చోక్డ్
చోక్డ్ | |
---|---|
దర్శకత్వం | అనురాగ్ కశ్యప్ |
రచన | నిహిత్ భావే |
నిర్మాత | అనురాగ్ కశ్యప్, ధృవ్ జగాసియా, అక్షయ్ థక్కర్ |
తారాగణం |
|
ఛాయాగ్రహణం | సిల్వస్టర్ ఫోన్సెకా |
కూర్పు | కోణార్క్ సాక్సేన |
సంగీతం | కర్ష్ కాలే |
నిర్మాణ సంస్థలు | జేఏఆర్ పిక్చర్స్ గుడ్ బ్యాడ్ ఫిలింస్ |
పంపిణీదార్లు | నెట్‌ఫ్లిక్స్ |
విడుదల తేదీ | 5 జూన్ 2020 |
సినిమా నిడివి | 114 నిమిషాలు |
దేశం | భారతదేశం |
భాష | హిందీ |
చోక్డ్ 2020లో హిందీలో విడుదలైన సినిమా. గుడ్ బ్యాడ్ ఫిలింస్ బ్యానర్ పై అనురాగ్ కశ్యప్, ధృవ్ జగాసియా, అక్షయ్ థక్కర్ నిర్మించిన ఈ సినిమాకు అనురాగ్ కశ్యప్ దర్శకత్వం వహించాడు. 2016లో కేంద్ర ప్రభుత్వం అమలు చేసిన “నోట్ల రద్దు” నేపథ్యంలో ఈ సినిమాను నిర్మించారు. సయామీ ఖేర్, రోషన్ మాథ్యూ, అమృతా సుభాష్, రాజ్‌శ్రీ దేశ్‌పాండే ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా జూన్ 05, 2020న నెట్‌ఫ్లిక్స్ ఓటిటీలో విడుదలైంది.
కథ
[మార్చు]ముంబయి మధ్య తరగతి గృహిణి అయిన సరిత (సయామీ ఖేర్) బ్యాంకు ఉద్యోగిగా పనిచేస్తూ ఉంటుంది. నిరుద్యోగి భర్త సుశాంత్ (రోషన్ మాథ్యూ) తో, తన చిన్న కొడుకుతో బాధపడుతూ సరిత కుటుంబ పోషణ భారం మొత్తం ఒక్కటే మోస్తూ ఉంటుంది. మధ్య తరగతి ఇల్లాలిగా అనేక బాధలుపడుతున్న సరితకు అనుకోకుండా డబ్బు వచ్చి చేరుతుంది. ఒక్కసారిగా వచ్చి పడిన సంపదతో ఆనందంగా గడుపుతున్న సరిత జీవితంలో పెద్ద నోట్ల రద్దు పిడిగుపాటులా మారుతుంది. తన దగ్గర ఉన్న డబ్బు మొత్తం చెల్లని నోట్లని తెల్సిన సరిత ఆ డబ్బును ఏమి చేసింది..?ఆ డబ్బువల్ల ఆమెకు వచ్చిన ఇబ్బంది ఏమిటీ అనేది మిగతా సినిమా కథ?
నటీనటులు
[మార్చు]- సయామీ ఖేర్ - సరిత పిళ్ళై [1]
- రోషన్ మాథ్యూ - సుశాంత్ పిళ్ళై [2]
- అమృతా సుభాష్ - శార్వరి తాయి
- రాజశ్రీ దేశ్‌పాండే - నీతా
- తావిడ్ రైక్ జామున్ - నీతా స్నేహితుడు
- తుషార్ దాల్వి - బ్యాంకు మేనేజర్
- ఉపేంద్ర లిమయే - రెడ్డి
- మిలింద్ ఫాఠక్ - జోషి
- ఉదయ్ నేనే - దినేష్
- వందన మరాఠే - ఆర్య
- పర్తవీర్ శుక్ల - సమీర్ పిళ్ళై
సాంకేతిక నిపుణులు
[మార్చు]- బ్యానర్: గుడ్ బ్యాడ్ ఫిలింస్
- నిర్మాత: అనురాగ్ కశ్యప్, ధృవ్ జగాసియా, అక్షయ్ థక్కర్
- కథ: నిహిత్ భావే
- స్క్రీన్ ప్లే, దర్శకత్వం: అనురాగ్ కశ్యప్
- సంగీతం: కర్ష్ కాలే
- సినిమాటోగ్రఫీ:సిల్వస్టర్ ఫోన్సెకా
మూలాలు
[మార్చు]- ↑ Hindustan Times (15 April 2021). "Saiyami Kher on Choked: 'Grateful to Anurag Kashyap, stuck with his word and made the film with me'" (in ఇంగ్లీష్). Archived from the original on 19 August 2021. Retrieved 19 August 2021.
- ↑ The Hindu (20 May 2020). "Roshan Mathew set to make Bollywood début with Anurag Kashyap's Netflix original 'Choked'" (in Indian English). Archived from the original on 19 August 2021. Retrieved 19 August 2021.