పృథ్వీరాజ్ సుకుమారన్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పృథ్వీరాజ్ సుకుమారన్
2009లో పృథ్వీరాజ్ సుకుమారన్
జననం
పృథ్వీరాజ్ సుకుమారన్

(1982-10-16) 1982 అక్టోబరు 16 (వయసు 41)
వృత్తినటుడు, నిర్మాత, ప్లేబ్యాక్ సింగర్
క్రియాశీల సంవత్సరాలు2002 – ప్రస్తుతం
జీవిత భాగస్వామిసుప్రియా మీనన్ (2011)
బంధువులుసుకుమారన్ (నాన్న)
మల్లికా సుకుమారన్ (తల్లి)
ఇంజిత్ సుకుమారన్ (అన్న)
పూర్ణిమ ఇంజిత్ (మరదలు)
పురస్కారాలుకేరళ స్టేట్ ఫిల్మ్ అవార్డ్
ఉత్తమ నటుడిగా కేరళ రాష్ట్ర చలనచిత్ర పురస్కారం: ఉత్తమ నటుడు - 2006, 2012
వెబ్‌సైటుwww.augustcinemaindia.com

పృథ్వీరాజ్ సుకుమారన్ (జననం: 1982 అక్టోబరు 16) మలయాళ నటుడు, దర్శకుడు, నిర్మాత, నేపథ్య గాయకుడు.[1] ఇతను మలయాళం, తమిళం, తెలుగు, హిందీ భాషా చిత్రాలలో నటించాడు.[2] 2002లో మలయాళ సినిమా నందనంతో సినీ రంగ ప్రవేశం చేసాడు. ఇతను 2006లో ఉత్తమ నటుడిగా కేరళ రాష్ట్ర చలనచిత్ర అవార్డును గెలుచుకున్నాడు.

వ్యక్తిగత జీవితం[మార్చు]

పృథ్వీరాజ్ 1982 అక్టోబరు 16న కేరళలోని తిరువనంతపురంలో జన్మించాడు. ఇతని తండ్రి సుకుమారన్ నటుడు,[3] తల్లి మల్లికా సుకుమారన్ కూడా నటి. 2011 ఏప్రిల్ 25న, ఇతను బిబిసి ఇండియా టీవీ ప్రతినిధి సుప్రియా మీనన్‌ను వివాహం చేసుకున్నాడు.[4] ఇతను 2002లో 19 సంవత్సరాల వయస్సులో నందనం చిత్రంతో మలయాళ చలనచిత్ర రంగ ప్రవేశం చేసాడు. ఆ తరువాత తమిళం, తెలుగు, హిందీ చిత్రాలలో నటించాడు. ఇతను ఆగస్టు సినిమా అనే చిత్ర నిర్మాణ సంస్థను నడుపుతున్నాడు. ఈ చిత్ర సంస్థ ద్వారా ఉరుమి, ఇండియన్ రూపాయి, సముద్రపు రుణం, ఓరు బేరం, డబుల్ బ్యారెల్, బ్రో డాడీ వంటి చిత్రాలను నిర్మించి అనేక అవార్డులను గెలుచుకున్నాడు.

నేపథ్య గానం[మార్చు]

పృథ్వీరాజ్, పుతియా ముఖం (2009) లో చిత్ర టైటిల్ సాంగ్‌ “కానే కానే” పాడటం ద్వారా గాయకుడిగా పరిచయం అయ్యాడు.

సంవత్సరం పాట సినిమా
2009 "కానే కానే" పుతియా ముఖం
2010 "కట్టు పరంజతుం" తంథోన్ని
2010 "కెత్తిల్లే కెత్తిల్లే" పొక్కిరి రాజా
2010 "న్జన్" అన్వర్
2011 "వడక్కు వడక్కు" ఉరుమి
2012 "టార్జాన్ ఆంటోనీ కమింగ్ బ్యాక్ టు సినిమా" హీరో
2014 "ఒరు కదా పరయున్ను లోకం" 7వ రోజు
2015 "ఇవిడ్" ఇవిడ్
2015 "ప్రేమమెన్నాల్" అమర్ అక్బర్ ఆంటోనీ
2017 "అరికిల్ ఇని నజన్ వరం" ఆడమ్ జోన్
2020 "అడకచక్కో" అయ్యప్పనుమ్ కోషియుమ్
2022 "థాటక తీతరే" హృదయం

నటించిన సినిమాల పాక్షిక జాబితా[మార్చు]

వ్యాఖ్యాత[మార్చు]

  • మంజడికూరు (2008)
  • ఓరు సెకండ్ క్లాస్ యాత్ర (2015)
  • ఇవిడ్ (2015)
  • ఛానెల్ (2015)
  • మోహన్ లాల్ (2018)
  • రణం (2018)

అవార్డులు, నామినేషన్లు[మార్చు]

అవార్డు సంవత్సరం కేటగిరి సినిమా
జాతీయ చలనచిత్ర అవార్డులు 2011 మలయాళంలో ఉత్తమ చలనచిత్రం ఇండియన్ రూపాయి
కేరళ రాష్ట్ర చలనచిత్ర అవార్డులు 2006 ఉత్తమ నటుడు వాస్తవం
2011 ఉత్తమ చిత్రం ఇండియన్ రూపాయి
2012 ఉత్తమ నటుడు సెల్యులాయిడ్ అయలుమ్జ అనుమ్ తమ్మిల్
ఫిలింఫేర్ అవార్డ్స్ సౌత్ 2013 క్రిటిక్స్ అవార్డ్ ఫర్ బెస్ట్ యాక్టర్ – సౌత్ సెల్యులాయిడ్
తమిళనాడు రాష్ట్ర చలనచిత్ర అవార్డులు 2014 ఉత్తమ విలన్ కావ్య తలైవన్ [5]

ఇవి కూడా చూడండి[మార్చు]

మూలాలు[మార్చు]

  1. Gauri, Deepa. "Prithviraj: The director's actor". Khaleej Times. Retrieved 2022-04-02.
  2. "What does Bollywood have against the south Indian hero?". web.archive.org. Archived from the original on 2017-02-20. Retrieved 2022-04-02.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)
  3. "Hope I make you proud: Prithviraj on father Sukumaran's death anniversary". OnManorama. Retrieved 2022-04-02.
  4. "Prithviraj: No more a bachelor boy". The New Indian Express. Retrieved 2022-04-02.
  5. "Full list of the Tamil Film Awards from 2009-2014 announced by the TN govt". The Hindu. 2017-07-14. ISSN 0971-751X. Retrieved 2022-04-02.