రవీంద్రసూరి నామాల

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
రవీంద్రసూరి నామాల
జననంసెప్టెంబరు 24
వృత్తికవి, రచయిత, నటుడు, సినిమా దర్శకుడు.
జీవిత భాగస్వామిరాణి ఐశ్వర్య
పిల్లలుఅక్షర్ పవన్, ఆద్య శ్రీ మహేష్

రవీంద్రసూరి నామాల తెలంగాణ రాష్ట్రానికి చెందిన కవి, రచయిత, నటుడు, సినిమా దర్శకుడు.[1] 2015 లో చెంబు చిన సత్యం (ఎల్.ఐ.సి. ఏజెంట్) సినిమాకి దర్శకత్వం వహించి, తెలుగు సినిమారంగంలోకి అడుగుపెట్టాడు.[2] [3]

జననం[మార్చు]

రవీంద్రసూరి సెప్టెంబర్ 24న చినసాయిలు, వెంకటమ్మ దంపతులకు తెలంగాణ రాష్ట్రం, సూర్యాపేట జిల్లా, నూతనకల్ మండలంలోని చిల్పకుంట్ల గ్రామంలో జన్మించాడు.

విద్యాభ్యాసం[మార్చు]

ప్రాథమిక విద్యను చిల్పకుంట్లలో, నూతనకల్ లోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఉన్నత విద్యను పూర్తిచేసిన రవీంద్రసూరి, మాధ్యమిక విద్యను సూర్యాపేటలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో, శ్రీ వెంకటేశ్వర డిగ్రీ కళాశాలలో బి.ఏ. (ఆంగ్ల సాహిత్యం) చదివాడు. ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి ఎం.ఏ (తెలుగు), బి.సి.జె. అటుతరువాత తెలుగు విశ్వవిద్యాలయం లో జానపద కళల శాఖలో ఎం.ఫిల్ చదివాడు.

వివాహం[మార్చు]

ఈయనకు రాణి ఐశ్వర్య తో వివాహం జరిగింది. వీరికి ఇద్దరు కుమారులు (అక్షర్ పవన్, ఆద్య శ్రీ మహేష్)

రచనలు[మార్చు]

టీవీ రంగం[మార్చు]

  • సి.ఐ.డి విశ్వనాథ్ (టీవీ5 ధారావాహిక) కు కథ, మాటలు అందించాడు
  • క్రిమినల్ స్టోరీస్ (ఎన్.టీవీ నేర కార్యక్రమం) 100 భాగాలకు రచయితగా చేశాడు
  • నువ్వొస్తావని (మాటీవీ ధారావాహిక) కు మాటలు అందించాడు
  • టేక్ ఇట్ ఈజీ (విస్సా టీవీ హాస్య కార్యక్రమం) కు కథ,[మాటలు అందించాడు

చలనచిత్ర రంగం[మార్చు]

  1. దర్శకుడిగా: చెంబు చిన సత్యం (ఎల్.ఐ.సి. ఏజెంట్) (రచన, దర్శకత్వం)
  2. రచయితగా: చెంబు చిన సత్యం (ఎల్.ఐ.సి. ఏజెంట్), జయహే (2010)
  3. సంభాషణలు: మై నేమ్ ఈజ్ అమృత" (2010), తొలిపాట

నటుడిగా[మార్చు]

  • జయహే (చలన చిత్రం),
  • సిక్త్ సెన్స్ (లఘు చిత్రం),
  • నువ్వొస్తావని (ధారావాహిక) లలో నటించాడు.

అవార్డులు - పురస్కారాలు[మార్చు]

  1. తొలి ఉత్తమ దర్శకుడు (కలర్స్ అవార్డు)
  2. తేజ కళా పురస్కారం-2015
  3. ఉత్తమ మాటల రచయిత (ముద్ద మందారం సీరియల్, జి.వి.ఆర్ ఆరాధన కల్చరల్ ఫౌండేషన్ అవార్డు, 28 డిసెంబరు 2019)

చిత్రమాలిక[మార్చు]

మూలాలు[మార్చు]

  1. తెలుగు ఫిల్మీబీట్. "నామాల రవీంద్రసూరి". telugu.filmibeat.com. Retrieved 14 March 2017.
  2. 10టీవీ. "'చెంబు చిన సత్యం' ఆడియో రిలీజ్..." Retrieved 14 March 2017.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)[permanent dead link]
  3. తెలుగు ఎన్ ఈర్ ఐస్. "25న 'చెంబు చినసత్యం'". www.telugunris.com. Retrieved 14 March 2017.[permanent dead link]