజనం చేయు సమయంలో తినడానికి ఉపయోగిస్తారు. కొంతమంది చెంచాను ఫోర్క్ ను కలిపి రెండు చేతులతో ఉపయోగిస్తారు.

చెంచా ఒక హేండిల్ కలిగి దాని చివరలో ఒక బోలు గిన్నె అమర్చబడి ఉంటుంది. ఈ గిన్నె అర్థ గోళాకృతి కానీ, అర్థ దీర్ఘ గోళాకృతి కానీ కలిగి ఉంటుంది. ఈ చెంచాను ఆహారాన్ని తీసుకొని నోటిలోకి చేర్చడానికి ఉపయోగిస్తారు. దీనిని పదార్థాలు కొలవడానికి, కలపడానికి, కదిలించడానికి, వివిధ పదార్థాలను కలపడానికి ఉపయోగిస్తారు. ఆహార పదార్థాల తయారీలో అందులో కలిపే వివిధ పదార్థాలను కలపడానికి ఉపయోగిస్తారు. ఈ చెంచాలను ముఖ్యంగా స్టెయిన్‌లెస్ స్టీలుతో తయారుచేస్తారు. ప్రస్తుతం చెక్క, పింగాణీ, పార్శలీన్, ప్లాస్టిక్ తో తయారుచేయబడే చెంచాలు కూడా లబ్యమవుతున్నాయి. ఈ చెంచాలను వివిధ రకాల పదార్థాలతో విభిన్న సంస్కృతులు గల ప్రజలు వివిధ రకాలలో అనేక సందర్భాలలో ఉపయోగిస్తున్నారు.

చరిత్ర[మార్చు]

పురాతన ఈజిప్షియన్లు ఉపయోగించే వివిధ రకాల చెంచాలలో దంతాలు, చెకుముకి రాయి, రాతి, చెక్క తో కూడినవి ఉన్నట్లు తెలుస్తుంది; వాటిలో చాలా చెంచాలు మతపరమైన చిహ్నాలతో చెక్కబడ్డాయి[1]. సార్డినియాలో నియోలిథిక్ ఓజియరీ నాగరికత సమయంలో సిరామిక్ లేడిల్స్, స్పూన్లు అప్పటికే వాడుకలో ఉన్నాయి. చైనాలోని షాంగ్ రాజవంశం ఎముకతో తయారు చేయబడిన చెంచాలను ఉపయోగించారు. చైనాలో ప్రారంభ కాంస్య చెంచాలు పదునైన మొనతో రూపొందించబడ్డాయి. వాటిని కత్తిపీటగా కూడా ఉపయోగించారు[2]. గ్రీకులు, రోమన్ల చెంచాలు ప్రధానంగా కాంస్య, వెండితో తయారు చేయబడ్డాయి. వాటి హ్యాండిల్ సాధారణంగా వాడిగా ఉన్న కాడ రూపంలో ఉంటుంది[1]. గిన్నెతో కలిగిన హ్యాండిల్‌ ఉన్న చెంచాల వివిధ రకాల రూపాలు బ్రిటీష్ మ్యూజియంలో అనేకం ఉన్నాయి.[1]

ప్రారంభ ముస్లిం ప్రపంచంలో సూప్ తినడానికి చెంచాలను ఉపయోగించారు.[3] దేశీయ ఉపయోగం కోసం మధ్యయుగ కాలంలోని చెంచాలు సాధారణంగా ఆవు కొమ్ము లేదా కలపతో తయారయ్యాయి. కాని ఇత్తడి, సత్తు (లోహం), లాట్టెన్ (ఒక రకమైన ఇత్తడి) చెంచాలు 15 వ శతాబ్దంలో సాధారణమైనవిగా కనిపిస్తాయి[4]. రాజ గృహాలలో, ఇతర గృహాల జాబితాలో వెండి చెంచాలకు సంబంధించిన పూర్తి వివరణలు ఉన్నాయి[4]. వాటిని వివిధ ముఖ్యమైన రోజులలో ఉపయోగిస్తారు. ఈ చెంచాల గురించి మొట్టమొదటి ఆంగ్ల మూలం 1259 లో ఉన్నట్లు కనిపిస్తుంది[4]. 1300 సంవత్సరానికి ఎడ్వర్డ్ I బీరువాలలో పారిస్ గుర్తు అయిన ఫ్లూర్-డి-లిస్‌ (లిల్లీ పుష్ప గుర్తు) తో గుర్తించబడిన కొన్ని బంగారు, వెండి చెంచాలు ప్రస్తావించబడ్డాయి[4]. అత్యంత ఆసక్తికరమైన మధ్యయుగ స్పూన్లలో ఒకటి ఆంగ్లేయుల అభిషేకంలో, తరువాత బ్రిటిష్ సార్వభౌమత్వానికి ఉపయోగించే పట్టాభిషేకం చెంచా; ఈ 12 వ శతాబ్దపు వస్తువు బ్రిటిష్ రాయల్ రెగాలియాలో మిగిలి ఉన్న పురాతన వస్తువు[4].

చెంచాలు రకాలు[మార్చు]

ఈ చెంచాలు అనేక రకాలు అనేక నామాలతో ఉన్నాయి. ఉదాహరణకు

  1. బల్ల చెంచా (టేబుల్ స్పూన్) : ఆహార పదార్థాల సాధారణ వడ్డన ఉపయోగం కొరకు బల్లపై వుంచే పెద్ద సైజు చెంచా.
  2. టీ చెంచా (టీ స్పూన్) : టీపొడిని కాఫీ పొడిని తీయుటకు ఉపయోగించే ఓ చిన్న సైజు చెంచా.
  3. ఉప్పు చెంచా (సాల్ట్ స్పూన్) : ఉప్పును వాడుటకు ఉపయోగించే చెంచా.
  4. చారు చెంచా (సూప్ స్పూన్) : చారును తీయుటకు ఉపయోగించే చెంచా.'

మూలాలు[మార్చు]

  1. 1.0 1.1 1.2 "Spoon." Encyclopædia Britannica Eleventh Edition, 1911. Viewing the linked scan requires the AlternaTiff plugin in most browsers. This article incorporates text from this source, which is now in the public domain.
  2. Joseph Needham (2000). Science and Civilisation in China: Fermentations and Food Science. Cambridge University Press. p. 106. ISBN 978-0-521-65270-4.
  3. Lindsay, James E. (2005). Daily Life in the Medieval Islamic World. Greenwood Publishing Group. p. 128. ISBN 0-313-32270-8.
  4. 4.0 4.1 4.2 4.3 4.4 "Spoon." Encyclopædia Britannica Eleventh Edition, 1911. Viewing the linked scan requires the AlternaTiff plugin in most browsers. This article incorporates text from this source, which is now in the public domain.

బాహ్య లంకెలు[మార్చు]

వికీవ్యాఖ్యలో ఈ విషయానికి సంబంధించిన వ్యాఖ్యలు చూడండి.
"https://te.wikipedia.org/w/index.php?title=చెంచా&oldid=4088915" నుండి వెలికితీశారు