చెల్సియా ఎలిజబెత్ ఇస్లాన్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చెల్సియా ఇస్లాన్
2019లో చెల్సియా ఇస్లాన్
జననం
చెల్సియా ఎలిజబెత్ ఇస్లాన్

(1995-06-02) 1995 జూన్ 2 (వయసు 29)
క్వీన్స్, న్యూయార్క్ సిటీ, అమెరికా[1]
వృత్తి
  • నటి
  • మోడల్
క్రియాశీల సంవత్సరాలు2005–ప్రస్తుతం
ఎత్తు167 cమీ. (5 అ. 6 అం.)
జీవిత భాగస్వామి
రాబ్ క్లింటన్ కర్డినల్
(m. 2022)
తల్లిదండ్రులుసమంత బార్బరా (తల్లి)
బంధువులురాబర్ట్ జోపీ కర్డినల్ (మామగారు)

చెల్సియా ఎలిజబెత్‌ ఇస్లాన్‌ (ఆంగ్లం: Chelsea Elizabeth Islan; జననం 1995 జూన్ 2) అమెరికాలో జన్మించిన ఇండోనేషియా నటి. ఆమె డి బాలిక్ 98 (2015), రూడీ హబీబీ (2016) చిత్రాలకు ఉత్తమ నటి విభాగంలో వరుసగా రెండు సిట్రా అవార్డు ప్రతిపాదనలను అందుకుంది.

2014 నుండి 2017 వరకు సోఫియా లట్జుబా, దేవా మహేన్రా, ద్వి సాసోనోలతో కలిసి ఆమె నటించిన ప్రముఖ సిట్‌కామ్ టెటాంగా మాసా గిటులో ఆమె పాత్రకు ప్రసిద్ధి చెందింది. ఆమె 2015 నుండి 2018 వరకు, ఆమె నటిగా నాలుగు వరుస ఇండోనేషియన్ ఛాయిస్ అవార్డులను గెలుచుకుంది.

ప్రారంభ జీవితం

[మార్చు]

చెల్సియా ఇస్లాన్ న్యూయార్క్ నగరంలోని క్వీన్స్‌లో జన్మించింది. ఆమె తల్లి ఇండోనేషియన్ కాగా, తండ్రి అమెరికన్. ఆమె కుటుంబంలో ఏకైక సంతానం. ఆమె ఇండోనేషియాలోని జకార్తాలో ప్రాథమిక పాఠశాల విద్య, మెంటరీ ఇంటర్ కల్చరల్ స్కూల్‌ నుంచి ఉన్నత పాఠశాల విద్య పూర్తిచేసింది.[2] ప్రాథమిక విద్యార్థిగా, ఆమె వన్స్ ఆన్ దిస్ ఐలాండ్ రంగస్థల నాటకంలో నటించింది.

కెరీర్

[మార్చు]

యాక్షన్ చిత్రం స్ట్రీట్ సొసైటీ, జీవితచరిత్ర చిత్రం మెర్రీ రియానా: మింపి సెజుటా డోలార్‌లతో పాటు 2014లో సిట్‌కామ్ టెటాంగా మాసా గిటుతో ఆమె నటిగా విజయాన్ని సాధించింది. ఆమె 2013 డ్రామా ఫిల్మ్ రిఫ్రెయిన్‌లో అఫ్గన్‌స్యా రెజా, మౌడీ అయుండాలతో కలిసి తన చలన చిత్ర రంగ ప్రవేశం చేసింది.[3][4]

దీనికి ముందు, 2005లో, ఆమె వాల్స్ ఐస్ క్రీం వాణిజ్య ప్రకటనలో నటించింది.

ఆమె 2015లో హిస్టారికల్ డ్రామా డి బాలిక్ 98లో, 2016లో మరో జీవితచరిత్ర డ్రామా రూడీ హబీబీలో బాయ్ విలియం సరసన కనిపించింది. ఈ రెండు పాత్రలు 2015, 2016లలో వరుసగా ఆమె ఉత్తమ నటి విభాగంలో నామినేషన్లు పొందాయి.

2016 బయోపిక్ చిత్రం 3 శ్రీకండిలో ఆమె పాత్రకు ఉత్తమ సహాయ నటిగా 2016 మాయ అవార్డును, ఉత్తమ సహాయ నటిగా 2017 ఇండోనేషియా మూవీ అవార్డును, అలాగే 2016 బాండుంగ్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ఉత్తమ నటి అవార్డును గెలుచుకుంది. అలాగే 2016లో మో బ్రదర్స్ యాక్షన్ ఫిల్మ్ హెడ్‌షాట్‌లో ఆమె డాక్టర్‌ పాత్ర పోషించింది.

ఫిల్మోగ్రఫీ

[మార్చు]

సినిమా

సంవత్సరం సినిమా పాత్ర మూలం
2013 రిఫ్రేన్ అన్నలైజ్ [5]
2014 స్ట్రీట్ సొసైటీ కరీనా [6]
మెర్రీ రియానా: మింపి సెజుటా డాలర్ మెర్రీ రియానా [7]
2015 డి బాలిక్ 98 డయానా [8]
గురు బంగ్సా: జోక్రోఅమినోటో స్టెల్లా [9]
లవ్ యూ... లవ్ యూ నాట్ అమీరా [10]
2016 3 శ్రీకండి లిల్లీస్ హందాయాని [11]
హెడ్‌షాట్ ఐలిన్ [12]
పింకి ప్రామీస్ చెల్సియా [13]
రూడీ హబీబీ ఇల్లోనా ఇయానోవ్స్కా [14]
2017 ఆయత్-అయత్ సింటా 2 కైరా [15]
2018 మె ది డెవిల్ టేక్ యు ఆల్ఫీ విజియా [16]
2020 మె ది డెవిల్ టేక్ యు టూ [17]
2024 గోడమ్ & తీరా సూసీ / తీరా
TBA మె ది డెవిల్ టేక్ యు దజ్జాల్ ఆల్ఫీ విజియా [18]
పేట్రియాట్ సూసీ / తీరా

వ్యక్తిగత జీవితం

[మార్చు]

చెల్సియా ఇస్లాన్ 2016 అక్టోబరు 28న 1928 యూత్ ప్లెడ్జ్ 88వ వార్షికోత్సవం సందర్భంగా ఇండోనేషియాకు సహకరించడానికి, రాజకీయ తత్వశాస్త్ర విలువలను రక్షించడానికి ఒక వేదికగా అంకితం చేయబడిన 'యూత్ ఆఫ్ ఇండోనేషియా' అనే యువజన సంఘాన్ని స్థాపించింది. ఆమె సంఘం అధ్యక్షురాలిగా కూడా పనిచేస్తోంది.[19][20][21] జకార్తాలో జరిగిన 2017 ఆగ్నేయాసియా నాయకుల సమ్మిట్‌లో ఇన్నోవేటివ్ యంగ్ లీడర్‌గా ఆమె ఎంపికయ్యింది.[22] ఆమె 2022 డిసెంబరు 8న జకార్తా కేథడ్రల్‌లో ఇండోనేషియా రాజకీయవేత్త రాబ్ క్లింటన్ కార్డినల్‌ (Rob Clinton Kardinal)ను వివాహం చేసుకుంది.

మ్యాగజైన్ / టాబ్లాయిడ్స్

[మార్చు]
  • టాబ్లాయిడ్ వనితా ఇండోనేషియా మార్చి 2016, ఆగస్టు 2016
  • మజాలా ఫెమినా 13–19 ఆగస్టు 2016 (బుంగా సిట్రా లెస్టారి, తారా బస్రోలతో)

మూలాలు

[మార్చు]
  1. PASTRY - Bisnis Bareng Pacar Kenapa Enggak? (Chelsea Islan & Rob Clinton) (in ఇంగ్లీష్), retrieved 2022-01-21
  2. Diananto, Wayan (28 September 2014). "Waktu Kecil, Chelsea Islan Ikut Futsal, Go Kart, dan Taekwondo" [Chelsea Islan played soccer, go-kart, and taekwondo when she was a kid]. Tabloid Bintang (in Indonesian). Retrieved 10 January 2018.{{cite web}}: CS1 maint: unrecognized language (link)
  3. Diananto, Wayan (28 September 2014). "Waktu Kecil, Chelsea Islan Ikut Futsal, Go Kart, dan Taekwondo" [Chelsea Islan played soccer, go-kart, and taekwondo when she was a kid]. Tabloid Bintang (in Indonesian). Retrieved 10 January 2018.{{cite web}}: CS1 maint: unrecognized language (link)
  4. Bhisma, Mahardian Prawira (28 July 2016). "Cerita Chelsea Islan Masuk ke Dunia Film" [Chelsea Islan story entering film industry for the first time]. Detik.com (in Indonesian). Retrieved 10 January 2018.{{cite web}}: CS1 maint: unrecognized language (link)
  5. Sasongko, Darmadi (15 June 2013). "Chelsea Elizabeth Akui Karakter di 'REFRAIN' Cermin Pribadinya" [Chelsea Elizabeth admits character in 'Refrain' is her personal mirror]. KapanLagi.com (in Indonesian). Retrieved 10 January 2018.{{cite web}}: CS1 maint: unrecognized language (link)
  6. Kurniawan, Ari (20 February 2014). "2 Karakter Berbeda Chelsea Islan di "Street Society"" [2 Different characters of Chelsea Islan in "Street Society"]. Tabloid Bintang (in Indonesian). Retrieved 10 January 2018.{{cite web}}: CS1 maint: unrecognized language (link)
  7. "Main di 'Merry Riana: Mimpi Sejuta Dolar', Chelsea Islan Punya Persamaan dengan Merry Riana" [Playing in 'Merry Riana: A Million Dollar Dream', Chelsea Islan got a resemblance to Merry Riana]. Detik.com (in Indonesian). 23 December 2014. Retrieved 10 January 2018.{{cite web}}: CS1 maint: unrecognized language (link)
  8. Masrifah, Alviana Harmayani (13 April 2015). "Chelsea Islan Ingin 'Di Balik 98' Jadi Film Pendidikan" [Chelsea Islan wants 'Behind 98' to be educational film]. Sindo News (in Indonesian). Retrieved 10 January 2018.{{cite web}}: CS1 maint: unrecognized language (link)
  9. Syaifullah, Asep (8 August 2016). "Niat Magang, Chelsea Islan Diminta Main Di 'Guru Bangsa Tjokroaminoto'" [Intending to apprentice, Chelsea Islan was requested to play in 'Guru Bangsa Tjokroaminoto']. Detik.com (in Indonesian). Retrieved 10 January 2018.{{cite web}}: CS1 maint: unrecognized language (link)
  10. Priherdityo, Endro (13 August 2015). "'Love You Love You Not', Film Adaptasi 'Mentah'" ['Love You Love You Not', a raw adaptation film]. CNN Indonesia (in Indonesian). Retrieved 10 January 2018.{{cite web}}: CS1 maint: unrecognized language (link)
  11. Probowati, Dian; Mendrofa, Desman (14 August 2016). "Bunga Citra Lestari, Tara Basro, dan Chelsea Islan Menghidupkan 3 Srikandi" [Bunga Citra Lestari, Tara Basro, and Chelsea Islan revive 3 Srikandi]. Femina (in Indonesian). Retrieved 10 January 2018.{{cite web}}: CS1 maint: unrecognized language (link)
  12. Tampubolon, Hans David (6 December 2016). "Review: A bloody, poetic homage to martial arts". The Jakarta Post. Retrieved 10 January 2018.
  13. Wira, Ni Nyoman (2 September 2016). "Chelsea Islan to star in film inspired by breast cancer survivors". The Jakarta Post. Retrieved 9 January 2018.
  14. "Reza Rahadian, Chelsea Islan to Star in 'Rudy Habibie'". Jakarta Globe. 20 June 2016. Archived from the original on 22 September 2018. Retrieved 9 January 2018.
  15. Setiawan, Tri Susanto (8 May 2017). "Ini Peran Chelsea Islan dalam "Ayat-ayat Cinta 2"" [This is Chelsea Islan's role in "Ayat-ayat Cinta 2"]. Kompas (in Indonesian). Retrieved 9 January 2018.{{cite web}}: CS1 maint: unrecognized language (link)
  16. Kumampung, Dian Reinis (11 July 2018). "Chelsea Islan: 'Sebelum Iblis Menjemput' Itu Film Horor Terobosan Baru" [Chelsea Islan: 'Before the Devil Picked up' is the new breakthrough horror film]. Kompas (in Indonesian). Retrieved 12 July 2018.{{cite web}}: CS1 maint: unrecognized language (link)
  17. Jumat, Wib (2020-02-28). "Teror Kutukan Masih Berlanjut dalam "Sebelum Iblis Menjemput Ayat 2"". indozone.id (in ఇండోనేషియన్). Archived from the original on 18 November 2020. Retrieved 2020-11-11.
  18. "Chelsea Islan". IMDb. Retrieved 2021-01-29.
  19. Setiawan, Tri Susanto (26 November 2017). "Alasan Chelsea Islan Terlibat di Komunitas Youth of Indonesia" [Chelsea Islan explained her reasons to get involved in Youth of Indonesia community]. Kompas (in Indonesian). Retrieved 10 January 2018.{{cite web}}: CS1 maint: unrecognized language (link)
  20. Suwarta, Thomas Harming (27 November 2017). "Chelsea Islan Menantang Anak Muda Indonesia" [Chelsea Islan challenging young Indonesians]. Media Indonesia (in Indonesian). Retrieved 10 January 2018.{{cite web}}: CS1 maint: unrecognized language (link)
  21. Putri, Teatrika Handiko (26 November 2017). "Chelsea Islan: Bangun Kebhinekaan melalui Youth of Indonesia" [Chelsea Islan: Embracing diversity through Youth of Indonesia]. IDN Times (in Indonesian). Retrieved 10 January 2018.{{cite web}}: CS1 maint: unrecognized language (link)
  22. "Chelsea Islan Raih Penghargaan Innovative Young Leader 2017" [Chelsea Islan awarded the Innovative Young Leaders 2017]. Detik.com (in Indonesian). 12 April 2017. Archived from the original on 10 January 2018. Retrieved 10 January 2018.{{cite web}}: CS1 maint: unrecognized language (link)