మానస రాధాకృష్ణన్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
మానస రాధాకృష్ణన్
మానస రాధాకృష్ణన్
జననం (1998-09-29) 1998 సెప్టెంబరు 29 (వయసు 26)
ఎర్నాకులం, కేరళ, భారతదేశం
విద్యాసంస్థ
  • ది ఇండియన్ హై స్కూల్, దుబాయ్
  • ది ఛాయిస్ స్కూల్
క్రియాశీల సంవత్సరాలు
  • 2008 – 2014
  • 2017 – ప్రస్తుతం

మానస రాధాకృష్ణన్ (జననం 1998 సెప్టెంబరు 29) భారతీయ నటి, ఆమె ప్రధానంగా మలయాళ చిత్రాలలో నటిస్తుంది. 2022లో వచ్చిన మిస్టరీ క్రైమ్ థ్రిల్లర్ చలనచిత్రం హైవే (2022)తో ఆమె తెలుగుతెరకు పరిచయం అయింది.[1] తిరిగి దర్శకుడు రామ్ గోపాల్ వర్మ 2023లో రూపొందించబోతున్న పొలిటికల్ చిత్రం వ్యూహంలో కూడా ఆమె ప్రధానపాత్రలో నటించనుంది. ఈ చిత్రంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పాత్రను అజ్మల్ అమీర్ పోషిస్తుండగా, వైఎస్ భారతి పాత్రలో ఆమె చేస్తోంది.[2]

బాల్యం, విద్యాభ్యాసం

[మార్చు]

ఆమె కేరళలోని ఎర్నాకులంలో రాధాకృష్ణన్ వి. కె., శ్రీకళ దంపతులకు జన్మించింది. అయితే దుబాయ్‌లో పెరిగింది. ఆమె 10వ తరగతి వరకు దుబాయ్‌లోని ఇండియన్ హై స్కూల్‌(The Indian High School, Dubai)లో చదివింది. అయితే ఆమె ఉన్నత విద్యను తిరిగి కేరళలోని త్రిప్పునితురలోని ది ఛాయిస్ స్కూల్‌లో జరిగింది. ఆమె భారతీయ శాస్త్రీయ నృత్యం, సినిమాటిక్ డ్యాన్స్, గిటార్ నేర్చుకుంది. ప్రస్తుతం ఆమె ముత్తూట్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ (MITS)లో కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్ చదువుతోంది.[3][4]

కెరీర్

[మార్చు]

2008లో వచ్చిన కన్నునీరినుం మధురం చిత్రంతో బాలనటిగా ఆమె తొలిసారిగా నటించింది.[5] ఆమె కదక్షం, పౌలెట్టంటే వీడు, బాలస, విల్లాలి వీరన్‌లో కూడా బాలనటిగా చేసింది.[6] పృథ్వీరాజ్ సుకుమారన్, ఇంద్రజిత్ సుకుమారన్ ప్రధాన పాత్రల్లో నటించిన తియాన్‌లో ఆమె ఒక ముఖ్యమైన పాత్ర పోషించింది.[7] ఆమె కట్టు, వికడకుమారన్‌లో కథానాయికలుగా నటించింది.[8][9] పరమగురు సినిమాతో తమిళంలోకి అడుగుపెట్టనుంది.[10]

నటించిన సినిమాలు

[మార్చు]
సంవత్సరం శీర్షిక పాత్ర గమనికలు
2008 కన్నునీరినుం మధురం పార్వతి బాల నటుడు
2010 కదక్షం మాలు బాల నటుడు
2014 విల్లాలి వీరన్ సాండ్రా బాల నటుడు
2016 పాలేట్టంటే వీడు సారా పాల్
2017 తియాన్ జసీలా తొలిచిత్రం
2017 కట్టు ఉమ్ముక్కుల్సు
2017 క్రాస్‌రోడ్ సారా విభాగం: మౌనం
2018 వికడకుమారన్ సింధు
2019 సకలకళాశాల ముంతాజ్ [11]
చిల్డ్రన్స్ పార్క్ ప్రార్థన
2020 ఉరియది రేణుక [12] [13]
2022 ట్వంటీ వన్ జైమ్స్ అంజలి
పాపన్ యంగ్ బెన్నిట్టా ఇస్సాక్
2022 హైవే తులసి తెలుగు తొలిచిత్రం
పరమగురువు తమిళ సినిమా
2023 వ్యూహం వైఎస్ భారతి వైఎస్ జగన్ ఆంధ్రా సీఎం రామ్ గోపాల్ వర్మ సినిమా[14]

మూలాలు

[మార్చు]
  1. Jha, Lata (2022-08-14). "Telugu service aha Video to stream new thriller 'Highway'". Mint (in ఇంగ్లీష్). Retrieved 2022-08-31.
  2. "RGV Vyooham : వర్మ 'వ్యూహం' మూవీలోని వైఎస్ జగన్, భారతి పాత్రల స్టిల్స్.. - 10TV Telugu". web.archive.org. 2023-06-01. Archived from the original on 2023-06-01. Retrieved 2023-06-01.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)
  3. Kattu girl Manasa Radhakrishnan on her roles and movies
  4. "ഇപ്പോഴും മധുരമുണ്ട് ആ ഓർമകൾക്ക്: മാനസ".
  5. James, Anu (6 July 2017). "Kaattu: Meet Left Right Left director's new unibrow heroine Manasa Radhakrishnan aka Ummukkulsu". International Business Times. Retrieved 24 July 2017.
  6. "Manasa Radhakrishnan to make Sandalwood debut". Archived from the original on 2023-04-26. Retrieved 2023-06-01.
  7. ചിന്തിച്ച് കൂട്ടി ജീവിതം കോംപ്ലക്‌സ് ആക്കുന്നതെന്തിന് ? ബാലതാരമായി വന്ന് നായികയായി മനം കവർന്ന മാനസ- മാതൃഭൂമി[permanent dead link]
  8. I watched Chemmeen to play Ummukhulsu : Manasa Radhakrishnan
  9. "Manasa Radhakrishnan is the leading lady in 'Vikatakumaran' - Times of India". The Times of India.
  10. "Manasa to play Sasikumar's heroine in Tamil film - Times of India". The Times of India.
  11. "'സകലകലാശാല' നാളെ തുറക്കും; വിശേഷങ്ങളുമായി വിനോദ് ഗുരുവായൂരും മാനസയും". Manoramanews.
  12. "മാനസയുടെ പുതിയ ചിത്രം 'ഉറിയടി'".
  13. "'ഉറിയടി എന്ന ടൈറ്റില്‍ മന:പൂര്‍വം കൊടുത്തതാണ്', നായിക പറയുന്നു".
  14. TV9 Telugu (26 June 2023). "ఆర్జీవీ వ్యూహం సినిమాలో వైయస్ జగన్ భార్యగా నటించిన ఈమె ఎవరో తెలుసా..? ఆమె బ్యాగ్రౌండ్ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే". Archived from the original on 14 October 2023. Retrieved 14 October 2023.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)