సయామీఖేర్
సయామీఖేర్ | |
---|---|
జననం | 1992/1993 (age 30–31) నాసిక్, మహారాష్ట్ర, భారతదేశం |
విద్యాసంస్థ | సెయింట్. జేవియర్స్ కాలేజ్, ముంబై |
వృత్తి | నటి |
క్రియాశీల సంవత్సరాలు | 2013 - ప్రస్తుతం |
తల్లిదండ్రులు | అద్వైత్ ఖేర్, ఉత్తరా మాత్రే ఖేర్ |
బంధువులు | ఉషా కిరణ్ (అమ్మమ్మ) మమతా కులకర్ణి |
సయామీఖేర్ (ఆంగ్లం: Saiyami Kher) తెలుగులో రేయ్ చిత్రంతో వెండితెర అరంగేట్రం చేసిన భారతీయ నటి. హిందీ, మరాఠీ చిత్రాలలోనూ పనిచేస్తుంది.
ప్రారంభ జీవితం
[మార్చు]సయామీఖేర్ మాజీ మిస్ ఇండియా అయిన అద్వైత్ ఖేర్,[1] ఉత్తరా మాత్రే ఖేర్‌లకు జన్మించింది. ఆమె నటి ఉషా కిరణ్ మనవరాలు, అలాగే తన్వి అజ్మీ మేనకోడలు.
కెరీర్
[మార్చు]2015లో తెలుగు చిత్రం రేయ్‌తో రంగప్రవేశం చేసిన సయామీఖేర్, ఆ తర్వాత సంవత్సరంలో హర్షవర్ధన్ కపూర్ సరసన రాకేష్ ఓంప్రకాష్ మెహ్రా పంజాబీ జానపద కథ మీర్జా సాహిబాన్ ఆధారిత హిందీ చిత్రం మిర్జ్యాలో కనిపించింది.[2] ఆమె 2020లో అభిషేక్ బచ్చన్‌తో కలిసి మయాంక్ శర్మ వెబ్ సిరీస్ బ్రీత్‌లో కనిపించింది. ఆమె వైల్డ్ డాగ్ (2021 సినిమా)లో నాగార్జున అక్కినేనితో NIA ఏజెంట్‌గా నటించింది. ఈ చిత్రం థియేటర్లలో ఏప్రిల్ 02, 2021న విడుదలైంది. తర్వాత, ఇది నెట్‌ఫ్లిక్స్ ఇండియాలో వచ్చింది.
ఫిల్మోగ్రఫీ
[మార్చు]సినిమాలు
[మార్చు]సంవత్సరం | సినిమా | పాత్ర | భాష | ఇతర విషయాలు |
---|---|---|---|---|
2015 | రేయ్ | అమృత | తెలుగు | |
2016 | మిర్జ్యా | సుచిత్ర | హిందీ | |
2018 | మౌళి | రేణుక | మరాఠీ | |
2020 | చోక్డ్ | సరితా పిళ్లై | హిందీ | |
అన్పాజ్డ్ | అయేషా హుస్సేన్ | |||
2021 | వైల్డ్ డాగ్ | ఆర్య పండిట్ | తెలుగు | |
2022 | హైవే | తెలుగు |
వెబ్ సిరీస్
[మార్చు]Year | Title | Role | Notes |
---|---|---|---|
2020 | స్పేషల్ OPS | జుహీ కశ్యప్ | |
బ్రీత్: ఇన్టు ది షాడోస్ | షిర్లీ |
అవార్డులు
[మార్చు]స్టార్‌డస్ట్ అవార్డ్ ఫర్ సూపర్‌స్టార్ ఆఫ్ టుమారో – ఫిమేల్ : మిర్జ్యా.
మూలాలు
[మార్చు]- ↑ Pawar, Yogesh (24 July 2016). "Acting in her blood". Daily News & Analysis. Retrieved 3 September 2016.
- ↑ Jha, Subhash K. "Saiyami Kher is my Sahibaan". Pinkvilla. Archived from the original on 30 ఏప్రిల్ 2019. Retrieved 21 April 2014.