చైనాలో కరోనావైరస్ మహమ్మారి 2019-2020
వ్యాధి | కోవిడ్-19 |
---|---|
మొదటి కేసు | 2019 డిసెంబర్ 1 |
మూల స్థానం | వుహాన్ , హుబీ , చైనా[1] |
కేసులు నిర్ధారించబడింది | 88,118[2] |
బాగైనవారు | 82,370[2] |
మరణాలు | 4,635[2] |
కోవిడ్-19 వ్యాధిని కలిగించే కరోనావైరస్ 2019 (సార్స్-సీవోవీ-19) మహమ్మారి మొట్టమొదటగా చైనాలో 2019 డిసెంబరు నెలలో వ్యాప్తి చెందడం ప్రారంభమై, ప్రపంచవ్యాప్తంగా విస్తరించింది. చైనా ప్రభుత్వ అధికారిక లెక్కల ప్రకారం మొత్తంగా చైనావ్యాప్తంగా 88,118 నిర్ధారిత కేసులు నమోదు కాగా, వారిలో 82,370 మంది కోలుకున్నారు, 4,635 మంది మరణించారు. 2019 డిసెంబరు 1న ప్రస్తుతం నిర్ధారితమైన కేసుల్లో అత్యంత మొదటి కేసు చైనాలోని హుబయ్ ప్రావిన్సులో వుహాన్ నగరంలో బయటపడింది. డిసెంబరు నెలాఖరుకి అంతుచిక్కని కారణంతో న్యుమోనియా బారిన పడుతున్న సమూహాన్ని చైనా వైద్యులు గుర్తించి అధికారులకు తెలియజేశారు. చైనా వైద్యాధికారులు వుహాన్ వెట్ మార్కెట్లో జంతువుల నుంచి వీరందరికీ వైరస్ వ్యాపిస్తోందని ప్రకటించారు. 2020 జనవరి మూడవ వారం వరకూ చైనా ఇది మనిషి నుంచి మనిషికి వ్యాపించదనే చెప్పారు.
2020 జనవరి 23న వుహాన్ నగరం నుంచి బయటకు, లోపలికి ప్రయాణాలను నిషేధిస్తూ చేపట్టిన చర్యలతో మొదలుపెట్టి, హుబయ్ ప్రావిన్సు వ్యాప్తంగానూ, దేశవ్యాప్తంగానూ ప్రయాణాలపైన, కదలికలపైన పలు నియంత్రణలు, దేశ సరిహద్దుల మూసివేత, విమానాల నిలుపుదల వంటి అనేక చర్యలు చేపట్టారు. రోగులకు చికిత్స చేయడానికి యుద్ధ ప్రాతిపదికన రికార్డు సమయంలో 14 ఆసుపత్రులను, క్వారంటైన్ చేయడానికి ఒక ప్రత్యేక ఆసుపత్రిని చైనా నిర్మించింది. దేశవ్యాప్తంగా నిషేధాజ్ఞలు కట్టుదిట్టంగా అమలుచేసింది.
2020 మార్చి 23న ఐదు రోజుల వ్యవధిలో ఒకే ఒక్క కేసు, అది కూడా ఇస్తాంబుల్ నగరం నుంచి చైనా తిరిగివచ్చిన యాత్రికుని కేసు, నమోదైనట్టుగా చైనా ప్రభుత్వం ప్రకటించింది. 24న తమ దేశంలో కోవిడ్-19 వ్యాప్తిని అరికట్టామని చైనా ప్రీమియర్ ప్రకటించాడు, ఆరోజు నుంచి వుహాన్ నగరం తప్పించి హుబయ్ ప్రావిన్సు సహా చైనాలో నియంత్రణలు సడలించారు. ప్రపంచంలోని ఇతర ప్రాంతాల్లో వ్యాపిస్తున్న కరోనావైరస్ 2019 తిరిగి చైనాలోకి రాకుండా మార్చి 26 నుంచి చర్యలు తీసుకుంటున్నారు.
వైరస్ వ్యాప్తి ప్రారంభం
[మార్చు]కరోనా వైరస్ మొట్టమొదట చైనా లోని హుబై ప్రావిన్స్ యొక్క రాజధాని అయిన వూహాన్ పట్టణంలో అంతుచిక్కని సామూహిక న్యుమోనియాగా నమోదు అయ్యింది. 17 నవంబరు 2020 లో 55 ఏళ్ళ వ్యక్తికి మొదట ఇది సోకింది [3]. అయితే చైనీసు వైద్యాధికారులు దీనిని గుర్తించేలోపే ఇది వూహాన్ కేంద్రంగా చైనాలో, ఇతర దేశాలలో పాకిపోయింది. ఆ రోజు నుండి ప్రతి రోజు ఒకటి నుండి ఐదు కరోనా పాజిటివ్ కేసులు నమోదు అవుతూ వచ్చాయి. 27 డిసెంబరు 2019 న వూహాన్ లో గల Hubei Provincial Hospital of Integrated Chinese and Western Medicine లో పని చేసే Zhang Jixian అనే వైద్యుడు స్థానిక వ్యాధి నిరోధక, నియంత్రణ కేంద్రం (Center for Disease Control and Prevention) కు ఇది ఒక క్రొత్త కరోనా వైరస్ అని తెలిపాడు. 31 డిసెంబరు 2019 న Li Wenliang అనే వైద్యుడు ఈ న్యుమోనియాకు సంబంధించి సాంఘిక మాధ్యమాలలో ధృవీకరించని కొన్ని పత్రాలను పోస్టు చేసాడు. అప్పటికి ఆ వైద్యుణ్ణి పోలీసులు మందలించారు. కానీ తర్వాత ఆ వైద్యుడు కూడా కరోనా వైరస్ కాటుకు బలి అయ్యడు. దీనితో CDC హూవనన్ సముద్ర ఆహారపు మార్కెట్ లో అంతుచిక్కని న్యుమోనియాగా ఒకటి ఉన్నట్లుగా ఒప్పుకొంది. ప్రభుత్వపు రికార్డులు ఏవీ ప్రజలకు అందుబాటులో లేవు. విపరీతంగా వ్యాపిస్తున్న వ్యాధి యావత్ దేశాన్ని కుదిపేస్తుండటంతో 1 జనవరి న బీజింగ్ కు చెందిన National Health Commission నుండి నిపుణులు కొందరిని వూహాన్ కు పంపటం జరిగింది.
కొత్త వైరస్ గుర్తింపు, వైరస్ విజృంభణ
[మార్చు]8 జనవరి న ఒక క్రొత్త కరోనా వైరస్, ఈ న్యుమోనియాకు కారణంగా తేలింది. ఈ వైరస్ యొక్క క్రమాన్ని ఓపెన్ యాక్సెస్ డాటాబేసులో త్వరలోనే ప్రచురించారు. దీని కట్టడికి చైనా దేశం అవలంబించిన జాగ్రత్తలు/సూచనలు ప్రపంచ ఆరోగ్య సంస్థ, ఇతర దేశాల ప్రభుత్వాలు కొనియాడాయి. 2003 SARS పై తాము పోరాడిన తీరు కంటే కరోనా వైరస్ పై తాము పోరాడిన తీరును ప్రపంచానికి తెలుపటం లో చైనా చాల పారదర్శకంగా వ్యవహరించింది. 12 మార్చి 2020 న అమెరికా సంయుక్త రాష్ట్రాల అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ టీవీ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ వైరస్ చైనా నుండే ఇతర దేశాలకు ప్రాకింది అని తెలిపారు. దీనికి జవాబు గా చైనా విదేశాంగ మంత్రివర్గానికి చెందిన Zhao Lijian అమెరికా సైన్యమే ఈ వైరస్ ను చైనాకు తెచ్చి ఉండవచ్చనే అనుమానం వ్యక్తం చేశారు.
నియంత్రణ చర్యలు
[మార్చు]వూహాన్, హుబై అధికార వర్గాలు స్పందించడంలో ఉదాసీనత, వివాదాస్పద స్పందనలతో తొలిదశ లోనే వ్యాప్తిని నియంత్రించలేకపోయేలా చేశాయి అని ప్రజలు/ప్రసార మాధ్యమాలు విమర్శించాయి. 29 జనవరికి వైరస్ మెయిన్ ల్యాండ్ చైనా (హాంగ్ కాంగ్, మకావు లని తప్పించి) అంతటా వ్యాపించింది.[4] మెయిన్ ల్యాండ్ చైనా లోని అన్ని ప్రావిన్సులు ప్రజారోగ్య అత్యవసర పరిస్థితికి పూనుకొన్నాయి. వైరస్ కట్టడికి చైనా చేయగలిగిందల్లా చేస్తోంది అనే ఆత్మవిశ్వాసం కలిగి ఉన్ననూ, ప్రపంచ ఆరోగ్య సంస్థ ఈ పరిస్థితిని అంతర్జాతీయంగా ఆందోళన కలిగించే ప్రజారోగ్య అత్యవసర పరిస్థితి గా ప్రకటించింది.[5] 8 ఫిబ్రవరి నాటికి వైరస్ దెబ్బకు మృతులు 724 కాగా వైరస్ సోకిన వారు 34,878 మందికి అప్పటికే వైరస్ సోకింది. కేవలం హుబై ప్రావిన్స్ లోనే 699 మరణాలు, 24,953 పాజిటివ్ కేసులు సంభవించాయి.
చైనా కమ్యూనిస్టు పార్టీ జనరల్ సెక్రటరీ Xi Jinping తమ దేశం ఒక తీవ్రమైన పరిస్థితిని ఎదుర్కొంటోందని హెచ్చరించారు.[6] పార్టీ యొక్క పోలిట్ బ్యూరో అంటువ్యాధిని నియంత్రించటానికి Li Keqiang నాయకత్వంలో ఒక ప్రత్యేక బృందాన్ని నియమించింది.[7] [8] చైనా తమ నూతన సంవత్సర వేడుకలను రద్దు చేసుకొంది. దేశవ్యాప్తంగా ప్రయాణీకులు జ్వరం తో బాధపడుతున్నారా అని తనిఖీ చేయబడింది. వూహాన్, హుబై లతో బాటు పలు చోట్ల మహమ్మారిని నియంత్రించేందుకు స్థానికంగా అధికారిక బృందాలు ఏర్పడ్డాయి. ఒక ప్రావిన్సు నుండి ఇంకో ప్రావిన్సు కు ప్రయాణించే చాలా బస్సులు, రైళ్ళు నిలిపివేయబడ్డాయి. 29 జనవరి కల్లా హుబై ప్రావిన్సులోని అన్ని నగరాలు నిర్బంధం (Quarantine) కి వెళ్ళిపోయాయి. హువాంగాంగ్, వెంజౌ వంటి నగరాలలో కర్ఫ్యూ కూడా నిర్వహించారు. ప్రపంచ తయారీ కేంద్రం అయిననూ చైనా లో ఫేస్ మాస్కుల, ఇతర రక్షణ పరికరాల కొరత నెలకొంది.
25 ఫిబ్రవరి నాటికి మెయిన్ ల్యాండ్ చైనా బయట కరోనా పాజిటివ్ కేసులు చైనా ను మించిపోయాయి. చైనా అవలంబించిన నియంత్రణ చర్యలను ప్రపంచ ఆరోగ్య సంస్థ కొనియాడింది.[9] తాకిడి అధికంగా ఉన్న సమయంలో రోజుకు వేల కొద్దీ కరోనా పాజిటివ్ కేసుల నమోదు నుంది, 6 మార్చి నాటికి రోజుకు 100 కేసులు కూడా నమోదు కాని స్థాయికి చైనా వచ్చింది. 13 మార్చి నాటికి విదేశాల నుండి వచ్చిన కేసులు స్థానికంగా ఒకరి ద్వారా ఒకరికి సోకే కేసుల కంటే ఎక్కువ గా ఉన్నవి.[10]
ఇన్ఫెక్షనులు పెరిగే కొద్దీ భయం ప్రజలలో భయం పెరిగింది. దీనితో చైనాలో స్థానిక వివక్ష, చైనా బయట జాతి వివక్ష పెరిగిపోయాయి. ఈ వివక్షల బారిన పడవద్దు అని ప్రభుత్వాలు సూచించిననూ ఆ ప్రయత్నాలు బూడిదలో పోసిన పన్నీరే అయ్యాయి.[11] చైనాలో సాంఘిక మాధ్యమాల ద్వారా కొన్ని పుకార్లు సృష్టించబడగా ప్రసార మాధ్యమాలు, ప్రభుత్వాలు ఈ అపోహలను తొలగించే ప్రయత్నం చేశాయి. ఇటువంటి గాలివార్తలను, విమర్శలను ప్రభుత్వం సెన్సారు చేస్తూ వైరస్ వ్యాప్తిపై అధికారిక స్పందనను వెలుగులోకి తీసుకువచ్చింది. [12] [13]
నియంత్రణ
[మార్చు]24 మార్చి 2020 నాటికి వైరస్ వ్యాప్తి నియంత్రణ అయ్యిందని, ప్రస్తుతం ఈ వ్యాధి ఒకరి నుండి ఇంకొకరికి సోకకుండా నివారణ చర్యలు పకడ్బందీగా అమలు చేశామని చైనా ప్రకటించింది [14] 4 ఏప్రిల్ 2020 న కరోనా వైరస్ కు మృతి చెందిన వారికి నివాళులను అర్పిస్తూ చైనాలో, ఇతర దేశాలలోని చైనీసు రాయబార కార్యాలయాలలో జాతీయ పతాకాలను సగం ఎత్తులోనే ఎగురవేసింది. ఆ రోజు జరిగే అన్ని వినోద కార్యక్రమాలను నిలిపివేసింది. [15] [16]
మూలాలు
[మార్చు]- ↑ Sheikh, Knvul; Rabin, Roni Caryn (March 10, 2020). "The Coronavirus: What Scientists Have Learned So Far". The New York Times. Retrieved March 24, 2020.
- ↑ 2.0 2.1 2.2 截至1月15日24时新型冠状病毒肺炎疫情最新情况 (in Chinese (China)). National Health Commission. 15 January 2021. Retrieved 15 January 2021.[permanent dead link]
- ↑ "నవంబరులోనే చైనాలో కరోనా". economictimes.indiatimes.com. Retrieved 2020-03-30.
- ↑ "చైనా లోని అన్ని ప్రావిన్సులకు కరోనా వ్యాప్తి". npr.org. Retrieved 2020-03-31.
- ↑ "చైనా లోని అన్ని ప్రావిన్సులకు కరోనా వ్యాప్తి". medicalnewstoday.com. Retrieved 2020-03-31.
- ↑ "చైనా క్లిష్ట పరిస్థితులలో ఉంది - JinPing". reuters.com. Retrieved 2020-03-31.
- ↑ "కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ చైన పోలిట్ బ్యూరో సమావేశం". en.people.cn. Retrieved 2020-03-31.
- ↑ "కరోనా వేగంగా వ్యాపిస్తోంది - Xi JinPing". bbc.com. Retrieved 2020-03-31.
- ↑ "నియంత్రణ చర్యల పై ప్రపంచ ఆరోగ్య సంస్థ యొక్క ప్రశంస". who.int. Retrieved 2020-03-31.
- ↑ "స్థానిక వ్యాప్తిని మించిన దిగుమతి అయిన కేసులు". straitstimes.com. Retrieved 2020-03-31.
- ↑ "వివక్షలకు దారి తీసిన కరోనా వైరస్". fox61.com. Retrieved 2020-04-04.
- ↑ "సాంఘిక మాధ్యమాల ద్వారా ప్రశ్నించిన చైనా పౌరులు. సెన్సారు చేసిన ప్రభుత్వం". nytimes.com. Retrieved 2020-04-04.
- ↑ "ప్రజలలోకి వెళ్ళి వారిలో ఆత్మస్థైర్యాన్ని నింపిన చైనా అధ్యక్షుడు జిన్ పింగ్". nytimes.com. Retrieved 2020-04-04.
- ↑ "చైనా లో నియంత్రించబడ్డ కరోనా వైరస్". english.scio.gov.cn. Retrieved 2020-04-04.
- ↑ "కరోనా మృతులకు చైనా నివాళి". www.scmp.com. Retrieved 2020-04-04.
- ↑ "సగం ఎత్తునే ఎగురవేయబడ్డ చైనీసు జాతీయ పతాకాలు". xinhuanet.com. Archived from the original on 2020-04-04. Retrieved 2020-04-04.