హైవే (2022 సినిమా)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
హైవే
దర్శకత్వంకేవీ గుహన్‌
రచనకేవీ గుహన్‌
నిర్మాత
 • వెంకట్‌ తలారి
తారాగణం
ఛాయాగ్రహణంకేవీ గుహన్‌
సంగీతంసైమన్‌.కె.కింగ్‌
నిర్మాణ
సంస్థ
శ్రీఐశ్వర్య లక్ష్మీమూవీస్‌
విడుదల తేదీ
19 ఆగస్టు 2022 (2022-08-19)
దేశంభారతదేశం
భాషతెలుగు

హైవే 2022లో తెలుగులో విడుదలైన సైకో క్రైమ్‌ థ్రిల్లర్‌ సినిమా. శ్రీఐశ్వర్య లక్ష్మీమూవీస్‌ బ్యానర్‌పై వెంకట్‌ తలారి నిర్మించిన ఈ సినిమాకు కేవీ గుహన్‌ దర్శకత్వం వహించాడు. ఆనంద్ దేవరకొండ, మానస రాధాకృష్ణన్‌, స‌త్య‌, అభిషేక్ బెనర్జీ, సైయామీ ఖేర్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా టీజర్‌ను ఆగ‌స్టు 9న విడుదల చేసి[1], సినిమాను ఆగ‌స్టు 19న ఆహాలో విడుదల చేశారు.[2]

క‌థ‌

[మార్చు]

విష్ణు (ఆనంద్ దేవరకొండ) ఓ ఫొటోగ్రాఫ‌ర్‌. ప్రీ వెడ్డింగ్ షూట్ కోసం తన స్నేహితుడు స‌ముద్రం (సత్య)తో క‌లిసి వైజాగ్ నుండి బెంగ‌ళూరు బ‌య‌లుదేరుతాడు. మంగ‌ళూరులో ఉన్న త‌న తండ్రిని క‌లుసుకోవ‌డానికి తుల‌సి (మానస రాధాకృష్ణన్) ఒంట‌రిగా బ‌య‌లుదేరుతుంది. మ‌ధ్యలో బ‌స్ మిస్ కావ‌డంతో ఆమెకు విష్ణు లిఫ్ట్ ఇస్తాడు. కొద్ది ప‌రిచ‌యంలోనే తుల‌సితో విష్ణు ప్రేమ‌లో ప‌డ‌తాడు. హైద‌రాబాద్ న‌గ‌రంలో సైకో కిల్ల‌ర్ (అభిషేక్ బెనర్జీ) వ‌రుస‌గా యువతులను హ‌త్య చేస్తుంటాడు. అత‌డిని ప‌ట్టుకోవ‌డానికి పోలీస్ ఆఫీస‌ర్ ఆశా భరత్ (సయామీఖేర్) ప్ర‌య‌త్నిస్తుంటుంది. పోలీస్ నిఘా పెరిగిపోవ‌డంతో సైకో కిల్ల‌ర్ బెంగ‌ళూరు పారిపోతుండగా మార్గ‌మ‌ధ్యలో తుల‌సి క‌నిపించ‌డంతో ఆమెను కిడ్నాప్ చేస్తాడు. సైకో కిల్ల‌ర్ బారి నుండి తుల‌సి ర‌క్షించ‌డానికి విష్ణు ఎలాంటి సాహ‌సం చేశాడు? పోలీస్ ఆఫీస‌ర్‌తో క‌లిసి విష్ణు అత‌డిని ప‌ట్టుకున్నాడా ? లేదా అనేదే మిగతా సినిమా కథ.[3]

నటీనటులు

[మార్చు]

సాంకేతిక నిపుణులు

[మార్చు]
 • బ్యానర్: శ్రీఐశ్వర్య లక్ష్మీమూవీస్‌
 • నిర్మాత: వెంకట్‌ తలారి
 • కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: కేవీ గుహన్‌
 • సంగీతం: సైమన్‌.కె.కింగ్‌
 • సినిమాటోగ్రఫీ: కేవీ గుహన్‌
 • పాటలు: అనంత్ శ్రీరామ్ , శ్రీమణి
 • డైలాగ్స్: మిర్చి కిరణ్, సాయికిరణ్ సుంకోజు
 • ఎడిటర్: తమ్మిరాజు

మూలాలు

[మార్చు]
 1. Namasthe Telangana (10 August 2022). "ఆస‌క్తి రేకెత్తిస్తున్న ఆనంద్ దేవ‌ర‌కొండ 'హైవే' టీజ‌ర్‌". Archived from the original on 19 August 2022. Retrieved 19 August 2022.
 2. Eenadu (15 August 2022). "ఈ వారం వచ్చేవన్నీ చిన్న చిత్రాలే.. మరి ఓటీటీ మాటేంటి?". Archived from the original on 19 August 2022. Retrieved 19 August 2022.
 3. NTV Telugu (19 August 2022). "హైవే రివ్యూ (ఓటీటీ)". Archived from the original on 19 August 2022. Retrieved 19 August 2022.
 4. "Bollywood actor Abhishek Banerjee all set to make his Tollywood with the upcoming thriller 'Highway'" (in ఇంగ్లీష్). 6 August 2022. Archived from the original on 19 August 2022. Retrieved 19 August 2022.