చెంబు చిన సత్యం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చెంబు చిన సత్యం
చెంబు చిన సత్యం సినిమా పోస్టర్
దర్శకత్వంరవీంద్రసూరి నామాల
రచనరవీంద్రసూరి నామాల
నిర్మాతఆలూరి సాంబశివరావు
తారాగణంసుమన్ శెట్టి, ప్రమోదిని, శరశ్చంద్ర, ఈషా, వాసు ఇంటూరి
ఛాయాగ్రహణంతోట వి రమణ
కూర్పువెంకట్
సంగీతంవిజయ్ కురాకుల
నిర్మాణ
సంస్థ
ఆలూరి క్రియేషన్స్
విడుదల తేదీ
2015, సెప్టెంబరు 25
సినిమా నిడివి
145 నిముషాలు
దేశంభారత దేశం
భాషతెలుగు

చెంబు చిన సత్యం, 2015 సెప్టెంబరు 25న విడుదలైన తెలుగు సినిమా.[1][2] ఆలూరి క్రియేషన్స్ బ్యానరులో ఆలూరి సాంబశివరావు నిర్మించిన ఈ సినిమాకి రవీంద్రసూరి నామాల దర్శకత్వం వహించాడు. ఇందులో సుమన్ శెట్టి, ప్రమోదిని, శరశ్చంద్ర, ఈషా, వాసు ఇంటూరి తదితరులు నటించగా, విజయ్ కురాకుల సంగీతం అందించాడు.[3][4]

కథా నేపథ్యం

[మార్చు]

ఎల్.ఐ.సీ ఏజెంట్‌గా పనిచేస్తున్న మధ్య తరగతి వ్యక్తి చెంబు చిన సత్యం (సుమన్ శెట్టి) ఎప్పటికైనా ఓ పెద్ద ఇల్లు కొనాలని లక్ష్యంగా పెట్టుకుంటాడు. అయితే, చిన సత్యంకు నిద్రలో ఏ కల వచ్చినా అది నిజమవుతుంటుంది. అప్పటికే కొన్ని కలలు రావడంతో ఇబ్బందులు పడ్డుతున్న సత్యం, ఎలాంటి చెడు కల వచ్చినా అది నిజమవుతుందేమో అన్న భయంతో బతుకుతుంటాడు.

తన కళ్ళ ముందే కుటుంబ సభ్యులంతా చనిపోయినట్లు చిన సత్యంకు కల వస్తుంది. అది నిజమవుతుందేమో అన్న భయంలో తన వాళ్ళందరినీ జాగ్రత్తగా కాపాడుకుంటూ ఉంటాడు. ఆ సమయంలో, తన కలకు సంబంధించిన నిజం ఒకటి తెలుసుకుంటాడు. ఆ నిజం ఏంటి, సత్యం కుటుంబ సభ్యులకు ఇబ్బందులు ఎదురయ్యాయా? అన్నది మిగతా కథ.[5]

నటవర్గం

[మార్చు]
 • సుమన్ శెట్టి
 • ప్రమోదిని
 • శరశ్చంద్ర
 • ఈషా
 • వాసు ఇంటూరి
 • ఆలూరి సాంబశివరావు
 • సూర్య (పిమ్ పమ్)
 • విజయభాస్కర్
 • భీమ
 • బేబీ సాయి సాహస్ర తేజస్వి
 • మాస్టర్ ఆద్య శ్రీ మహేష్

పాటలు

[మార్చు]

ఈ సినిమాకు విజయ్ కురాకుల సంగీతం అందించగా, మౌనశ్రీ మల్లిక్ పాటలు రాశాడు.[6][7]

 1. ప్రేమ విరివాన - దీపు, లిప్సిక
 2. ఎలా సత్యం - పి. చక్రధర్
 3. కల కల కల - పి. చక్రధర్, సిద్ధార్థ్
 4. చెంబు చిన సత్యం - పి. చక్రధర్

మూలాలు

[మార్చు]
 1. Times of India, Movies (25 September 2015). "Chembu Chinna Satyam Movie: Showtimes, Review". Archived from the original on 16 July 2021. Retrieved 16 July 2021.
 2. "Chembu Chinna Sathyam 2015 Telugu Movie". MovieGQ (in ఇంగ్లీష్). Retrieved 16 July 2021.{{cite web}}: CS1 maint: url-status (link)
 3. "Chembu Chinna Satyam Preview". FilmiBeat (in ఇంగ్లీష్). Retrieved 16 July 2021.{{cite web}}: CS1 maint: url-status (link)
 4. "Chembu Chinna Satyam is a diabolical thrilling experience (2015) - Rating, Cast & Crew With Synopsis". nettv4u (in ఇంగ్లీష్). Retrieved 16 July 2021.
 5. "Chembu Chinna Satyam Telugu Movie Review". www.123telugu.com (in అమెరికన్ ఇంగ్లీష్). 2015-09-26. Retrieved 16 July 2021.{{cite web}}: CS1 maint: url-status (link)
 6. "Chembu Chinna Satyam Songs Download". Naa Songs (in అమెరికన్ ఇంగ్లీష్). 2015-08-08. Retrieved 16 July 2021.
 7. "Chembu Chinna Sathyam 2015 Telugu Movie Songs". MovieGQ (in ఇంగ్లీష్). Retrieved 16 July 2021.{{cite web}}: CS1 maint: url-status (link)