Jump to content

చేతి పనులు

వికీపీడియా నుండి
(చేతివృత్తులు నుండి దారిమార్పు చెందింది)

చేతివృత్తులు , కులవృత్తులు మన సమాజంలో అనాదిగా ఉన్నాయి. ఆయా వృత్తుల పేర్లతోనే కులాలు ఏర్పడ్డాయి. అయితే ఈనాడు కులవృత్తులు కుప్పకూలుతున్నాయి. ఈ వృత్తుల్నే నమ్ముకున్న వారి జీవితాలు తెల్లారిపోతున్నాయి. ఆధునిక పనిముట్లు ఉన్న ఉపాధిని దెబ్బతీస్తున్నాయి. చేతిలో చేవఉన్నా పనిలేక బలహీనవర్గాలు నలిగిపోతున్నాయి. ఆధునిక పరిస్థితులకు తగ్గట్లుగా చేతివృత్తుల్ని తీర్చిదిద్ది ఉపాధి కల్పించాలి. 11 బీసీ కులాలకు సమాఖ్యలు ఏర్పాటుచేసింది ప్రభుత్వం.

చాకిరేవు

[మార్చు]
దోభీ ఘాట్ లో బట్టలు శుబ్రం చేయుచున్న చిత్రం

రజక వృత్తి , చాకలిపని: డ్రై క్లీనింగ్ కేంద్రాలు, ఆధునిక వాషింగ్ యంత్రాలు చాకలివాళ్ళకు ఉపాధి అందనియ్యలేదు. డ్రై క్లీనింగ్ కేంద్రాలు పెడదామంటే పెట్టుబడిపెట్టే స్తోమతలేని బడుగు బతుకులు వీరివి. 1982లో రజక సహకార సంఘాల సమాఖ్యఏర్పడింది. రజక సహకార సంఘాల సమాఖ్య ద్వారా ఏటా రూ.50 లక్షలు దోభీ ఘాట్ల నిర్మాణానికి రుణాలు అందిస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా సమాఖ్య పరిధిలో మూడున్నర వేలకు పైగా రజక సహకార సంఘాలున్నాయి.

సెలూన్

[మార్చు]

నాయి బ్రాహ్మణ వృత్తి, మంగలిపని, క్షౌరం చేయటం.1989లో నాయి బ్రాహ్మణ సహకార సంఘాల సమాఖ్య ఏర్పాటయింది రాష్ట్ర నాయిబ్రాహ్మణ సహకార సంఘాల సమాఖ్యలో 2 వేల నాయిబ్రాహ్మణ సంఘాలున్నాయి. ఒక్కో సభ్యుడికి రూ. 10 వేల ఋణం ఇస్తారు. కార్పొరేట్ కంపెనీలు కూడా ఈ రంగంలోకొస్తున్న నేపథ్యంలో ఆధునిక సెలూన్లు పెట్టుకోవడానికి రుణాలివ్వాలని ఆ వర్గాలు కోరుతున్నాయి.

వడ్డెర

[మార్చు]

వడ్డెర సహకార సంఘాల సమాఖ్య లో రాష్ట్రవ్యాప్తంగా 2016 సంఘాలున్నాయి. సంఘంలో ఒక్కో సభ్యునికి రూ.10వేలు రుణం వస్తోంది. వీటితో పలుగు, పార కొని, మట్టిపని, రాళ్లపని, కంకర తదితర పనులు చేసే వడ్డెర్లకు జేసీబీ, క్రషర్ల రూపంలో ఉపాధి గండిపడుతోంది. ఒక్కో యంత్రానికి రూ.3 లక్షలకు పైగా అవసరం. సంఘాలకు సంయుక్తంగా ఆధునిక యంత్రాలు అందించాలని వడ్డెర్లు కోరుతున్నారు.

బొమ్మల తయారీ

[మార్చు]

కలంకారీ , కొండపల్లి బొమ్మలు , నక్కపల్లి లక్క బొమ్మలు తయారీలో అన్ని కులాలవాళ్ళూ ఉన్నారు.

చేతివృత్తుల సహకార సంఘాల సమాఖ్యలు

[మార్చు]
  1. 1982 రజక సహకార సంఘాల సమాఖ్య--బీసీ సంక్షేమశాఖ
  2. 1989 నాయిబ్రాహ్మణ సహకార సంఘాల సమాఖ్య --బీసీ సంక్షేమశాఖ
  3. 2009విశ్వబ్రాహ్మణ సహకార సంఘాల సమాఖ్య--పరిశ్రమలశాఖ
  4. శాలివాహన సహకార సంఘాల సమాఖ్య--పరిశ్రమలశాఖ
  5. మేదరి సహకార సంఘాల సమాఖ్య--పరిశ్రమలశాఖ
  6. దర్జీ సహకార సంఘాల సమాఖ్య--పరిశ్రమలశాఖ
  7. దూదేకుల సహకార సంఘాల సమాఖ్య--మైనారిటీ సంక్షేమశాఖ
  8. పూసల /కృష్ణబలిజ సహకార సంఘాల సమాఖ్య--బీసీ సంక్షేమశాఖ
  9. ఉప్పర (సగర) సహకార సంఘాల సమాఖ్య--బీసీ సంక్షేమశాఖ
  10. బోయ /వాల్మీకి సహకార సంఘాల సమాఖ్య--బీసీ సంక్షేమశాఖ
  11. భట్రాజు ల సహకార సంఘాల సమాఖ్య--బీసీ సంక్షేమశాఖ

సమాఖ్యలకు కార్యాలయాలు, సిబ్బంది , బడ్జెట్‌ కేటాయింపులు జరగాలి. ఒక్కో సమాఖ్యకు రూ.కోటి చొప్పున కేటాయిస్తామని ముఖ్యమంత్రి వైఎస్ గత ఏడాది అసెంబ్లీలో ప్రకటించారు. చేతి, వృత్తిదారులను ఆదుకునే పేరుతో 2005-06లో 'రాజీవ్ అభ్యుదయ యోజన'ను ప్రవేశపెట్టింది. పథకం కింద కులవృత్తులు చేసుకునే వారికి ఆధునిక పనిముట్లు, ఆర్థిక సహాయం అందజేస్తారు. ఒక్కో యూనిట్ కింద రూ.3 వేలకు మించి మంజూరుచేయడం లేదు.

మూలాలు

[మార్చు]