ఛంఘిజ్ ఖాన్ (పుస్తకం)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఛంఘిజ్ ఖాన్
ఛంఘిజ్ ఖాన్ పుస్తకం ముందు అట్ట
రచయిత(లు)తెన్నేటి సూరి
దేశంభారతదేశం
భాషతెలుగు
విషయంచారిత్రిక నవల
శైలిచరిత్ర
ప్రచురణ కర్తవిశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్
ప్రచురించిన తేది
2002 డిసెంబరు
పుటలు332

ఛెంఘిజ్ ఖాన్ నవలను తెన్నేటి సూరి రచించారు. ఇది ప్రముఖ చారిత్రిక వ్యక్తి, మంగోల్ సామ్రాజ్య స్థాపకుడు ఛెంఘిజ్ ఖాన్ జీవితాన్ని ఆధారంగా చేసుకుని రాసిన చారిత్రిక నవల.

రచన నేపథ్యం

[మార్చు]

జర్మన్ చరిత్రకారులు సంకుచిత దృష్టితో ఛెంఘిజ్ ఖాన్ను రాక్షసునిగా, సైనికశక్తితో మాత్రమే సామ్రాజ్యాన్ని నిర్మించినవాడిగా చూపడంతో సైనికశక్తితో కఠిన శాసనంతో ప్రపంచాన్ని జయించవచ్చు అనే దురభిప్రాయం కలిగిన హిట్లర్ తయారయ్యాడని తెన్నేటి సూరి పేర్కొన్నారు. యూరప్ చరిత్ర పండితులు మొండిగా ఛెంఘిజ్ ఖాన్ ఒక రాక్షసుడు అని వాదిస్తూ లక్షల జనహననానికి కారకుడైన రాక్షసుణ్ణి తయారు చేశారనీ, మరోవైపు నెహ్రూ వంటి రాజనీతివేత్తలు ఆరోగ్యకరమైన దృక్పథంతో చరిత్రను అర్థంచేసుకుని "ఛెంఘిజ్ ఖాన్ నా ఆదర్శవీరుడు(హీరో) అని ప్రకటించుకున్నారని సూరి వివరించారు. ఈ నేపథ్యంలో చరిత్రకారులు హెచ్.ఎ.వేల్స్ దంపతులు రచించిన ఛెంఘిజ్ ఖాన్ చరిత్రను ప్రామాణికంగా తీసుకుని, ఛెంఘిజ్ ఖాన్ యెక్కామంగోలు తెగకు నాయకత్వం వహించేనాటికి ఆసియాలో ఉన్న రాజకీయ నేపథ్యం, ఛెంఘిజ్ ఖాన్ ఏ పరిస్థితుల్లో అంతటి జనహననం చేశాడు వంటి విశేషాలు తెలియజేస్తూ ఈ నవల రాశారు.

ఇతివృత్తం

[మార్చు]

యెక్కామంగోల్ తెగ నాయకుడు యాసుకై ఖాన్ మరో తెగ నుంచి ఒక అమ్మాయిని ఎత్తుకుపోయి భార్యగా చేసుకోవడంతో నవల ప్రారంభమౌతుంది. కొంత ఘర్షణ అనంతరం ఆమె అన్న కరాచర్ ప్రోద్బలంతో యాసుకైను భర్తగా అంగీకరించి తాను తెగకు రాణిగా స్థిరపడుతుంది. ఆమెకు, యాసుకైకు మగబిడ్డ చేతిలో గోపురం వంటి మాంసపుముద్ద(జగజ్జేతకు మంగోలు తెగల్లో చిహ్నం)తో జన్మిస్తాడు.